బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.
నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
#WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.
Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024
మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment