న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.
కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు(సోమవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ ప్రాంతంలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సెప్టెంబర్ 11 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
ఇది చదవండి: Surat: వినాయక మండపంపై రాళ్ల దాడి.. పలువురు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment