
న్యూఢిల్లీ: రానున్న ఐదు రోజుల పాటు తూర్పు, దక్షిణ భారతాల్లో హీట్‌వేవ్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిషా తీర ప్రాంతాలతో పాటు సిక్కిమ్, కర్ణాటకలో భానుడు నిప్పులు కురిపించనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, రాయలసీమ, తెలంగాణలోనూ హీట్‌వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపింది. పశ్చిమబెంగాల్‌కు మాత్రం ఐఎండీ రెడ్‌అలర్ట్ ఇచ్చింది. అన్ని వయసుల వారు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. అయితే దేశంలోని ఈశాన్య ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment