కళ్యాణ వైభోగమే
నేడు భీమేశ్వరస్వామి సన్నిధిలో స్వామివార్ల కల్యాణోత్సవాలు,
అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనారసింహుని వివాహ వేడుక
రేపు జి.మామిడాడలో సూర్యనారాయణమూర్తి, పుట్టకొండ లక్షీ్మనరసింహస్వామి,
పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలో జనార్దునుడి కల్యాణాలు
కల్యాణ మహోత్సవాల సందడితో ఆలయాలు కళకళలాడుతున్నాయి. కల్యాణకాంతులు విర జిమ్ముతున్నాయి. ఆకాశ పందిళ్లు.. భక్తుల సందళ్లతో కల్యాణతంతు కడు రమణీయంగా.. కమనీయంగా సాగనున్నాయి. మేళతాళాల మధ్య స్వామివార్లు పరిణయ వేడుకకు సిద్ధమయ్యారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, చండికా సమేత సూర్యేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలు సోమవారం జరగనున్నాయి. మంగళవారం జి.మామిడాడలో సూర్య నారాయణ మూర్తి, పుట్టకొండలో లక్ష్మీనరసింహస్వామి, పిఠాపురంలో కుంతీమాధవస్వామి, ధవళేశ్వరంలోని ధవళగిరిపై వేంచేసిన జనార్దనుడి కల్యాణాలు మంగళవారం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పెదపూడి :
మండలంలోని జి.మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య వేదమార్గ ప్రతిషా్ఠపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో ఈనెల 7న భీష్మ ఏకాదశి మంగళవారం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కార్య నిర్వాహణాధికారి మోర్త మురళీ వీరభద్రరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మ¯ŒS కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బాణసంచా సిద్ధం చేశారు. బాణసంచా పోటీల్లో గెలుపొందిన వారికి కాసు బంగారం బహుమతి ఇస్తారు.
కల్యాణం రోజున ఆలయంలో జరిగే కార్యక్రమాలు ఇవే..
ఈ నెల3న రథసప్తమితో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల11తో ముగిస్తాయి. 7న భీష్మ ఏకాదశి, స్వామి వారి కల్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం ఐదు గంటలకు నిత్యోపాసన, విశేషహోమం, బలిహరణ, ఎనిమిది గంటలకు «ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో అన్నసమారాధన, మధ్యాహ్నం 12.35 గంటకు శ్రీవారి రథోత్సవం, రాత్రి ఏడు గంటలకు కనులపండువగా స్వామి వారి కల్యాణం జరుగుతుంది.
కల్యాణ మహోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాలు 8న ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, 9న నిత్యార్చన, నిత్యహోమాలు, శ్రీవారికి సదస్య మహోత్సవం10న స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం,∙11న పవిత్ర తుల్యభాగనది తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహాపూర్ణాహుతి, ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.