
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్ తుపాను’ ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం ఉత్తరం దిశగా ప్రయాణించి తర్వాత దిశ మార్చుకొని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశముందని తెలిపింది.