సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. వచ్చే పది రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి.. పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
కాగా, వర్షాల కారణంగా తగ మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త పడిపోయాయి. వచ్చే పది రోజులపాటు అంటే.. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అంచనా వేసింది.
రాజస్థాన్ మీదుగా నైరుతి రుతుపవనాలు తుఫానుగా మారి కోస్తా కర్ణాటక వరకు వ్యాపించాయని తెలిపింది. మరో ఐదురోజులపాటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది. మరోవైపు గురు, శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment