సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు నిండి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాతావరణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నుంచి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. నేటిం నుంచి శనివారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నిజామాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
♦️ తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.#WeatherForecast #rains #Telangana #weatheralert pic.twitter.com/NrIupV9JqF
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 12, 2023
ఏపీకి వర్ష సూచన..
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోని మధ్య భాగాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి ఉపరితల ఆవర్తనం ప్రాంతం వరకు మరో ద్రోణి పయనిస్తోంది. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణకోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆఫ్రికాకు ప్రకృతి శాపం! నాలుగు రోజుల గ్యాప్‌లో 6వేల మంది మృతి!
Comments
Please login to add a commentAdd a comment