technology companies
-
మడిచే స్క్రీన్.. వాక్ చేయించే షూస్!
టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచిస్తూ కంపెనీలు తమ వినియోగదారులకు అవసరాలు తీర్చేందుకు అనువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, వాటిని ప్రదేర్శించేందుకు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(CES) వేదికగా మారింది. 2025వ సంవత్సరానికిగా ఇది లాస్‌వెగాస్(Los Vegas)లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గతేడాదిలోని కొన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.మడిచే స్క్రీన్, ప్రొజెక్టర్అరోవియా కంపెనీ ‘స్ప్లే’ అనే ఫోల్డబుల్ స్క్రీన్, ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించింది. మడిచేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.The world's largest consumer tech event, CES 2025, kicks off this week.While we wait, here the top 10 reveals from last year’s CES:1. Arovia's "SPLAY" is a Mix of a Projector and a Foldable Screenpic.twitter.com/mgThrmbvkG— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ట్రాన్స్పరెంట్ ఎల్ఈడీ స్క్రీన్2024 సీఈఎస్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక మైక్రో ఎల్ఈడీ స్క్రీస్ను శాంసంగ్ కంపెనీ ఆవిష్కరించింది. క్రిస్టల్ క్లియర్ డిస్ ప్లే దీని సొంతం.2. Samsung introduces the world's first transparent MicroLED screenpic.twitter.com/5G3HKKpDaB— Angry Tom (@AngryTomtweets) January 5, 2025బ్లాక్‌బెరీ కీబోర్డ్గతంలో మొబైల్ ఫోన్లను తయారు చేసిన బ్లాక్‌బెరీ కంపెనీ సీఈఎస్ 2024లో వినూత్న ఆవిష్కరణ చేసింది. టచ్ ఫోన్‌ను తాకకుండా టైపింగ్ చేసేందుకు వీలుగా ఫిజికల్ కీబోర్డును ఆవిష్కరించింది. ఫోన్లోని కొన్ని సెన్సార్ల సాయంతో ఇది పని చేస్తుంది.3. Want the old Blackberry physical keyboard back?pic.twitter.com/gedSBWKhwS— Angry Tom (@AngryTomtweets) January 5, 2025వేగంగా వాక్ చేయించే షూస్షిఫ్ట్ రొబోటిక్స్ సంస్థ మూన్‌వాకర్స్ ఎక్స్ పేరుతో వేగంగా వాక్ చేయించేందుకు వీలుగా ఉండే షూస్‌ను ఆవిష్కరించింది. ఈ షూస్‌తో గంటకు 7 మైళ్లు(12 కి.మీ) వాక్ చేసే సదుపాయం ఉంటుంది.4. $1,400 Moonwalkers X by Swift that go 7 mphpic.twitter.com/H4I51qDXok— Angry Tom (@AngryTomtweets) January 5, 2025ఎగిరే కారుచైనాకు చెందిన ఎక్స్‌పెంగ్ ఏరోహెచ్‌టీ అనే కంపెనీ ‘ఫ్లైయింగ్కార్’ను ఆవిష్కరించింది.5. Chinese electric e-car maker XPeng Aeroht unveiled a "flying car"pic.twitter.com/VsnwdQvwlR— Angry Tom (@AngryTomtweets) January 5, 2025స్మార్ట్ టాయిలెట్కోలర్ కంపెనీ సెన్సార్లతో పని చేసే స్మార్ట్ టాయిలెట్‌ను ఆవిష్కరించింది. ఇది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.7. $8,500 smart toilet from Kohlerpic.twitter.com/omGaeB4tM2— Angry Tom (@AngryTomtweets) January 5, 2025 -
స్థానిక భాషలో సమాచారం కోసం సంస్థల సహకారం
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా సమాచారం అందించే వికీమీడియా ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024’ను నిర్వహించింది. ఇటీవల మూడు రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్‌లో స్థానిక భాషలోని సమాచారాన్ని ఇతర భాషలో అందించేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు ప్రధానపాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గనడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.దేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న వారికి ఈ సమ్మిట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందని ఐఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాధికా మామిడి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐ4భారత్, బిట్స్ పిలానీ, సీఐఎస్, ఐఐఐటీ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నిపుణులు కలిసి దేశీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధిపై మాట్లాడారు. రియల్‌టైమ్ కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే సాంకేతికతపై చర్చించారు. వికీమీడియా ఫౌండేషన్ అనుసరిస్తున్న కొన్ని ఫీచర్లు, సాధనాలపై మాట్లాడారు. మొబైల్ ఎడిటింగ్, వాయిస్, ఇమేజ్ ఆధారిత స్క్రిప్ట్‌లు, వికీమీడియా కమ్యూనిటీలు, వర్క్‌షాప్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: 100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్భారతీయ భాషల్లో వివిధ విభాగాలకు చెందిన సమగ్ర కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనువుగా ఆన్లైన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో వికీమీడియా, వికీపీడియా వంటి సంస్థలు విద్యార్థుల సాయం తీసుకుంటున్నాయి. ఫలితంగా ఓపెన్స్సోర్స్ టూల్స్ ద్వారా నేరుగా కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు వారి సహకారాన్ని కోరుతున్నాయి. -
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్‌కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు: అరకోటి మంది టెకీలు వీటిలోనే..
ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్‌గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది. ▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా మారింది. ▶ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. ▶యునైటెడ్ స్టేట్స్కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది. ▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. -
భారత ఏఐ మోడల్ ఎలా ఉండాలి?
కృత్రిమ మేధ విప్లవాన్ని అమెరికాలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు ముందుకు తోస్తూంటే, చైనాలో అది ప్రభుత్వ మద్దతుతో సాగుతోంది. మరి ఈ విషయంలో భారత్ ఏం చేయాలి? భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఒకదాన్ని తయారు చేయడం కష్టమేమీ కాదు. కాకపోతే వీటికి పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా, చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది ముందు నిర్ణయించుకోవాలి. మనం మూడో మార్గం అనుసరించడం మేలు. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందరి డిజిటల్ హితం కోసం దాన్ని ‘జన్ ఏఐ’ మోడల్‌గా తీర్చిదిద్దాలి. వీడియోలు సృష్టించడంలో ఛాట్‌జీపీటీకి ఉన్న సామర్థ్యం ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు... పది కోట్ల మంది దాన్ని వినియోగించేలా చేసింది. ‘ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్’ (ఎల్ఎల్ఎం), అలాగే జనరేటివ్ ఏఐకి శక్తినిచ్చే విషయాలన్నీ... ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వంటివాటిని సమూలంగా మార్చేసే అద్భుత టెక్నాల జీలనడంలో సందేహం లేదు. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కృత్రిమ మేధను ‘ఫైర్’(మంట) అని వర్ణిస్తే, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల సమూల మార్పునకు నాందిగా అభివర్ణించారు. మరోవైపు గోల్డ్‌మాన్ శాక్స్ లాంటి సంస్థలు జనరేటివ్ ఏఐ కారణంగా రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ స్థూల జాతీయోత్పత్తికి కనీసం ఏడు లక్షల కోట్ల డాలర్ల మొత్తం చేరుతుందని అంచనా వేస్తోంది. అయితే ఈ సానుకూల అంశాలతోపాటు ఉద్యోగాలు కోల్పోవడం, మానవ ప్రమేయం తగ్గిపోవడం వంటి కొన్నింటిపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఏఐ సూపర్ ఇంటెలిజెన్ ్సతో మనిషికి ముప్పు అన్న భావన కూడా పెరుగుతోంది. అలాగే వివక్ష, పర్యావరణ నష్టం, ప్రజాస్వామ్యానికి ముప్పు వంటి అంశాలూ చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి జనరేటివ్ ఏఐ విషయంలో కార్యకలాపాలు ఎక్కు వగా అమెరికా, చైనాల్లోనే జరుగుతున్నాయి. రెండింటిలోనూ వ్యవస్థల నిర్మాణం, ప్రపంచాన్ని చూసే దృష్టి పూర్తిగా వేరు. అమె రికాలో పెద్ద టెక్ కంపెనీలు ఏఐ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూండగా, చైనా భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తోంది. చైనా కంపెనీలు ప్రభుత్వంతో కలిసి సొంత జనరేటివ్ ఏఐ మోడళ్లు తయారు చేస్తున్నాయి. సమాచారం, సందర్భాలు రెండింటినీ పరిగ ణనలోకి తీసుకునేలా చైనా తన జనరేటివ్ ఏఐ మోడళ్లను నిర్మిస్తోంది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు ఎవరికివారు తమదైన రీతిలో వ్యవహరిస్తున్నారు. అది కూడా పరిమితమైన పరిధిలో. జనరేటివ్ ఏఐ నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా దాన్ని నియంత్రించడంపై యూరోపియన్ యూనియన్ దృష్టి పెట్టింది. యునైటెడ్ కింగ్డమ్ కూడా ఏఐ ఆధారిత పరిపాలన విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యిస్తోంది. భారత్ స్థానమెక్కడ? అంతా బాగానే ఉంది కానీ... ఏఐ ఆధారిత ప్రపంచంలో భారత్ స్థానమెక్కడ? మేమూ సొంతంగా ఎల్ఎల్ఎం ప్లాట్‌ఫామ్స్ సిద్ధం చేసుకుంటామని ఈ మధ్యకాలంలో కొన్ని ప్రకటనలు వచ్చాయి. హడావుడి కూడా కనిపించింది కానీ... ఛాట్‌జీపీటీ çసృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ వీటిపై తన అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే, భారతీయ కంపెనీలు, ప్రభుత్వం చేతులు కలిపితే స్థానికంగానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకదాన్ని తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. భారతీయ భాషలు, కాంటెక్స్›్టతో కూడిన సమాచారాన్ని అందివ్వడం ద్వారా ఈ ఎల్ఎల్ఎంను వినూ త్నంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఇలాంటి ప్రయత్నం చేసేముందు మన లక్ష్యం, ఉద్దేశం ఏమిటన్నది స్పష్టం చేసుకోవడం చాలా ముఖ్యం. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించాలా? లేక చైనా తరహాలో ప్రభుత్వ నియంత్రణలో ఈ ఎల్ఎల్ఎంలను ఉంచాలా? అన్నది తేల్చుకోవాలి. మాకైతే మూడో మార్గం మేలని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన మార్గమే ఇది. చాలా సాహసోపేతమైందే కావచ్చు. కానీ భారత్ తన జనరేటివ్ ఏఐని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. డిజిటల్ పబ్లిక్ గుడ్ కోస మన్నమాట. దీన్ని ప్రజల కోసం ‘జన్ ఏఐ’ లేదా ‘జెన్ ఏఐ’ అని పిలుచుకుందాం. సామాజిక వృద్ధి కోసం... భారత్ సృష్టించిన డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ‘ఇండియా–స్టాక్’ ఆధారంగా మొత్తం జనాభా స్థాయిలో డిజిటైజేషన్ సాధ్యం చేయ గలిగాం. ఫలితంగా 140 కోట్ల మందికి డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపులు, యూపీఐతో సులభతర చెల్లింపులు, ఆధార్ గుర్తింపులు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం వంటి ఘనతలు ఎన్నింటినో సాధించగలిగాం. ఈ డిజిటల్ టెక్నాలజీల ఆధారంగా నిర్మించిన సేవల పుణ్యమా అని ఆరోగ్య రంగం కూడా ప్రజలకు మరికొంచెం చేరువైంది. లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ప్రభుత్వ సబ్సిడీల వంటివి సులువైపోయాయి. దేశాద్యంతం సర్వసామాజిక వృద్ధి కూడా సాధ్య మైంది. ఇండియా స్టాక్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న ఏపీఐల ఆధారంగా అసంఖ్యాకమైన స్టార్టప్‌లు వినూత్నమైన సేవ లను భారతీయ పౌరులకు అందుబాటులోకి తేగలిగాయి. ఇండియా స్టాక్ ఇప్పటికే సింగపూర్, ఫ్రాన్ ్స, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఇతర దేశాలు కూడా ఈ వరుసలో ఉన్నాయి. నిజానికి భారత్ తన జీ–20 అధ్యక్ష స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా డిజిటల్ పబ్లిక్ గుడ్, ఇండియా స్టాక్లను ప్రపంచం మొత్తానికి వ్యాపించేలా చేస్తోంది. అంతరాలు తొలగేలా... ఇండియా స్టాక్ అసలైన సామర్థ్యం పౌరులందరికీ డిజిటల్ సేవలు అందించడం ద్వారా నిరూపితమైంది. పైగా ఇది అందరికీ అందుబాటులో ఉండటం వల్ల కంపెనీలు, స్టార్టప్‌లు దానికి ఎప్ప టికప్పుడు విలువను జోడించేందుకూ అవకాశం ఏర్పడింది. జనరేటివ్ ఏఐని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాం. ఇండియా ‘భారత్‌ఎల్‌ఎల్‌ఎం’ పేరుతో సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను తయారు చేసుకోవచ్చు. ఇండియా స్టాక్ ద్వారా సమాచారాన్ని అందివ్వడం ద్వారా మనకు మాత్రమే ప్రత్యేకమైన సమస్యలకు పరిష్కారాలు వెతకవచ్చు. ఇండియా స్టాక్‌పై ఇంకో పొర మాదిరిగా కొన్ని ఎల్ఎల్ఎంల సమాహారంగా జన్ ఏఐని ఏర్పాటు చేయవచ్చు. దీన్ని ప్రజాసేవలో భాగంగా అందరికీ అందివ్వడం కీలకం. తద్వారా డిజిటల్ అంతరాన్ని తొలగించవచ్చు. జనాభా మొత్తానికి లాభాలు అందించవచ్చు. ఆధార్, యూపీఐ మాదిరిగా అన్నమాట. వ్యక్తిగత గోప్యత, వివక్ష వంటి ఏఐ సంబంధిత ఆందో ళనలకు సమాధానం వెతికేందుకు కూడా ఈ ప్రయత్నం ఉపకరిస్తుంది. వైయక్తిక గోప్యత విషయంలో పాశ్చాత్యుల ఆలోచన దీనికంటే భిన్నమైంది. సమష్టితనం, సామాజిక గోప్యత, నమ్మకం వంటి భారతీయ దృక్పథాలను వాడుకుంటూ ఈ పని చేయవచ్చు. సానుకూల ప్రభుత్వం, ప్రపంచానికి నేతృత్వం వహిస్తున్న మన ఐటీ కంపెనీలు, ఐఐటీల వంటి సంస్థలు కలిసికట్టుగా ఈ ‘జన్ ఏఐ’ని సుసాధ్యం చేయగలవని మేము విశ్వసిస్తున్నాం. ఆ తరువాత భారతీయ కంపెనీలు భారత్‌ఎల్‌ఎల్‌ఎం నుంచి నిర్దుష్ట, లోపాలు సరిదిద్దిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేయవచ్చు. అందరికీ అందు బాటులో ఉండే ఏపీఐల సాయంతో స్టార్టప్‌లు కూడా ఎల్ఎల్ఎంలను వాడుకోవచ్చు. డిజిటల్ టెక్నాలజీలో ఇప్పుడున్న రెండు విప్లవా త్మకమైన విషయాలను భారత్ ఇలా జోడించవచ్చు. అంటే జనరేటివ్ ఏఐ, డిజిటల్ పబ్లిక్ గుడ్లను మేళవించడం అన్నమాట. తద్వారా ప్రపంచంలోని అన్ని జన్ ఏఐ మోడళ్లకు నమూనాగా భారతీయ మోడల్‌ను నిలబెట్టవచ్చు. – జస్ప్రీత్ బింద్రా, టెక్ విస్పరర్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్; సుధీర్ తివారీ, థాట్‌వర్క్స్ ఇండియా డిజిటల్ ఇంజినీరింగ్ సెంటర్ గ్లోబల్ హెడ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Semicon India 2023: సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 50 శాతం ఆర్థిక సాయం
గాంధీనగర్: దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఊతం ఇచ్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. స్థానికంగా సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు నెలకొల్పే టెక్నాలజీ సంస్థలకు 50 శాతం ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిశ్రమలకు తమ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని అన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా–2023’ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో వేర్వేరు కాలాల్లో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే ప్రతి పారిశ్రామిక విప్లవాన్ని ముందుకు నడిపించాయని గుర్తుచేశారు. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారతీయుల ఆకాంక్షలే ముందుకు నడిపిస్తున్నాయని తాను నమ్ముతున్నానని తెలిపారు. భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి అనుకూల వాతావరణం ఉందన్నారు. ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ వర్గాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. దీన్ని మరింత పెంచుతున్నామని, ఇకపై దేశంలో సెమికండర్టక్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు ఏకంగా 50 శాతం ఆర్థిక సాయం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. 300 కాలేజీల్లో సెమికండక్టర్ డిజైన్ కోర్సులు భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ వృద్ధికి ఇక ఆకాశమే హద్దు అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఏడాది క్రితం భారత్‌లో ఈ పరిశ్రమలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రశ్నించేవారని, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో పెట్టుబడులకు భారత్ ‘గ్రాండ్ కండక్టర్’గా మారుతోందని హర్షం వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన ‘చిప్ సప్లై చైన్’ అవసరం ప్రపంచానికి ఉందన్నారు. అతి తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ ‘నేషనల్ క్వాంటన్ మిషన్’ను ఇటీవలే ఆమోదించామని, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీలో శాస్త్రీయ పరిశోధనలు, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు క్వాంటన్ మిషన్ దోహదపడుతుందన్నారు. సెమికండక్టర్ పరిశ్రమకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టామని, దేశంలో పదేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 20 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. సోలార్ పీవీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్స్ విధానాల్లో కరెంటును ఉత్పత్తి చేయాలని నిర్ణయించామన్నారు. సదస్సులో పలు దేశాల పారిశ్రామికవేత్తలు, సెమికండక్టర్ రంగ నిపుణులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భారత్ ముందంజ చెన్నై: జీవ వైవిధ్య పునఃస్థాపన, పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ‘జి–20 పర్యావరణ, వాతావరణ స్థిరత్వ మినిస్టీరియల్’ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గంగా నదిని శుభ్రపరిచేందుకు నమామి గంగ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. ‘‘భారతీయులకు ప్రకృతే పెద్ద గురువు. భూమాత పరిరక్షణ అందరి బాధ్యత’’ అన్నారు. -
టెక్ కంపెనీల్లో కోతల పర్వం..
న్యూయార్క్: ఉత్పత్తులు, సర్వీసులు, సాఫ్ట్వేర్ మొదలైన వాటికి డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా చిన్నా, పెద్ద టెక్నాలజీ కంపెనీలు జోరుగా నియామకాలు జరిపాయి. కానీ, ఇటీవల పరిస్థితులు మారడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే టెక్నాలజీ కంపెనీలు దాదాపు 50,000 మందికి ఉద్వాసన పలికాయి. అయితే, ఇటీవల కొన్ని వారాలుగా భారీగా తొలగింపులు చేపట్టినప్పటికీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మటుకు టెక్ సంస్థల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగానే పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలను ఒకసారి చూస్తే.. 2022 ఆగస్టు స్నాప్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌చాట్ మాతృ సంస్థ 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాబిన్‌హుడ్: కొత్త తరం ఇన్వెస్టర్లకు మార్కెట్‌ను చేరువలోకి తెచ్చిన రాబిన్‌హుడ్ తమ ఉద్యోగుల సంఖ్యను 23 శాతం తగ్గించుకుంది. దాదాపు 780 మందిని తొలగించింది. 2022 నవంబర్ ట్విటర్: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చే నాటికి ట్విటర్లో 7,500 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో దాదాపు సగం మందిని తొలగించారు. లిఫ్ట్: ట్యాక్సీ సేవల సంస్థ లిఫ్ట్ దాదాపు 700 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం. మెటా: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందికి ఉద్వాసన పలికింది. 2023 జనవరి అమెజాన్: ఈ–కామర్స్ కంపెనీ 18,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న సిబ్బందిలో ఇది సుమారు 1 శాతం. సేల్స్‌ఫోర్స్: కంపెనీ సుమారు 8,000 మందిని (మొత్తం సిబ్బందిలో 10 శాతం) తొలగించింది. కాయిన్‌బేస్: ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం 950 ఉద్యోగాల్లో కోత పెట్టింది. దాదాపు 20 శాతం మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్: ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (సుమారు 10,000 ఉద్యోగాలు) తొలగిస్తోంది. గూగుల్: ఈ సెర్చి ఇంజిన్ దిగ్గజం 12,000 మందికి ఉద్వాసన పలుకుతోంది. మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 6 శాతం. స్పాటిఫై: ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల సంస్థ అంతర్జాతీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను 6 శాతం తగ్గించుకుంటోంది. నిర్దిష్టంగా సంఖ్యను పేర్కొనలేదు. ఇటీవలి స్పాటిఫై వార్షిక ఫలితాల నివేదిక ప్రకారం కంపెనీలో సుమారు 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఇదో కొత్త రకం ప్రింటర్.. ప్రింట్ చేసిన కాగితాన్ని 10 సార్లు వాడొచ్చు!
అచ్చేసిన కాగితాన్ని ఎన్నిసార్లు వాడొచ్చు? ఒకసారి అచ్చేసిన కాగితాన్ని ఏ పొట్లాలు కట్టుకోవడానికో తప్ప ఇంకెన్నిసార్లు వాడగలరేంటి అనుకుంటున్నారా? ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఇప్పటికీ సమాధానం తట్టడం లేదా? సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. అచ్చేసిన కాగితాన్ని అక్షరాలా పదిసార్లు వాడుకోవచ్చు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపడుతున్నారా? ఇంతవరకు అసాధ్యంగా ఉన్నదాన్నే ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు సుసాధ్యం చేసి చూపించారు. అదెలాగో తెలుసుకుందాం... కంప్యూటర్లు వచ్చాక, ఆఫీసుల్లో ప్రింటర్ల వాడకం పెరిగింది. ఒకసారి ప్రింట్ చేసిన కాగితాన్ని మళ్లీ వాడుకునే అవకాశం ఉండకపోవడంతో కాగితాల వినియోగానికి కోతపెట్టే అవకాశం అసాధ్యమయ్యేది. అప్పటికీ కాగితం వినియోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు, కాగితానికి రెండువైపులా ముద్రించే ప్రింటర్లనూ తయారు చేశారు. ఇప్పుడు చాలా చోట్ల కాగితానికి రెండువైపులా ప్రింట్ చేసే ప్రింటర్లు వాడుకలోకి వచ్చాయి. వీటివల్ల కాగితాల వాడకం సగానికి సగం తగ్గింది. కాగితాల వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, ప్రింట్ చేసిన కాగితాలను పునర్వినియోగం చేసుకునేలా ఇజ్రాయెల్‌లోని ‘రీప్’ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుత సాధనాన్ని తయారు చేశారు. ఇది ప్రింటర్లాగానే కనిపిస్తుంది గాని, ప్రింటర్ కాదు. ఇది డీప్రింటర్. ప్రింట్ చేసిన కాగితం మీద ఉన్న ఇంకును పూర్తిగా పీల్చేసుకుని, క్షణాల్లోనే కాగితాన్ని మళ్లీ తెల్లగా మార్చేస్తుంది. ఈ డీప్రింటర్ ద్వారా ఇలా ఒక్కో కాగితాన్ని పదిసార్లు వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే, డీప్రింటర్ ద్వారా ఒకటికి పదిసార్లు కాగితాలను వాడుకోవాలంటే, సాధారణ కాగితాల వల్ల సాధ్యం కాదు. ఇంకును పీల్చుకోని విధంగా ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్లో వాడాక, ప్రింట్ అయిన కాగితాలను డీప్రింటర్లో వాడుకోవాల్సి ఉంటుంది. పదిసార్లు పునర్వినియోగానికి అవకాశం ఉండటం వల్ల ప్రత్యేకమైన కోటింగ్‌తో తయారైన కాగితాలను ప్రింటర్లలో విరివిగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయని, డీప్రింటర్ ద్వారా కాగితాల పునర్వినియోగం కూడా బాగా పెరుగుతుందని ఇజ్రాయెలీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగితాలను రీసైక్లింగ్ చేయడం కొత్త కాకున్నా, ప్రింటర్లో ఒకసారి అక్షరాలను ముద్రించేసిన కాగితాలను ఒకటికి పదిసార్లు వాడుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి. రీసైక్లింగ్ చేసిన కాగితాలను టిష్యూలు, టాయిలెట్ పేపర్లు, న్యాప్కిన్లు వంటివాటి తయారీకి ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. అలాగే, వార్తపత్రికల కోసం కూడా రీసైకిల్డ్ పేపర్లను ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు. డీప్రింటర్ వాడకం పెరిగితే, కాగితాల వాడకానికి ఇక కళ్లేలు పడగలవనే ఆశించవచ్చు. ∙జగదీశ్వర్ కుమార్ -
అత్యంత విలువైన కంపెనీగా 'అమెజాన్'.. భారత్ నుంచి 'టాటా' టాప్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా అంత్యత విలువైన కంపెనీల జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమెజాన్ 15 శాతం మార్కెట్ వ్యాల్యూని కోల్పోయి 350.3 బిలియన్ డాలర్ల నుంచి 299.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినా అమెజాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ గ్లోబల్ 500 2023 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెజాన్‌కు నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెజాన్ ఏకంగా 50 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇక, విలువైన కంపెనీల జాబితాలో యాపిల్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 355 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ విలువ 16 శాతం క్షీణించి 297.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు చెందిన కంపెనీల్లో టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 78వ స్థానంలో ఉన్న ఈ గ్రూప్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 69కి చేరింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భారీ షాక్!, వచ్చే ఏడాది మిగిలిన రంగాల్లో..
మరో నెల రోజుల్లో 2022 గుడ్ బై చెప్పి న్యూఇయర్‌ని ఆహ్వానించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మార్చి నెల ముగిసే సమయానికి (ఆర్ధిక సంవత్సరం) అన్నీ రంగాల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల శాలరీలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ వచ్చే ఏడాది వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో పోలిస్తే జీతాల పెంపు 2023 తక్కువగా ఉండనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డెలాయిట్ ఇండియా మన దేశానికి చెందిన సుమారు 300 కంపెనీల నుండి డేటా సేకరించింది. ఆ డేటా ప్రకారం..వచ్చే ఏడాది ఏ విభాగంలో శాలరీ హైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఏయే రంగాల్లో జీతాలు పెంపు తక్కువగా ఉంటుందో తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫైనాన్షియల్ ఇయర్ - 2022లో జనవరి-డిసెంబర్ సంస్థల పనితీరు కారణంగా 2023 ఆర్ధిక సంవత్సరంలో వేతన పెంపు తక్కువగా ఉంటాయని అంచనా. పెరిగే రంగాలు? ముఖ్యంగా భారత ఎకానమీకి ఆర్ధికంగా వెన్నదన్నుగా నిలిచే రంగాలైన హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది శాలరీ హైకులు ఎక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్‌కు డెలాయిట్ ఇండియా తెలిపింది. మరి టెక్ కంపెనీల్లో? ఇక ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. తద్వారా టెక్ కంపెనీల్లో శాలరీల పెంపు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రెసిషన్ భయాలు వణికించడంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని, అందుకు మెటా, అమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు ఇతర టెక్ కంపెనీల పనితీరే నిదర్శనమని డెలాయిట్ నివేదిక హైలెట్ చేస్తుంది. వచ్చే ఏడాది సైతం ఐటీ రంగం ఈ తరహా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేతన పెంపు , నిలిచి పోనున్న నియామకాలు! ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో శాలరీల పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం పెరుగుతాయని అంచనా. ఐటి సర్వీసెస్ లో వేతన పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంతో పోలిస్తే 2023లో 8.8 శాతంగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఐటి సేవలు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వద్ద ఉంటాయని అంచనా వేయగా..క్యాప్టివ్ సేవలు (ఔట్ సోర్సింగ్) 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. వేతనాల పెంపు ఇలా ఉంటే కొత్త నియామకాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని అంచనా. జోరుమీదున్న సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్లో అప్రైజల్ అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంగా ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉంది. అదేవిధంగా, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలోని ఉద్యోగులు ఈ ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం వేతన పెంపును పొందవచ్చు, ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నుండి పెరిగింది. రిటైల్ విభాగంలో శాలరీల పెరుగుదల స్థూలంగా 8.0 శాతం వద్ద ఫ్లాట్ గా ఉంటుందని భావిస్తున్నారు. కన్స్యూమర్/ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలో ఇంక్రిమెంట్లు 9.8 శాతం ఉండనున్నాయి. పవర్, పునరుత్పాదక శక్తిని(రెన్యూవబుల్ ) వంటి విభాగాల్లో శాలరీలు పెరగనున్నాయని భావిస్తున్నారు. పునరుత్పాదక ఉద్యోగులు 9.6 శాతం నుండి 11 శాతం పెరుగుదలను చూస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ రంగంలోని కార్మికులు 2022 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం నుండి 9.5 శాతం ఇంక్రిమెంట్లను చూడవచ్చు. ఫార్మాలో 8.9 శాతం వద్ద ఫ్లాట్‌గా ఉంటాయని భావిస్తున్నారు. -
అమెజాన్‌లో 10 వేల ఉద్యోగాలు కట్..
న్యూయార్క్: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల తరహాలోనే ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా రాబోయే రోజుల్లో దాదాపు 10,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్యలో ఇది మూడు శాతం కాగా అంతర్జాతీయంగా ఉన్న సిబ్బంది సంఖ్యలో ఒక్క శాతం కన్నా తక్కువని న్యూయార్క్ టైమ్స్ (ఎన్‌వైటీ) ఒక కథనాన్ని ప్రచురించింది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో పాటు డివైజ్‌ల విభాగం, రిటైల్, మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉండనున్నాయని పేర్కొంది. కొన్నాళ్లుగా అమెజాన్‌లో ఈ ధోరణులు కనిపిస్తూనే ఉన్నాయని ఎన్‌వైటీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో అమెజాన్ 80,000 పైచిలుకు సిబ్బందిని తగ్గించుకున్నట్లు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది గంటల ప్రాతిపదికన పని చేసేవారే ఉన్నట్లు వివరించింది. చిన్న బృందాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ను సెప్టెంబర్‌లోనే నిలిపివేసిందని, అలాగే అక్టోబర్‌లో కీలకమైన రిటైల్ వ్యాపారంలోనూ 10,000 పైచిలుకు ఖాళీలను భర్తీ చేయకుండా ఆపేసిందని ఎన్‌వైటీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు బాగా లేకపోవడంతో వ్యాపారాన్ని వేగంగా క్రమబద్ధీకరించుకునేలా అమెజాన్‌పై ఒత్తిడి పెరిగిపోతోందని వివరించింది. ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో దాదాపు సగం మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) కూడా 11,000 మంది పైచిలుకు సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. -
Defence stocks rally: డిఫెన్స్ షేర్లు లాభాల గన్స్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్ కౌంటర్లకు జోష్ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. జాబితా పెద్దదే గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్ సంబంధ షేర్లలో మజ్గావ్ డాక్‌యార్డ్, భారత్ డైనమిక్స్, కొచిన్ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్(ఇండియా), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జాసానీ వెల్లడించారు. కారణాలున్నాయ్.. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గౌరంగ్ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్, మజ్గావ్ డాక్, కొచిన్ షిప్‌యార్డ్ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు. దిగుమతి ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అశ్విన్ పాటిల్ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలి
న్యూఢిల్లీ: సంక్షోభాన్నుంచి గట్టెక్కేందుకు నిర్వహణ సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కోవిడ్–19 మహమ్మారి ప్రత్యేకంగా తెలియజెప్పిందని 90 శాతం మంది దేశీ వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. దీన్నుంచి నేర్చుకున్న పాఠాలను, భవిష్యత్తులో కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సంస్థల్లో లీడర్ల కన్నా మన వారు చాలా ధీమాగా ఉన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా కారణంగా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడిందని సుమారు 59 శాతం దేశీ సంస్థలు తెలిపాయి. కరోనా వైరస్ నేపథ్యంలో టెక్నాలజీపై గణనీయంగా ఇన్వెస్ట్ చేసినట్లు 80 శాతం కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సంక్షోభ సర్వే 2021లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గాలు వ్యక్తపర్చిన అభిప్రాయాలనే దేశీయంగా కూడా దిగ్గజాలు కాస్త అటూ, ఇటూగా వ్యక్తపర్చినట్లు పీడబ్ల్యూసీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2,800 పైచిలుకు బిజినెస్ లీడర్లు తమ కంపెనీ డేటాను, కరోనా ప్రభావాలపై వ్యక్తిగత అభిప్రాయాలను, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఈ సర్వేలో తెలియజేశారు. సంక్షోభ సమయంలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడం, భారీ అవాంతరాలపై తక్షణం స్పందించేందుకు వ్యూహాన్ని రూపొందించుకోవడం, చర్యల అమలు తర్వాత ప్రక్రియలను సమీక్షించుకోవడం తదితర 5 అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వారు తెలిపారు. -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్‌లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
డీల్‌షేర్ నుంచి 4,000 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సోషల్ కామర్స్ కంపెనీ డీల్‌షేర్ రానున్న ఆరు నెలల్లో కొత్తగా 4,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతమున్న 1,000 మంది సిబ్బందిని 5,000కుపైగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కార్యకలాపాలను భారీస్థాయి లో విస్తరించేందుకు వీలుగా 10 కోట్ల డాలర్లు (రూ. 736 కోట్లు) సైతం ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా వివిధ విభాగాలలో వేగంగా విస్తరించాలని చూస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇటీవలే టైగర్ గ్లోబల్, వెస్ట్బ్రిడ్జి క్యాపిటల్, అల్ఫావేవ్ ఇన్క్యుబేషన్ తదితర దిగ్గజాల నుంచి 14.4 కోట్ల డాలర్లు సమీకరించింది. కోవిడ్–19 సవాళ్లు విసిరినప్పటికీ కస్టమర్ బేస్ భారీగా ఎగసినట్లు డీల్‌షేర్ వ్యవస్థాపకుడు, సీఈ వో వినీత్ రావు తెలియజేశారు. ప్రస్తుతం స్థూల మెర్కండైజ్ విలువ(జీఎంవీ) 40 కోట్ల డాలర్ల రన్‌రేట్‌ను తాకినట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాలలో 45 పట్టణాలలో విస్తరించినట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివరికల్లా 100 కోట్ల డాలర్ల జీఎంవీ రన్‌రేట్‌ను అందుకోగలమన్న విశ్వాసా న్ని వ్యక్తం చేశారు. నిర్వహణ సామర్థ్యం, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ, డేటా సైంటిస్టులు, మార్కెటింగ్, పంపిణీ తదితర విభాగాల లో కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడించారు. -
బైడెన్‌పై అంత ప్రేమెందుకు?: ట్రంప్
మిల్వాకీ(యూఎస్): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సాగించిన అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా అమెరికన్ మీడియా, బడా టెక్నాలజీ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బైడెన్‌పై మీడియాకు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. మాస్కో మాజీ మేయర్‌కు అత్యంత సన్నిహితుడైన జో బైడెన్‌కు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు అందినట్లు ట్రంప్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను బైడెన్ ఖండించారు. బైడెన్ నుంచి ప్రయోజనాలు పొందిన మీడియా సంస్థలు, టెక్ కంపెనీలు మాత్రం ఆయనను కాపాడేందుకు ఆరాట పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పక్షపాత వైఖరి చివరకు మీడియాకే నష్టం కలిగిస్తుందని అన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్రభుత్వ సూపర్ ఎకనామిక్ రికవరీకి, బైడెన్ డిప్రెషన్‌కు మధ్య పోటీ జరుగుతోందని, ప్రజలు దేన్ని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. -
టెక్ షేర్లు వీక్- యూఎస్ వెనకడుగు
టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు యూఎస్ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం డోజోన్స్ 245 పాయింట్లు(0.9%) నీరసించి 27,657 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 38 పాయింట్లు(1.1%) క్షీణించి 3,319 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 117 పాయింట్ల(1.1%) నష్టంతో 10,793 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో వారం ఎస్అండ్పీ, నాస్డాక్ వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో వెనకడుగు వేశాయి. కోవిడ్-19 నేపథ్యంలో గతంలో ప్రకటించిన అతిభారీ ప్యాకేజీ 2 ట్రిలియన్ డాలర్లకు కొనసాగింపుగా ప్రజలకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రతిపాదనపై రిపబ్లికన్లు, డెమక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్ రిజర్వ్ కొత్త ప్యాకేజీపై స్పందించకపోవడం దీనికి జత కలిసినట్లు అభిప్రాయపడ్డారు. బేర్ ట్రెండ్? గత కొంత కాలంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల మొదటి నుంచీ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మార్కెట్లకు బలాన్నిస్తున్న FAAMNG స్టాక్స్‌లో ఈ వారం అమెజాన్, ఫేస్బుక్ 5 శాతంకంటే అధికంగా బలహీనపడ్డాయి. ఈ నెలలో చూస్తే ఫేస్బుక్, అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ 10 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. యాపిల్ మరింత అధికంగా 17 శాతం క్షీణించింది. ఇటీవల సాధించిన గరిష్టం నుంచి చూస్తే యాపిల్ 23 శాతం పతనమైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువలో 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. మళ్లీ డౌన్.. ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ టెక్ కౌంటర్లలో వారాంతాన యాపిల్ 3.2 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం, అమెజాన్ 1.8 శాతం, మైక్రోసాఫ్ట్ 1.2 శాతం, ఫేస్బుక్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. మోడర్నా ఇంక్ 3 శాతం, ఆస్ట్రాజెనెకా 1 శాతం చొప్పున బలపడగా.. ఫైజర్ 0.5 శాతం నీరసించింది. జాన్సన్ అండ్ జాన్సన్ 1.4 శాతం పుంజుకోగా.. షెవ్రాన్ 0.75 శాతం బలహీనపడింది. -
డిజిటల్ ట్యాక్స్‌పై అమెరికా గుర్రు
వాషింగ్టన్: అమెరికన్ టెక్నాలజీ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పలు దేశాలు అనుచిత డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌లు విధిస్తున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌తో పాటు పలు దేశాలు విధిస్తున్న డిజిటల్ సర్వీస్ పన్నులపై (డీఎస్టీ) విచారణ జరపాలని నిర్ణయించింది. ఆస్ట్రియా, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, యూరోపియన్ యూనియన్, ఇండోనేసియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ, బ్రిటన్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ‘మా సంస్థలను అసమంజసంగా టార్గెట్ చేసుకుని కొన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమలు చేస్తున్న పన్నుల స్కీమ్‌లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. మా వ్యాపార సంస్థలు, ఉద్యోగులపై ఎలాంటి వివక్ష చూపినా తగు చర్యలు తీసుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం‘ అని అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్టీఆర్) పేర్కొంది. వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరపాలని అమెరికా నిర్ణయించింది. దీని ప్రకారం అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపేలా ఇతర దేశాలు వివక్షాపూరిత, అసమంజస విధానాలేమైనా అమలు చేస్తేవిచారణ జరిపేందుకు యూఎస్టీఆర్కు విస్తృత అధికారా లు ఉంటాయి. దీనిపై ఫెడరల్ రిజిస్టర్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1 నుంచి డీఎస్టీ అమల్లోకి.. డిజిటల్ ట్యాక్స్ అంశం కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా నలుగుతూనే ఉంది. దీనికి ప్రత్యామ్నాయంపై చర్చలు జరిగినప్పటికీ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వివిధ రకాలుగా దేశాలు ఏకపక్షంగా డిజిటల్ ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించాయి. 2019లో ఫ్రాన్స్ ఇలాగే అమెరికా ఉత్పత్తులపై డీఎస్టీ విధించింది. ప్రతిగా అమెరికా కూడా కొన్ని ఫ్రెంచ్ ఉత్పత్తులపై మరింత అధిక స్థాయిలో పన్నులు వడ్డించింది. దీంతో డీఎస్టీని నిలుపుదల చేసిన ఫ్రాన్స్ బహుళపక్ష చర్చలు ప్రారంభించింది. భారత్ విషయానికొస్తే ఆన్లైన్లో వస్తు, సేవలు విక్రయించే విదేశీ కంపెనీలపై రెండు శాతం డీఎస్టీ విధించాలని ఈ ఏడాది తొలినాళ్లలో ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 బడ్జెట్లో చేసిన ఈ ప్రతిపాదనల కింద రెండు డజన్లకు పైగా విదేశీ టెక్ కంపెనీలు ఈ పన్నుల పరిధిలోకి వస్తాయి. సుమారు 2,67,000 డాలర్ల వార్షికాదాయాలు ఉన్న కంపెనీలకు మాత్రమే దీన్ని వర్తింపచేస్తూ ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలి విడత చెల్లింపులు కంపెనీలు జూలై 7న కట్టాల్సి ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే వసూళ్లపై కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి భారత్‌లో శాశ్వతమైన సంస్థను ఏర్పాటు చేయకుండా డిజిటల్ ప్రకటనల సేవల ద్వారా విదేశీ సంస్థలు ఒక ఏడాదిలో రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జించిన పక్షంలో 6 శాతం మేర సమానత్వ పన్ను విధించాలంటూ 2016 ఫైనాన్స్ చట్టంలో ప్రతిపాదించారు. 2020–21 బడ్జెట్లో 2% రేటుతో ఈ–కామర్స్ కంపెనీలనూ దీని పరిధిలోకి చేర్చారు. ఇది భారత్‌తో వాణిజ్యం చేసే ఇతర దేశాల కంపెనీలను ఆశ్చర్యపర్చింది. కరోనా పరిణామాల కారణంగా దీన్ని తొమ్మిది నెలల పాటు వాయిదా వేయాలంటూ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల దేశాల కంపెనీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు గత నెలలో లేఖ రాశాయి. చర్చలతో పరిష్కరించుకోవాలి.. ఈ వివాదాన్ని బహుళపక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైరాన్ బ్రిలియంట్ తెలిపారు. ‘ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు శక్తిమంతమైన చోదకంగా డిజిటల్ కామర్స్ ఎదిగింది. అయితే, కొన్ని దేశాలు ప్రస్తుతం ఏకపక్షంగా, వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ కొత్తగా డిజిటల్ ట్యాక్సులు విధించాలని భావిస్తున్నాయి. ఏకపక్ష పన్నులను నివారించేందుకు అన్ని వర్గాలు కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది‘ అని పేర్కొన్నారు. ‘అమెరికా గతేడాది భారత్‌కు 27 బిలియన్ డాలర్ల విలువ చేసే సేవలను ఎగుమతి చేసింది. కాబట్టి కొత్త పన్నుల విధానంతో ఎక్కువగా అమెరికాపైనే ప్రతి కూల ప్రభావం పడవచ్చు. డిజిటల్ దిగ్గజంగా ఎదగాలని భారత్ ఆశిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కొత్త పన్నుల వల్ల అవరోధాలేమీ తలెత్తకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది వేచి చూడాల్సి ఉంటుంది‘ అని న్యాయసేవల సంస్థ నాంగియా ఆండర్సన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. భారత్‌పై పోరు కాదు... ఈ లిస్టులో అమెరికా మిత్రదేశాలు కూడా చాలానే ఉన్నందున దీన్ని కేవలం భారత్‌పై పోరుగా పరిగణించక్కర్లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది చర్చల ప్రక్రియకు నాంది మాత్రమేనని, యూఎస్టీఆర్ ఇంకా భారత్ విధానాలపై వాస్తవాలు సమీకరిస్తోందని వివరించాయి. తర్వాత దశలో భారత్ అనుచిత వాణిజ్య విధానాలేమీ అమలు చేయడం లేదని కూడా నిర్ధారణ కావచ్చని పేర్కొన్నాయి. అమెరికన్ చట్టాల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గాలు (ప్రస్తుత కేసులో భారత్) కూడా తమ విధానాలను సమర్థించుకునేందుకు, వాదనలు వినిపించేందుకు అవకాశాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒకవేళ భారత్ అనుచిత వాణిజ్య విధానాలు పాటిస్తోందని యూఎస్టీఆర్ నిర్ధారణకు వచ్చినప్పటికీ అమెరికాతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
టెక్ దిగ్గజాలకు మహమ్మారి ముప్పు..
బెంగళూర్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనా వేస్తున్నాయి. కోవిడ్-19తో జనజీవనం స్తంభించడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతుండటంతో ఐటీ ఎగుమతులపైనా పెనుప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో అమెరికా, యూరప్ క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాల్లో కోత విధిస్తుండటం దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్లపై ప్రతికూల ప్రభావం పడనుందని ఐటీ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న ఆరునెలల్లో ఐటీ రంగంలో రాబడి 2 నుంచి 7 శాతం తగ్గుతుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించిందని ఓ వార్తాసంస్ధ వెల్లడించింది. వైరస్ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో జాప్యాలు వంటి కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసాల్లో రాబడి గణనీయంగా తగ్గవచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషించారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ ఈ ఏడాది ప్రధమార్ధంలో వృద్ధి రేటు మందగమనాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. ఐటీ కంపెనీలు ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని, ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావంతో రాబడి నష్టం వాటిల్లుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌కు చెందిన దేవాంగ్ భట్ పేర్కొన్నారు. కోవిడ్-19 ప్రభావంతో వ్యాపారం దెబ్బతినే క్రమంలో వృద్ధి రేటును యాక్సెంచర్ 6-8 శాతం నుంచి 3-6 శాతానికి కుదించిన బాటలోనే భారత ఐటీ కంపెనీలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రవాణాపై ఆంక్షలు సైతం ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతున్నాయి. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఎయిర్‌లైన్స్, రిటైల్, హైటెక్, ఫైనాన్షియల్, తయారీ రంగాలకు చెందిన క్లయింట్ల నుంచి వచ్చే వ్యాపారం వైరస్ మహమ్మారి కారణంగా దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా కేంద్రస్ధానమైన చైనాలో ఆర్థిక మందగమనం కూడా భారత ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చదవండి : పీఎం కేర్స్ ఫండ్ : నిర్మలా సీతారామన్ సాయం -
ఆ టెకీలకు గుడ్‌న్యూస్..
సాక్షి, బెంగళూర్ : దిగ్గజ కంపెనీలకు చెందిన ఇంజనీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో అధిక వేతన పెంపు, నియామకాల జోరు ఊపందుకుంటుందని కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ తాజా అథ్యయనంలో వెల్లడైంది. టెక్నాలజీ రంగంలో గత ఏడాది హైరింగ్ 29 శాతం పైగా పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ఎంఎన్సీలకు చెందిన 43 గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లలో (జీఐసీ) ఈ అథ్యయనం చేపట్టారు. దేశంలో 1200 ఆర్అండ్డీ, ఇంజనీరింగ్ సెంటర్లతో 950 ఎంఎన్‌సీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 5 నుంచి 10 శాతం మేరకు పెరుగుతోంది. జీఐసీలో హైరింగ్ ఐటీ నియామకాల కంటే అధికంగా ఉండటం గమనార్హం. 2017లో జీఐసీల్లో వేతన పెంపు భారత ఐటీ కంపెనీల వేతన పెంపు కంటే రెండు రెట్లు అధికమని అథ్యయనంలో వెల్లడైంది. జీఐసీల్లో సగటు వేతన పెంపు 11.2 శాతంగా నమోదైంది. జూనియర్ లెవెల్లో అత్యధికంగా 14 శాతం వరకూ వేతనాలు పెరిగాయి. క్లౌడ్, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి నూతన డిజిటల్ టెక్నాలజీల రాకతో బహుళజాతి సంస్థలు తమ ఇంజనీరింగ్ విభాగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం, నూతన సొల్యూషన్లపై దృష్టిసారించడంతో ఆయా విభాగాల్లో నియామకాలు పెరిగాయని జిన్నోవ్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ హెడ్ ఆనంద్ సుబ్రమణియమ్ చెప్పారు. మరోవైపు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగాల్లో హైరింగ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. 2017లో ఆర్అండ్డీలో 30.6 శాతం మేర హైరింగ్ వృద్ధి నమోదైందని చెప్పారు. -
ఈ 9 టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు హుష్ కాకి!
టెక్నాలజీ సెక్టార్ ను ఈ 2017 కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఓ వైపు నుంచి కొత్త పెట్టుబడులు రాకపోవడం, మరోవైపు నుంచి అంతర్జాతీయంగా రాజకీయ పరిణామాల్లో కీలక మార్పులు సంభవించడం దేశంలో చాలా స్టార్టప్ లకు, టెక్నాలజీ కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. భారీగా ఉద్యోగాల కోత పెడుతున్న 9 టెక్నాలజీ కంపెనీలేమిటో ఓ సారిచూద్దాం... ఎయిర్ సెల్ : ఈ ఏడాది ఫిబ్రవరిలో సెల్యులార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యునికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కోత. దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపు 8000 మంది ఉద్యోగులున్నారు. స్నాప్ డీల్: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న స్నాప్ డీల్ కూడా ఉద్యోగాల కోతకు సై అంటోంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేని స్నాప్ డీల్ మెల్లమెల్లగా తన ఖర్చును తగ్గించుకోవడం కోసం ఉద్యోగులపై వేటు వేస్తోంది. అయితే ఈ కంపెనీ ఎంతమందిని ఉద్యోగులను తొలగిస్తుందో ప్రకటించనప్పటికీ, ఉద్యోగులను తొలగించడం మాత్రం తప్పనిసరి అంటూ ధృవీకరించేసింది. ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలను ధృవీకరించిన అనంతరం కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ కూడా తమ జీతాలను వదులుకుంటున్నట్టు వెల్లడించారు. సంక్షోభంలో పడిపోయిన స్నాప్ డీల్ ను మళ్లీ పునఃస్థితికి తీసుకురావడానికి కంపెనీ సర్వశక్తుల ప్రయత్నిస్తోంది. యప్ మీ: ఫ్యాషన్ రీటైలర్ యప్మీ కూడా ఇటీవల క్వాలిటీ కంట్రోల్ టీమ్స్, వేర్ హౌజింగ్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపింది. జనవరి నెలలో గరిష్ట స్థాయిలకు వెళ్లాలని ప్లాన్ చేశామని, కానీ పెద్ద నోట్ల రద్దు తమల్ని భారీగా దెబ్బతీసిందని యప్ మీ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ చెప్పారు. అమ్మకాలు పడిపోయినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ వెలుపల వ్యాపారాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. దీంతో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ తగ్గిస్తోంది. క్రాఫ్ట్స్ విల్లా : సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేసింది. టెక్నాలజీ టీమ్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ టీమ్స్ లో ఈ ఉద్యోగులను తొలగించినట్టు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పేయూ: పేమెంట్ గేట్ వే పేయూ ఇండియా ఏకంగా తన కొత్త క్రెడిట్ కార్డు ప్రొడక్ట్ లాంచ్ ప్లానింగ్ నే వదులుకుంది. 85 మంది కాల్ సెంటర్ టీమ్ కు, 25 మంది కలెక్షన్ టీమ్ కు పింక్ స్లిప్ ఇచ్చేసింది. టోలెక్సో: ఇండస్ట్రియల్ మార్కెట్ ప్లే టోలెక్సో 50 మంది ఉద్యోగులకు రాంరాం చెప్పింది. అయితే 300 వరకు ఉద్యోగులను కంపెనీ తొలగించిందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. గిర్నార్ సాప్ట్ వేర్: కార్డెకో.కామ్, గాడి.కామ్, జిగ్వీల్స్.కామ్ సంస్థలను రన్ చేసే ఇంటర్నెట్ కంపెనీ గిర్నార్ సాప్ట్ వేర్ కూడా వ్యయాలను తగ్గించుకోవడానికి వ్యాపారాల పునరుద్ధరణ బాట పట్టింది. ఇటీవల 100 ఉద్యోగాలకు పైగా కోత పెట్టింది. వచ్చే క్వార్టర్లో లాభార్జించే కంపెనీగా నమోదుచేసే లక్ష్యంతో ఉద్యోగాలకు కోత పెట్టామని కంపెనీ చెబుతోంది. స్టేజిల్లా: చెన్నైకు చెందిన స్టేజిల్లా తన వ్యాపారాలను పూర్తిగా మూసివేసింది. కొత్త ఫండ్స్ ను సేకరించడానికి కష్టమవుతున్న ఈ కంపెనీ, మొత్తానికి మూతవేయడం మంచిదని భావించింది. ఈ కంపెనీ ఉద్యోగులు కూడా రోడ్డున్న పడ్డారు. లీఎకో: చైనీస్ బిలీనియర్ అయిన జియా యుఎటింగ్ కంపెనీ లీఎకో కూడా 85 శాతం ఇండియా స్టాఫ్ ను తొలగించేసింది. అంతేకాక ఇద్దరు అధికారులు కంపెనీ నుంచి వైదొలిగారు. -
అమెరికా కంపెనీలకూ ప్రోత్సాహకాలు
ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ * భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించాలని టెక్నాలజీ కంపెనీలకు ఆహ్వానం... న్యూఢిల్లీ: ‘మేక్ ఇన్ ఇండియా’లో పాలుపంచుకునే అమెరికా కంపెనీలకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు ఇక్కడి నుంచి ఎగుమతులపై దృష్టిపెట్టాల్సిందిగా అమెరికా టెక్నాలజీ కంపెనీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆయన ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన సందర్భంగా(ఆదివారం నుంచి పర్యటన మొదలైంది) ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ కంపెనీలకు అందుబాటులో ఉన్న రాయితీలన్నీ అమెరికా కంపెనీలకూ వర్తింపజేస్తాం. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అనేక ప్రోత్సాహకాలున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే... పెట్టుబడి పెట్టే ప్రతి 100 డాలర్లలో 25 డాలర్లను మేం(భారత్) తిరిగిచ్చేస్తాం. దీనికి తోడు రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలు కూడా అదనం’ అని ప్రసాద్ వివరించారు. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2013-14 లో భారత్ రూ.69,516 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోగా... రూ.20,475 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఐటీ రంగంలోనూ భారత్, అమెరికా కంపెనీల భాగస్వామ్యాలు మరింత బలపడేందుకు అవకాశాలున్నాయని ప్రసాద్ పేర్కొన్నారు. ఇక జోరుగా ఎఫ్‌డీఐలు: సిన్హా భారత్‌కు త్వరలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వెల్లువెత్తనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని పటిష్టం చేస్తున్న నేపథ్యంలో అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి నిధుల ప్రవాహం జోరందుకోనుందన్నారు. ‘అమెరికా వ్యాపార దిగ్గజాలు, కంపెనీలతో జరుపుతున్న చర్చలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఆయా ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చే అవకాశాలుండటంతో త్వరలోనే నిధుల ప్రవాహం పెరగనుంది’ అని వివరించారు. కాగా, మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల అనుమతికి తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో లక్షలాదిమంది చిన్న వర్తకులపై దీని ప్రభావం పడుతుందన్నదే తమ నిర్ణయానికి కారణమన్నారు. గతేడాది భారత్ ఈక్విటీ, డెట్(బాండ్లు) మార్కెట్లోకి 40 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వచ్చాయని.. మరిన్ని పెట్టుబడులకు ఇక్కడ అవకాశాలున్నాయని సిన్హా తెలిపారు. ఏప్రిల్ 2000-2014 నవంబర్ వరకూ అమెరికా నుంచి భారత్‌కు 13.28 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లభించాయి. మొత్తం ఎఫ్‌డీఐల్లో ఇవి 5.62 శాతం. నేడు సీఈఓలతో మోదీ, ఒబామా భేటీ న్యూఢిల్లీ: అమెరికా-భారత్ సీఈఓల ఫోరం సమావేశం నేడు జరగనుంది. దీనిలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత్ ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. వీరితో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కూడా భేటీకి హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార బంధం పటిష్టం చేసుకోవడం, వీసా సంబంధ సమస్యలు, పెట్టుబడులకు అడ్డంకుల తొలగింపు, టోటలైజేషన్ ఒప్పందంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. భారత్ సీఈఓల తరఫున టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరం కో-చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. అమెరికా తరఫున హనీవెల్ గ్రూప్ చీఫ్ డేవిడ్ ఎం కోట్ సారథ్యం వహిస్తున్నారు.