ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా సమాచారం అందించే వికీమీడియా ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024’ను నిర్వహించింది. ఇటీవల మూడు రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్‌లో స్థానిక భాషలోని సమాచారాన్ని ఇతర భాషలో అందించేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు ప్రధానపాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గనడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
దేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న వారికి ఈ సమ్మిట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందని ఐఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాధికా మామిడి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐ4భారత్, బిట్స్ పిలానీ, సీఐఎస్, ఐఐఐటీ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నిపుణులు కలిసి దేశీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధిపై మాట్లాడారు. రియల్‌టైమ్ కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే సాంకేతికతపై చర్చించారు. వికీమీడియా ఫౌండేషన్ అనుసరిస్తున్న కొన్ని ఫీచర్లు, సాధనాలపై మాట్లాడారు. మొబైల్ ఎడిటింగ్, వాయిస్, ఇమేజ్ ఆధారిత స్క్రిప్ట్‌లు, వికీమీడియా కమ్యూనిటీలు, వర్క్‌షాప్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించారు.
ఇదీ చదవండి: 100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్
భారతీయ భాషల్లో వివిధ విభాగాలకు చెందిన సమగ్ర కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనువుగా ఆన్‌లైన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో వికీమీడియా, వికీపీడియా వంటి సంస్థలు విద్యార్థుల సాయం తీసుకుంటున్నాయి. ఫలితంగా ఓపెన్స్‌సోర్స్ టూల్స్ ద్వారా నేరుగా కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు వారి సహకారాన్ని కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment