local language
-
మా తీర్పు.. మీ భాషలోనే..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్.. వైడ్ సెపరేట్ జడ్జ్మెంట్ యాజ్ ఫర్ సెక్షన్ 235 సీఆర్పీసీ’ అంటూ తీర్పులిచ్చే న్యాయమూర్తులు.. ఇప్పుడు స్థానిక భాషల్లోనే తీర్పులు చెబుతున్నారు. కోర్టు తీర్పులు నిందితులు, బాధితులకు అర్థమయ్యేలా వెబ్సైట్లలోనూ స్థానిక భాషల్లోనే పొందుపరుస్తున్నారు. ‘మా తీర్పులు.. మీ భాషల్లోనే’ అంటూ జడ్జిమెంట్స్ వెలువరిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బాటలోనే హైకోర్టులు సైతం నడుస్తున్నాయి. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున తీసుకున్న కీలక నిర్ణయం న్యాయస్థానాల్ని అన్నివర్గాలకు చేరువ చేసింది. సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పటివరకూ 73,963 తీర్పుల్ని సుప్రీంకోర్టు వివిధ భాషల్లో తర్జుమా చేసి తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఇదే నేపథ్యంలో 30,944 తీర్పుల్ని ఆయా హైకోర్టులు స్థానిక భాషల్లోకి మార్చాయి.షెడ్యూల్డ్ భాషల్లోనూ..షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను వెలువరిస్తామని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం ప్రకటించింది. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ (ఈ–ఎస్సీఆర్) ప్రాజెక్టులో భాగంగా ఇకపై రాజ్యాంగంలో పేర్కొన్న 22 షెడ్యూల్డ్ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. చెప్పిన విధంగానే ఇప్పటివరకూ 18 భాషల్లో తీర్పుల్ని తర్జుమా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చిన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, గారో, ఖాసీ, సంథాలీ ఇలా.. విభిన్నమైన స్థానిక భాషల్లో తీర్పులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ–ఎస్సీఆర్ ప్రాజెక్ట్ ద్వారా వెబ్సైట్లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ 73,963 తీర్పులు పొందుపరిచింది. రాజస్థాన్ హైకోర్టుతో మొదలై..సుప్రీంకోర్టుతో పాటు ప్రతి హైకోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ ఆంగ్ల భాషలో జరగాలని భారత రాజ్యాంగంలోని 348(1)(ఏ) అధికరణం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని 348(2) అధికరణం రాష్ట్రాల్లో అధికారిక వ్యవహారాలు, రాష్ట్రంలో ఉండే హైకోర్టు ప్రొసీడింగ్స్ కోసం రాష్ట్రపతి ముందస్తు అనుమతితో హిందీ లేదా మరేదైనా భాషను వినియోగించేందుకు గవర్నర్‌కు అధికారం కల్పించింది. అధికారిక భాషా చట్టం–1963లోని సెక్షన్–7 కూడా ఇదే సూచిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో హిందీ వినియోగానికి రాజ్యాంగంలోని 348(2) అధికరణం ప్రకారం 1950లో తొలిసారి అనుమతి లభించింది. తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ కోర్టులు హిందీ భాషను వినియోగించడం ప్రారంభించాయి.బీజం వేసిన మద్రాస్ హైకోర్టుమద్రాస్ హైకోర్టులో తమిళం, గుజరాత్ హైకోర్టులో గుజరాతీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో హిందీ, కలకత్తా హైకోర్టులో బెంగాలీ, కర్ణాటక హైకోర్టులో కన్నడ భాషలను వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ప్రతిపాదనలు అందాయి. 1965 కేబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ ప్రతిపాదనలపై అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సలహాను అడగ్గా.. 2012 అక్టోబర్ 11న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో ఈ ప్రతిపాదనలను అంగీకరించవద్దని తొలుత నిర్ణయించారు. అయితే.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం పట్టుబట్టింది. గత నిర్ణయాన్ని సమీక్షించి తమిళంలో కోర్టు తీర్పులు వెలువరించేందుకు అంగీకారం తెలపాలంటూ 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టును కోరింది. అప్పుడు కూడా తిరస్కరించారు. ఇదే సమయంలో రాజ్యాంగంలోని 130వ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.స్థానిక భాషల్లో తర్జుమా చేయాల్సిందేఈ నేపథ్యంలోనే న్యాయపరమైన ప్రొసీడింగ్స్, తీర్పులు సామాన్య ప్రజలకు మరింత సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆంగ్లం నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువదించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు భావించింది. కృత్రిమ మేధ(ఏఐ)తో పాటు ట్రాన్స్లేషన్ టూల్స్‌ని ఉపయోగించి ఈ–ఎస్సీఆర్ తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గత సీజేఐ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలో ఏఐ సహాయక న్యాయ అనువాద సలహా కమిటీని నియమించారు. మొత్తం షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లోకి తర్జుమా చేయాలని నిర్ణయించారు. గతేడాది వరకూ 16 భాషల్లో మాత్రమే చేయగా.. ప్రస్తుతం 18 భాషలకు తర్జుమా చేరుకుంది. ఇలాంటి కమిటీలే దేశంలోని అన్ని హైకోర్టుల్లోనూ ఆయా హైకోర్టుల న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటయ్యాయి. తీర్పులను 16 స్థానిక భాషల్లోకి అనువదించేందుకు హైకోర్టులతో సుప్రీంకోర్టు భాగస్వామ్యమవుతోంది. -
స్థానిక భాషలో సమాచారం కోసం సంస్థల సహకారం
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ ద్వారా సమాచారం అందించే వికీమీడియా ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2024’ను నిర్వహించింది. ఇటీవల మూడు రోజుల పాటు సాగిన ఈ సమ్మిట్‌లో స్థానిక భాషలోని సమాచారాన్ని ఇతర భాషలో అందించేందుకు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు విద్యార్థులు ప్రధానపాత్ర పోషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గనడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.దేశంలో వివిధ భాషలు మాట్లాడుతున్న వారికి ఈ సమ్మిట్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోందని ఐఐఐటీ హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాధికా మామిడి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐ4భారత్, బిట్స్ పిలానీ, సీఐఎస్, ఐఐఐటీ హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ నిపుణులు కలిసి దేశీయ భాషల్లో కంటెంట్ అభివృద్ధిపై మాట్లాడారు. రియల్‌టైమ్ కంటెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమయ్యే సాంకేతికతపై చర్చించారు. వికీమీడియా ఫౌండేషన్ అనుసరిస్తున్న కొన్ని ఫీచర్లు, సాధనాలపై మాట్లాడారు. మొబైల్ ఎడిటింగ్, వాయిస్, ఇమేజ్ ఆధారిత స్క్రిప్ట్‌లు, వికీమీడియా కమ్యూనిటీలు, వర్క్‌షాప్‌లతో వివిధ అంశాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: 100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్భారతీయ భాషల్లో వివిధ విభాగాలకు చెందిన సమగ్ర కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు అనువుగా ఆన్లైన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో వికీమీడియా, వికీపీడియా వంటి సంస్థలు విద్యార్థుల సాయం తీసుకుంటున్నాయి. ఫలితంగా ఓపెన్స్సోర్స్ టూల్స్ ద్వారా నేరుగా కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు వారి సహకారాన్ని కోరుతున్నాయి. -
యూట్యూబ్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!
యూజర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో (ఆడియోలో) చూడొచ్చు. తొలిసారి ఈ తరహా టెక్నాలజీని నెట్‌ఫ్లిక్స్ వీక్షకులకు పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్ గేమ్‌ను వీక్షకులకు అర్ధమయ్యేలా సబ్‌టైటిల్స్ పాటు, స్థానిక భాషల్లో డబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు యూట్యూబ్ సైతం అదే తరహాలో ఇతర లాంగ్వేజ్ వీడియోలను యూజర్లకు నచ్చిన భాషలో చూడొచ్చు. అంటే..యూట్యూబ్‌లో మనం కొన్ని వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. భాష అర్ధం గాక పోవచ్చు.. కానీ భావం తెలుస్తుంది. అయితే యూట్యూబ్ అందించే కొత్త ఫీచర్ సాయంతో బాహుబలిలో కాలకేయ కిలికి వంటి భాషల నుంచి ఇతర దేశాల్లోని స్థానిక భాషల వరకు.. మనకు అర్ధమయ్యే భాషలో డబ్ చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది. -
కోర్టుల్లో స్థానిక భాష: మోదీ
కేవడియా (గుజరాత్): న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి. కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్లో శనివారం మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు. ‘‘లోక్ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి. పేదలకు సులువుగా సత్వర న్యాయమూ దొరుకుతోంది. చట్టాల్లోని కాఠిన్యం, గోప్యత లేనిపోని సంక్లిష్టతలకు దారి తీస్తుంది. అలాగాక అవి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారు. స్థానిక భాషలోనూ రాస్తారు. అలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలి. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు భారత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇంధనావసరాలు తీర్చేందుకు ఉమ్మడి కృషి పరిశోధన సంస్థలకు మోదీ పిలుపు న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు పరిశ్రమ, పరిశోధన, విద్య తదితర రంగాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటివాటి వాడకాన్ని పెంచాలన్నారు. శనివారం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌ను ప్రపంచ సారథిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ 2047 దిశగా కృషి చేయాలని సూచించారు. -
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
ఇండియా కోసం ప్రత్యేకంగా ‘డాట్‌భా’.. ప్రత్యేకతలు ఇవే
ముంబై: డాట్‌కామ్, డాట్ఇన్ మొదలైన ఇంటర్నెట్ డొమైన్స్ స్థానంలో తాజాగా భారత్‌ను ప్రతిబింబించేలా డాట్‌భా (.bha) పేరిట డొమైన్‌ను స్టార్టప్ సంస్థ ఆగామిన్ టెక్నాలజీస్ ఆవిష్కరించింది. ఇండియా (పట్టణ ప్రాంతాలు), భారత్ (గ్రామీణ ప్రాంతాలు) మధ్య డిజిటల్ తారతమ్యాలను చెరిపివేసే దిశగా ఈ ప్రయత్నం తోడ్పడగలదని సంస్థ వ్యవస్థాపకుడు సజన్ నాయర్ తెలిపారు. త్వరలో తెలుగులో హిందీతో ప్రారంభించి తెలుగు, తమిళం, కన్నడ తదితర ప్రాంతీయ భాషల్లోనూ టాప్ లెవెల్ డొమైన్స్ (టీఎల్‌డీ)ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నాటికి బెంగాలీ, ఏప్రిల్‌లో మలయాళం, మే నెలలో ఉర్దూ వెర్షన్లలో వీటిని ఆవిష్కరించనున్నట్లు నాయర్ వివరించారు. ఇమోజీలు, ఇంటిపేర్లతో కూడా టీఎల్డీలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధారణంగా వెబ్సైట్లో పేరు, టీఎల్‌డీ కలిసి ఉంటాయి. ఉదాహరణకు గూగుల్ డాట్ కామ్ తీసుకుంటే, గూగుల్ అనేది సంస్థ పేరు కాగా, డాట్‌కామ్ అనేది టీఎల్డీగా వ్యవహరిస్తారు. -
SC Committee: ఈ–కోర్టుల మొబైల్ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసు స్థితిగతులు, ఇతరత్రా పలు అంశాలు తెలుసుకోవడానికి ‘ఈ–కోర్టుల సేవల మొబైల్ యాప్‘ మాన్యువల్‌ని 14 భాషల్లో సుప్రీంకోర్టు ఈ– కమిటీ విడుదల చేసింది. సామాన్యులకి కూడా అర్థమయ్యేలా స్క్రీన్ షాట్స్‌తో సహా వివరణాత్మకంగా ఉండేలా ఆంగ్లం, తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ఉచితంగా అందుబాటులో ఉండేలా రూపొందించిన ఈ మాన్యువల్‌ను సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఛైర్మన్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం విడుదల చేశారు. ఆంగ్లం, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, ఖాసి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, తమిళంలో ఈ మాన్యువల్ రూపొందించారు. న్యాయవాదులు, పౌరులు, న్యాయ సంస్థలు, పోలీసు, ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థాగత న్యాయవాదుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే విడుదల చేసిన ‘‘ఈ–కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్’’ ఇప్పటివరకు 57 లక్షల డౌన్లోడ్లను దాటింది. మొబైల్ యాప్‌ను, ఆంగ్ల, ప్రాంతీయ భాషల్లోని మాన్యువల్‌ను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్... ఈ–మాన్యువల్, మొబైల్ యాప్ ప్రాముఖ్యత వివరించారు. ‘‘న్యాయ రంగంలో డిజిటల్ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో సుప్రీంకోర్టు ఈ–కమిటీ ముందంజలో ఉంది. గత సంవత్సరంలో లాక్డౌన్, ప్రజారోగ్య సమస్యల దృష్ట్యా కార్యాలయాలు మరియు కోర్టులను మూసివేయడం వల్ల రిమోట్‌గా పనిచేయడం, వర్చువల్ కోర్టులు, డిజిటల్ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ కేసు నిర్వహణ, చట్టపరమైన వృత్తిని ఎలా అభ్యసిస్తారు, ఎలా నిర్వహిస్తారు అనే అంశాల్లో సమగ్రంగా మార్పులు వచ్చాయి. సాంకేతికతను వాడటం వల్ల న్యాయ ప్రక్రియ మరింత సమర్థంగా పనిచేయడానికి, అందరికీ అందుబాటులో ఉండటానికి, పర్యావరణహితంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మాన్యువల్ గురించి న్యాయ శాఖ కార్యదర్శి బారున్ మిత్రా మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఈ ఎలక్ట్రానిక్ కేస్ మేనేజ్మెంట్ టూల్స్ ఉపకరిస్తాయన్నారు. ఈ–కోర్టు సేవల మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి, కేసు సంఖ్యలు, సీఎన్ఆర్ నంబర్లు, ఫైలింగ్ నంబర్లు, పార్టీ పేర్లు, ఎఫ్ఐఆర్ నంబరు, అడ్వొకేట్ వివరాలు, చట్టాలు, మొదలైన కేసుల కోసం వివిధ పౌర–కేంద్రీకృత సేవలను పొందవచ్చు. కేసు స్థితి, విచారణ జరిపే కేసుల జాబితా వంటివి సెర్చ్ చేసుకోవచ్చు. కేసు వారీగా కేసు డైరీతో సహా దాఖలు చేసి విచారణ పూర్తయ్యేవరకూ పూర్తి వివరాలు పొందొచ్చు. మొబైల్ యాప్ నుండి ఆర్డర్లు / తీర్పు, కేసు వివరాలను బదిలీ చేయడం, మధ్యంతర దరఖాస్తు స్థితిని యాక్సెస్ చేయవచ్చు. ఈ–కోర్ట్స్ సేవల మొబైల్ యాప్ ద్వారా– హైకోర్టులు మరియు జిల్లా కోర్టుల కేసు స్థితి / కేసు వివరాలు కూడా పొందవచ్చు. (చదవండి: Corona virus: వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా!) -
ఫోన్ పే చేతికి ఇండస్ ఓఎస్!
ముంబై: కంటెంట్, యాప్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ఇండస్ ఓఎస్‌ను.. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం కుదిరితే ఫోన్ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్ తదితర విభాగాలతో కూడిన సూపర్ యాప్ ‘స్విచ్’ను ఫోన్ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్‌ను ఫోన్ పే రూపొందించింది. కాగా.. దేశీ భాషల కంటెంట్ ద్వారా ఇండస్ ఓఎస్ వినియోగదారులకు చేరువైంది. వెరసి ఇండస్ ఓఎస్ కొనుగోలు ద్వారా ఫోన్ పే స్థానిక డెవలపర్స్‌ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఇండస్ బ్యాక్‌గ్రౌండ్ ఐఐటీ పూర్వవిద్యార్ధులు రాకేష్ దేశ్‌ముఖ్, ఆకాష్ డాంగ్రే, బి.సుధీర్ కలసి 2015లో ఇండస్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇండస్ యాప్ బజార్ పేరుతో ఆండ్రాయిడ్ యాప్‌స్టోర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 12 భారతీయ భాషల ద్వారా యాప్‌లతోపాటు, కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తోంది. 4 లక్షల యాప్‌లకు నిలయమై..10 కోట్లకుపైగా కస్టమర్లకు సర్వీసులందిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ పే జోరు దేశీయంగా యూపీఐ చెల్లింపులలో ఫోన్ పే.. టాప్ ర్యాంక్ థర్డ్ పార్టీ ప్రాసెసర్‌గా నిలుస్తోంది. గత నెల(ఏప్రిల్)లో 119 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. వీటి విలువ రూ. 2.34 లక్షల కోట్లుకాగా.. దాదాపు 45 శాతం మార్కెట్ వాటాకు సమానమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల మాతృ సంస్థ వాల్‌మార్ట్ నుంచి 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,100 కోట్లు) పెట్టుబడులను అందుకుంది. దీంతో ఫోన్ పే విలువ 550 కోట్ల డాలర్ల(రూ. 40,200 కోట్లు)కు చేరినట్లు అంచనా. -
మాతృభాషలో ఇంజనీరింగ్!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ సహా టెక్నికల్ కోర్సులు స్థానిక భాషల్లో నేర్చుకునే వీలు కల్పించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూమీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను మాతృభాషలో నేర్చుకునే వీలుకల్పించేలా కీలక నిర్ణయం తీసుకున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని, ఇందుకోసం కొన్ని ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. స్కాలర్షిప్పులు, ఫెలోషిప్పులు సమయానికి విద్యార్ధులకు అందించాలని, ఇందుకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయమని యూజీసీని సమావేశంలో ఆదేశించారు. కష్టమే..: సాంకేతిక పదబంధాలు అధికంగా ఉండే టెక్నికల్ కోర్సులను ఇంగ్లిష్‌లో కాదని స్థానిక భాషల్లో బోధించడం సవాలేనని, పైగా వచ్చే విద్యాసంవత్సరం దగ్గరలో ఉన్న ఈ స్వల్పతరుణంలో ఈ సవాలను అధిగమించడం కష్టమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మాతృభాషలో ఇంజనీరింగ్ సిలబస్‌కు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ రూపొందించాలని, బోధించేందుకు సిబ్బందికి తర్ఫీదు ఇవ్వాల్సిఉంటుందని నిపుణులు వివరించారు. -
నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్
సాక్షి, బెంగుళూరు : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగ నియామక పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఇంగ్లీష్, హిందీ కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ప్రాంతీయ బ్యాంకులు ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు స్కేల్-1 ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షను కూడా స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై కుమారస్వామి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
కస్టమర్లే టార్గెట్ : ఉబెర్ కొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ ఇండియా సరికొత్త ప్రణాళికలతో దూసుకు వస్తోంది. భారత్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడంతోపాటు, కొత్త వినియోగదారులే లక్ష్యంగా వ్యూహ రచన చేసింది. డారా ఖోస్రోషహీ నాయకత్వంలో ఉబెర్ ఇండియా ఇక్కడి మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తోంది. నెట్వర్క్ లో కనెక్టివిటీ పరిస్థితుల్లోనూ, అలాగే తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లలో కూడా బాగా పని చేయడానికి వీలుగా ఉబెర్ యాప్‌లో 'లైట్' వెర్షన్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఈ ఉబెర్‌లైట్ వెర్షన్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. త్వరలోనే భారతీయ భాషలు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ , గుజరాతీ భాషల్లో విడుదల చేయనుంది. తద్వారా భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రధాన ప్రత్యర్థి ఓలాను ఢీకొట్టేందుకు సిద్దపడుతోంది. టైర్ -3 నగరాలలో దాని వినియోగదారుల సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి, ప్రజాదరణను పెంచుకోటానికి ఉబెర్ తన యాప్‌లో డేటా-లైట్ సంస్కరణను ప్రవేశపెట్టింది. స్థానిక కస్టమర్లకు ఆకట్టుకునేలా వారికి అందబాటుల్లో భాషల్లో యాప్‌ను లాంచ్ చేయనుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను లాంచ్ చేసింది. ఉబెర్ లైట్ రానున్న నెలల్లో దేశంలోని ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులోకి వస్తుందని ఉబెర్ ప్రకటించింది. ఏడు భారతీయ భాషలలో దీన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లకు రైడ్-బుకింగ్ అనుభవాన్ని సాధ్యమైనంత మృదువుగా, సన్నిహితంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం యూజర్లతో మాట్లాడుతున్నామని ఉబెర్ రైడర్ ప్రొడక్షన్ హెడ్ పీటర్ డెంగ్ చెప్పారు. -
స్థానిక భాషలో వాట్సాప్ వాడటమెలా?
గత కొన్నేళ్లుగా కమ్యూనికేషన్ మాధ్యమంగా వాట్సాప్ ఎంతో ప్రాచుర్యం పొందింది. 200 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్‌లో ఫేస్బుక్ తనదైన సత్తా చాటుతోంది. ప్రస్తుతం మీ ఫేవరెట్ ఈ యాప్ 10 స్థానిక భాషలను సపోర్టు చేస్తోందని తెలిసింది. హిందీ, మలయాళం, బెంగాళీ, పంజాబి, తెలుగు, మరాఠి, తమిళ్, ఉర్దూ, గుజరాతి, కన్నడ భాషలను ఇది సపోర్టు చేస్తోంది. అయితే స్థానిక భాషల్లో వాట్సాప్ వాడటం ఎలానో చూడండి... తొలుత యాప్‌లో మీ భాషను మార్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం వాట్సాప్ ఓపెన్ చేయాలి మెనూ బటన్‌ను ట్యాప్ చేయాలి సెట్టింగ్స్‌కు వెళ్లాలి ఛాట్‌కి వెళ్లి, అనంతరం యాప్ లాంగ్వేజ్‌ను ఓపెన్ చేయాలి పాప్ నుంచి మీకు నచ్చిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి మీ ఫోన్ సామర్థ్యం బట్టి, ఇంగ్లీష్, హిందీ, బెంగాళి, పంజాబి, తెలుగు, మరాఠి, ఉర్దూ, గుజరాతి, కన్నడ, మళయాలం భాషల్లో మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఫోన్ లాంగ్వేజ్‌ను వాట్సాప్ ఫాలో అవుతూ ఉంటుంది ఒకవేళ మీ ఫోన్ లాంగ్వేజ్‌ను హిందీలోకి మారిస్తే, వాట్సాప్ టెక్ట్స్ అంతా వెంటనే హిందీలోకి మారిపోతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ బట్టి ఈ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి. ఆండ్రాయిడ్ యూజర్లు... సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి లాంగ్వేజస్ అండ్ ఇన్పుట్ను ట్యాప్ చేయాలి లాంగ్వేజస్‌ను ఓపెన్ చేయాలి మీకు కావాల్సిన లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి అనంతరం వాట్సాప్ ఓపెన్ చేస్తే, దానిలో టెక్ట్స్ అంతా మీరు ఎంపిక చేసుకున్న భాషల్లోనే వస్తోంది ఐఓఎస్ యూజర్ల కోసం... సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి జనరల్‌ను ట్యాప్ చేయాలి లాంగ్వేజ్ అండ్ రీజన్లోకి వెళ్లాలి ఐఫోన్ లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవాలి అనంతరం మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి తదుపరి వాట్సాప్ ఓపెన్ చేస్తే, టెక్ట్స్ అంతా ఎంపిక చేసుకున్న భాషలో వచ్చేస్తోంది -
ఈ ఐపీఎల్లో 100 మంది కామెంటేటర్స్!
ముంబై : మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం అవుతున్న ఓ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వార్తే ఏమిటంటే ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం 100 మంది వ్యాఖ్యాతలుగా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ 100 మందిలో మ్యాచ్‌ల్లో కనిపించేది మాత్రం 24 మంది కామెంటేటర్సేనంటా.! మిగతా వారంతా మరో అరడజను స్థానిక భాషల్లో కామెంటరీ చెప్పనున్నారని సమాచారం. ఇందులో మహిళా కామెంటేటర్లతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఆడని వాళ్లు ఉన్నారు. ఈ సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ టోర్నీని 700 మిలియన్ల మందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోందని, దీనిలో భాగంగానే స్థానిక భాషలకు కామెంటేటర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక కామెంటేటర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారనదే ముఖ్యం కాదు.. ప్రజలకు ఎంత చేరువ అవుతున్నామనదే ముఖ్యమని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ కామెంటేటర్స్ ఎంపికలో మాజీ ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీలో ఈ సీజన్ ఐపీఎల్ ప్రేక్షకులను అలరించనుంది. -
ఇక స్థానిక భాషల్లోనే సమాచారం
‘వికాస్పీడియా’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం తెలుగుతో సహా ఐదు భాషల్లో అందుబాటులోకి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల ద్వారా అందే సేవలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి సామాజికాభివృద్ధి రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇక తెలుగులో కూడా తెలుసుకోవచ్చు. స్థానిక అధికార భాషల్లోనే ఆన్లైన్లో సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు విజ్ఞానాన్ని, సేవలను పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘వికాస్పీడియా.ఇన్ (ఠిజీజ్చుటఞ్ఛఛీజ్చీ.జీ)అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని ప్రజాస్వామ్యీకరించడంలో భాగంగా ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు భారత ప్రభుత్వరంగ సంస్థ ‘ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక శాఖ (డైటీ)’ కార్యదర్శి జె.సత్యనారాయణ వెల్లడించారు. డైటీ ఆధ్వర్యంలోని ఈ పోర్టల్‌ను హైదరాబాద్‌లోని ‘ప్రగతి సంగణన వికాస కేంద్రం (సీ-డాక్)’ నిర్వహిస్తోందనిచెప్పారు. ఇంతకుముందు కొన్నిరకాల సమాచారాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాల్సి వచ్చేదని, ఈ పోర్టల్ ద్వారా ఉచితంగానే సమాచారాన్ని పొందవచ్చన్నారు. పోర్టల్‌లో ఉండే సమాచారం... {పస్తుతం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, విద్యుత్, ఈ-గవర్నెన్స్ విభాగాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ-డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, పెన్షన్లు, తదితర అంశాల గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. మిగతా రంగాల సమాచారాన్ని కూడా తర్వాతి దశల్లో చేరుస్తారు. తొలిదశగా ప్రస్తుతం తెలుగు, హిందీ, ఆంగ్లం, మరాఠీ, అస్సామీ భాషల్లోనే ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంది. దశలవారీగా 22 అధికారిక భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు. ఏడు ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టుల్లో భాగంగా.. సమాచారాన్ని వివిధ భాషల్లోకి మార్చేందుకు ఉపయోగపడే టూల్స్‌ను, మొబైల్ అప్లికేషన్లను రూపొం దించిన వారికి బహుమతులూ అందజేశారు.