నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్‌ | Karnataka Chief Minister Thanked Union Finance Minister Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్‌

Published Thu, Jul 4 2019 8:56 PM | Last Updated on Thu, Jul 4 2019 8:57 PM

Karnataka Chief Minister Thanked Union Finance Minister Nirmala Sitharaman - Sakshi

సాక్షి, బెంగుళూరు : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగ నియామక పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఇంగ్లీష్‌, హిందీ కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీని వల్ల ప్రాంతీయ బ్యాంకులు ఆఫీస్‌ అసిస్టెంట్‌తో పాటు స్కేల్‌-1 ఆఫీసర్‌ పోస్టుల నియామక పరీక్షను కూడా స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై కుమారస్వామి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement