Bank jobs
-
ఎస్బీఐలో 10 వేల మంది కొత్త ఉద్యోగులు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై దృష్టి పెట్టింది."మా వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు అలాగే జనరల్ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నాం. ఇటీవల ఎంట్రీ లెవల్తోపాటు కొంచెం ఉన్నత స్థాయిలో దాదాపు 1,500 మంది టెక్నాలజీ అర్హుల నియామకాలను ప్రకటించాం" అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వార్తా సంస్థ పీటీఐకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు."మా టెక్నాలజీ రిక్రూట్మెంట్ డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్వర్క్ ఆపరేటర్లు మొదలైన ప్రత్యేక ఉద్యోగాలపై ఉంది. టెక్నాలజీ విభాగంలో వివిధ రకాల ఉద్యోగాల కోసం వారిని రిక్రూట్ చేస్తున్నాం. కాబట్టి, మొత్తంగా ప్రస్తుత సంవత్సరంలో 8,000 నుంచి 10,000 మంది అవసరం మాకుంది. ప్రత్యేక విభాగంతోపాటు సాధారణ విభాగంలోనూ ఉద్యోగుల చేరిక ఉంటుంది" అని పేర్కొన్నారు.ఎస్బీఐలో ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,296. ఇందులో 1,10,116 మంది ఆఫీసర్లు. ఇక బ్యాంక్ నెట్వర్క్ విస్తరణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని ఎస్బీఐ యోచిస్తోందని శెట్టి చెప్పారు. ఎస్బీఐ 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖలను కలిగి ఉంది. ఇవి కాకుండా 65,000 ఏటీఎంలు, 85,000 బిజినెస్ కరస్పాండెంట్ కేంద్రాలు ఉన్నాయి. -
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్‌సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. -
ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కాస్ట్‌కటింగ్ వల్ల స్టార్టప్ కంపెనీలతోపాటు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ లేఆఫ్స్ సెగ బ్యాంకింగ్ రంగాన్ని తాకింది. దాంతో బ్యాంకులు తమ ఉద్యోగులను కొలువు నుంచి తొలగిస్తున్నాయి. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ తాజా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ ఇటీవల రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. తిరిగి లాభాల బాట పట్టడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి సిటీ గ్రూప్ 'కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ' చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే రెండేళ్లలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సిటీగ్రూప్‌లో ప్రస్తుతం 2,39,000 మంది పని చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఇరవైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతంగా ఉంది. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! సిటీ గ్రూప్ 2022 ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 1.9 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ఆదాయం మూడు శాతం తగ్గి దాదాపు 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 19 శాతం తగ్గి రూ.36 వేలకోట్లకు చేరుకుంది. -
ఆ కంపెనీల ఆదాయ వ్యయాలు అధికం
డెబ్బై గంటల పని వారాలపై ఇటీవల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత పెరుగుతోంది. మరొకొన్నింటిలో తక్కువగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగికి చేసే ఖర్చు, ఆ ఉద్యోగి సంస్థకు చేకూర్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని సంస్థలు చేసిన సర్వేలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..గత ఐదేళ్లలో కంపెనీలకు వచ్చే మొత్తం రాబడిలో సిబ్బంది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. అయితే 2019లో రూ.1.46 కోట్లుగా ఉన్న టాప్ 500 లిస్టెడ్ కంపెనీల రాబడి 36% పెరిగి 2023లో దాదాపు రూ.2 కోట్లకు చేరుకుంది. కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులపై చేసే వ్యయం కూడా అధికమవుతుంది. దాదాపు కంపెనీల వ్యయంలో 10శాతం ఉద్యోగుల జీతాలకు కేటాయిస్తున్నాయి. 2020-21 కరోనా సమయంలో ఉద్యోగుల ఆదాయం పడిపోయింది. కానీ గత రెండేళ్లలో వారి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తుంది. ద్రవ్యోల్బణం సమయంలో కంపెనీల ఉత్పాదకత తగ్గి ఉద్యోగుల ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తాయి. దాంతో వారి ఆదాయాలు పెరిగినట్లు అవుతుంది. కానీ ద్రవ్యోల్బణ భయాలు సమసిపోతున్నపుడు క్రమంగా ఆదాయ వ్యయాలు సర్దుబాటవుతాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీస్, ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉత్పాదకత వాస్తవానికి మెరుగుపడింది. ఆయా రంగాలు వారి ఉద్యోగులను గరిష్ఠస్థాయిలో వినియోగించుకున్నట్లు సర్వేలు తెలిపాయి. ఆ కంపెనీల ఆదాయవ్యయాలు పెరుగుతున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, మ్యానుఫాక్చరింగ్, మైనింగ్, రిటైల్ రంగాలు ఇప్పటికీ తక్కువ స్థాయిలో కార్మికులను ఉపయోగిస్తున్నాయి. అయితే 2019 నాటికి టాప్ 500కంపెనీల్లో దాదాపు 6 కోట్ల ఉద్యోగులు ఉండేవారు. 2023 నాటికి వారి సంఖ్య 7 కోట్లకు చేరింది. గడిచిన ఐదేళ్లలో కంపెనీలు ఏటా 12.6శాతం మేర వృద్ధి చెందాయి. అదేవిధంగా వారి ఉద్యోగులకు చేసే ఖర్చు సైతం ఏటా 12.5శాతం చొప్పున పెరిగింది. -
మంచి స్కోర్ ఉంటేనే బ్యాంక్ జాబ్! స్కోర్ అంటే ఎగ్జామ్‌లో కాదు..
మంచి స్కోర్ ఉంటేనే బ్యాంక్ జాబ్‌కు అర్హత సాధించగలరు. స్కోర్ అంటే ఎగ్జామ్‌లో వచ్చే స్కోర్ కాదు. ఎస్బీఐ మినహా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ నిర్వహించే ఉమ్మడి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అభ్యర్థులకు కొత్త నిబంధన విధించింది. దీని ప్రకారం అభ్యర్థులు ఆరోగ్యకరమైన సిబిల్ స్కోర్ కలిగి ఉండాలి. ఐబీపీఎస్ ఇటీవల విడుదల చేసిన భారీ క్లరికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని, ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు కనీసం 650 సిబిల్ స్కోర్ కలిగి ఉండాలని పేర్కొంది. అయితే బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు తమ సిబిల్ స్టేటస్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ది హిందూ పత్రిక నివేదించింది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే నాటికి సిబిల్ స్టేటస్‌ను అప్డేట్ చేయించుకోవాలి లేదా ప్రతికూలంగా ప్రతిబింబించే అకౌంట్లకు సంబంధించి ఎటువంటి బాకీ లేదని బ్యాంకు, రుణదాత నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. సిబిల్ విఫలమైతే, అర్హత ప్రమాణాల మేరకు ఆఫర్ లెటర్‌ను ఉపసంహరిస్తామని, లేదా రద్దు చేస్తామని ఐబీపీఎస్ పేర్కొంది. సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ నివేదిక అనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వివరాలకు సంబంధించిన ఆర్థిక నివేదిక. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ అనేది వారి క్రెడిట్ హిస్టరీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా లెక్కిస్తారు. సిబిల్తోపాటు ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్ వంటివి భారతదేశంలో క్రెడిట్ స్కోర్లను గణించే క్రెడిట్ బ్యూరోలు. సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. సిబిల్ నివేదికలో ఉన్న క్రెడిట్ హిస్టరీ ఆధారంగా సిబిల్ స్కోర్ రూపొందిస్తారు. హోమ్ లోన్లు, క్రెడిట్ కార్డ్‌లు, పర్సనల్ లోన్లు, ఆటోమొబైల్ లోన్లు, ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీస్‌తో పాటు ఇతర రుణాలు, వాటి చెల్లింపు చరిత్ర వంటి అన్ని వివరాలు ఈ క్రెడిట్ ప్రొఫైల్‌లో ఉంటాయి. కాగా ఐబీపీఎస్ ఈ సంవత్సరం 4,045 క్లరికల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత మళ్లీ 500 పోస్టులను అదనంగా చేర్చింది. అంటే మొత్తం 4,545 ఖాళీలకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూలై 21న ముగియనుంది. ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్ -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్‌కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
ఎస్బీఐలో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో) ► మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్ పోస్టులు–2000, బ్యాక్లాగ్ పోస్టులు 56). ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్/డిసెంబర్ 2021 ► వెబ్సైట్: https://bank.sbi/web/careers -
బ్యాంకు జాబ్ ట్రై చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్
డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. 650 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీన ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా శిక్షణ ఇచ్చి.. నియామకం ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, శిక్షణ విధానం గురించి తెలుసుకుందాం.. ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. మణిపాల్(బెంగళూరు), నిట్టే(గ్రేటర్ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా.. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు(9 నెలలు తరగతి బోధన, 3 నెలల ఇంటర్న్‌షిప్) శిక్షణను అందిస్తారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఖాయం అవుతుంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 650. ఇందులో జనరల్–265, ఎస్సీ–97, ఎస్టీ–48, ఈడబ్ల్యూఎస్–65, ఓబీసీలకు–175 పోస్టులు కేటాయించారు. ఎంపిక ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ ఆధారంగా కోర్సుకు ఎంపిక చేస్తారు. 200 మార్కులకు ఆన్లైన్ టెస్ట్ ► ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహలో 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ 60 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున తగ్గిస్తారు. ఆన్లైన్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఈ విభాగంలో నంబర్స్, కోడింగ్, డీ కోడింగ్, అనాలజీ, సిరీస్,డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, పజిల్స్, ఆల్ఫాబెట్టెస్ట్ తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఇందులో వివిధ గణంకాలకు సంబంధించి అభ్యర్థుల మ్యాథమెటికల్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఎదురవుతాయి. డేటా ఆధారంగా విశ్లేషణ చేసే సామర్థ్యం అభ్యర్థుల్లో ఉందో లేదో ఈ విభాగం ద్వారా పరీక్షిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషపై ఉన్న పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ అరేంజ్మెంట్స్, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. గ్రామర్, వొక్యాబులరీ, యాంటోనిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అభ్యర్థుల తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ఇందులో సింప్లిఫికేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, డేటా సఫీషియన్సీ, మిక్చర్ అండ్ అలిగేషన్స్ వంటి వాటిపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్, ఎకానమీ, ఆర్బీఐ–విధులు, జీడీపీ, జీఎన్‌పీ, ఎన్డీపీ/ఎన్‌ఎన్‌పీ, ఇతర ఆర్థిక, ఫైనాన్స్ విభాగాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి గత 5 లేదా 6 నెలల కాలానికి సంబంధించిన పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంస్థలు తీసుకున్న నిర్ణయాలు, ప్రముఖ వ్యక్తులు, రచనలు, క్రీడలు, ఒలింపిక్స్ సహా ఇతర ప్రాధాన్యత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ► అభ్యర్థులు తాజా కరెంట్ అఫైర్స్‌తోపాటు 2021 కేంద్ర బడ్జెట్, 2020–21 ఆర్థిక సర్వేలను కూడా అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ ఇలా ► ఆన్లైన్ పరీక్షను సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహించనున్నారు. అంటే.. పరీక్షకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ సమయంలో ఎక్కువగా ముఖ్యాంశాల రివిజన్‌పై దృష్టిపెట్టాలి. ► బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు ఇప్పటికే సిలబస్ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటారు. ఇప్పుడు పరీక్ష తేదీకి అనుగుణంగా రివిజన్ కొనసాగిస్తే సరిపోతుంది. ► ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా.. బ్యాంక్ పరీక్షల గత ప్రశ్న పత్రాలు, మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎంపికైతే ► ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు ఫీజు మూడున్నర లక్షలు. అర్హత గల అభ్యర్థులు ఐడీబీఐ నుంచి రుణం కోసం ప్రయత్నించొచ్చు. కోర్సులో చేరేటప్పుడే అభ్యర్థులు మూడేళ్ల సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ► ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలం(తొమ్మిది నెలలు)లో నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్ కాలం(మూడు నెలలు)లో నెలకు రూ.పది వేలు అందిస్తారు. ► పీజీడీబీఎఫ్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఏ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి వేతన శ్రేణి రూ.36000–రూ.63840 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.idbibank.in -
యూనియన్ బ్యాంకులో.. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, అనుభవం ఉంటే.. మూడంచెల్లో జరిగే ఎంపిక ప్రక్రియ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో చక్కటి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా యూబీఐకి పేరుంది. డిజిటలైజేషన్ ఊపందుకుంటున్న నేపథ్యంలో.. వినియోగదారులకు ఆన్లైన్ సేవలను మరింత వేగంగా అందించేందుకు బ్యాంకులు స్పెషలిస్ట్ ఆఫీసర్లను నియమిస్తుంటాయి. అందులో భాగంగా యూబీఐ.. 2021 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ► మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య –347 ► పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146. ► విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటింగ్, టెక్నికల్ ఆఫీసర్. అర్హతలు ► పోస్టుల వారీగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్,సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్,ఎంబీఏ, సీఏ /సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం, సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి. వయసు ► సీనియర్ మేనేజర్ స్థాయి పోస్టులకు 30–40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్లకు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం ► యూబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో జరుగుతుంది. తొలుత ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇలా మూడు దశల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 200 మార్కులకు రాత పరీక్ష ► రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మల్టిపుల్ ఛాయిస్ విధానం(ఎంసీక్యూలు)లో ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌లో 50 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు–100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 పశ్నలకు– 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యూబీఐ రాత పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4వంతు మార్కు తగ్గిస్తారు. సమాధానాలు గుర్తించకుండా వదిలేసిన ప్రశ్నలకు ఎటువంటి నెగిటివ్ మార్కుల నిబంధన వర్తించదు. గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 25 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పోస్టులను బట్టి 3:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అంటే.. ఒక పోస్టుకు ముగ్గురు పోటీపడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 50 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి అకడెమిక్ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆలోచనల్లో స్పష్టత, హాబీలు, ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్, వ్యక్తిత్వం, ఉద్యోగానికి తగిన లక్షణాలు ఉన్నాయా.. ఇలా వివిధ కోణాల్లో పరీక్షిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలోనూ కనీస అర్హత మార్కులు 25. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు కనీసం 22.5 మార్కులు సాధించాలి. కనీస అర్హత మార్కులు పొందని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. వేతనాలు సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ. 63,840–78,230, మేనేజర్ స్థాయి అధికారులకు రూ.48,170–69,810, అసిస్టెంట్ మేనేజర్లుకు రూ.36,000–63,840 వరకు వేతన శ్రేణి ఉంటుంది. ఇవే కాకుండా హెచ్ఆర్ఏ, డీఏ, సిటీ కంపన్సేటరీ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ వంటివి లభిస్తాయి. ప్రొబేషన్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని యూబీఐ బ్రాంచీలలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే గతంలో యూబీఐ ఎస్ఓ నియామకాలను చూస్తే.. తొలుత రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా పనిచేయాల్సి ఉండేది. ఇప్పుడు కూడా ఆదే నిబంధన అమలయ్యే అవకాశం ఉంది. కెరీర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు యూబీఐలో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ పదోన్నతుల విధానానికి అనుగుణంగా అనుభవం, పనితీరుకు ఆధారంగా ఉన్నతస్థాయి హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.unionbankofindia.co.in -
ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్.. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 68 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(సివిల్)–36, అసిస్టెంట్ మేనేజర్–ఇంజనీర్(ఎలక్ట్రికల్)–10,అసిస్టెంట్ మేనేజర్–మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్–04, డిప్యూటీ మేనేజర్(అగ్రికల్చర్ స్పెషల్)–10, రిలేషన్షిప్ మేనేజర్(ఓఎంపీ)–06, ప్రొడక్ట్ మేనేజర్(ఓఎంపీ)–02. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్)/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 01.04.2021 నాటికి 21ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:13.08.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:02.09.2021 ► పరీక్ష తేది: 25.09.2021 ► వెబ్సైట్: https://sbi.co.in -
అవుతారా.. ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్!
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ).. ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో మొత్తం 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనుంది. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడీబీఐ 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్(సీఎస్ఈ) లేదా టెల్లర్ సర్వీస్ ఎగ్టిక్యూటివ్‌గా పనిచేస్తారు. అంతేకాకుండా బ్యాంక్ మేనేజర్‌కు అవసరమైన వృత్తిపరమైన సహాయ సహకారాలను కూడా అందించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తుంది. మొదట ఏడాది కాలానికి గాను కాంట్రాక్టు పద్ధతిన తీసుకుంటారు. అనంతరం మంచి పనితీరు, ఖాళీలకు అనుగుణంగా మరో రెండేళ్ల వరకు ఈ ఒప్పందాన్ని పొడిగిస్తారు. మూడేళ్ల కాంట్రాక్టును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారు.. ఐడీబీఐ అంతర్గతంగా నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా బ్యాంకులో శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–1) పోస్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. వేతనాలు ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఫిక్స్డ్ సాలరీస్‌ను అందిస్తారు. మొదటి ఏడాది ప్రతి నెల రూ.29000 చెల్లిస్తారు. రెండో ఏడాది కాంట్రాక్టు పొడిగించినట్లయితే.. ప్రతి నెల రూ.31,000.. అలాగే మూడో ఏడాది కూడా సేవలను వినియోగించుకుంటే ప్రతి నెల రూ.34,000 వేలు వేతనంగా చెల్లిస్తారు. ► ఈ పోస్టులకు ఎంపికైన వారికి డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఏ రకమైన అలవెన్సులు లభించవు. అలాగే ఎటువంటి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు కూడా ఉండవు. అర్హతలు ► ఐడీబీఏ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. ► వయసు: 01–07–2021నాటికి 20–25ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు–5ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్–5ఏళ్లు, ఓబీసీ–3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక ప్రక్రియ ఇలా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టుకు పిలుస్తారు. రాత పరీక్షతోపాటు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టులోనూ అర్హత సాధించిన అభ్యర్థులను తుది ఎంపిక జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.. ఆన్లైన్ పరీక్ష (సీబీటీ) ఆన్లైన్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 ప్రశ్నలు–50 మార్కులు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్æ 50 ప్రశ్నలు– 50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు (0.25) మార్కు తగ్గిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ:ఆగస్టు18, 2021 nఆన్లైన్ పరీక్ష తేదీ:సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: www.idbibank.in -
బ్యాంక్ ఉద్యోగాలు.. ఐబీపీఎస్ నోటిఫికేషన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ► మొత్తం పోస్టుల సంఖ్య: 5830 ► తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263 ► భర్తీ చేసే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ► అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్(200మార్కులు) పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4. ► ఆన్లైన్ మెయిన్ పరీక్ష: 31.10.2021 ► వెబ్సైట్: https://www.ibps.in/ -
ఎస్బీఐలో ఖాళీలు.. ఆన్లైన్లో అప్లై చేసుకోండి
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ముంబయిలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం... దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 6100 ► తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125. ► అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: ఒక ఏడాది. ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 31.10.2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► స్టయిపెండ్: అప్రెంటిస్ శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► రాత పరీక్ష ఇలా: ఎస్బీఐ అప్రెంటిస్ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్–25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట(60 నిమిషాలు). ప్రతి విభాగానికి 15 నిమిషాలు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.07.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021 ► వెబ్సైట్: https://bank.sbi/web/careers, https://apprenticeshipindia.org -
SBI Clerk 2021: బ్యాంక్ జాబ్స్‌కు.. బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఇలా
బ్యాంకింగ్ రంగంలో కొలువు.. క్లర్క్ నుంచి స్పెషలిస్ట్ కేడర్ వరకు.. ఏ పోస్ట్‌లో కొలువుదీరినా ఉజ్వల భవిష్యత్తు ఖాయమనే అభిప్రాయం! ఒక్కసారి బ్యాంక్ ఉద్యోగంలో చేరితే ఇక వెనుదిరిగి చూసుకోనక్కర్లేదనే భావన! అందుకే దేశంలో కొన్ని లక్షల మంది బ్యాంక్ జాబ్ కోసం పరీక్షలకు ప్రిపేరవుతుంటారు! అలాంటి వారందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీపి కబురు చెప్పింది. క్లరికల్ కేడర్‌లో 5వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ 2021 నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ.. మొత్తం 5,454 పోస్ట్‌లు ► ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా జాతీయ స్థాయిలో 5,454 పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ నియామకాల ద్వారా 5,000 పోస్ట్‌లను, బ్యాక్లాగ్ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది. క్లరికల్ కేడర్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ► అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 16, 2021లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది. హైదరాబాద్ సర్కిల్–275 పోస్టులు మొత్తం పోస్ట్‌లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 275 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 111, ఎస్సీ కేటగిరీలో 44, ఎస్టీ కేటగిరీలో 19, ఓబీసీ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 27 ఖాళీలను కేటాయించారు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను పరీక్ష మాధ్యమాలుగా పేర్కొనాల్సి ఉంటుంది. రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో రాత పరీక్షల విధానంలో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్ రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమినరీ పరీక్ష ► అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఇది మూడు గంటల వ్యవధిలో వంద మార్కులకు జరుగుతుంది. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటుంది. ► ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం నిబంధన అమల్లో ఉంటుంది. ఈ నిబంధన కారణంగా.. అభ్యర్థులు ఒక విభాగానికి సంబంధించిన సమాధానాలను దానికి కేటాయించిన సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ► అభ్యర్థులు పరీక్ష హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. –ఒకవేళ మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు.. మెయిన్ తర్వాత ప్రత్యేకంగా వారు ఎంపిక చేసుకున్న భాషలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సర్కిల్లో అధికార భాషకు సంబంధించిన లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాలి. మెయిన్ ఎగ్జామినేషన్ ► ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా..మొత్తం పోస్ట్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు పది మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఈ మెయిన్ పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50ప్రశ్నలు–60 మార్కులకు చొప్పున మొత్తంగా190 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. తుది జాబితా ఇలా ఎంపిక ప్రక్రియలో రెండు దశల(ప్రిలిమినరీ, మెయిన్) విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. నియామకం ఖరారు చేసే క్రమంలో మెయిన్‌లో చూపిన ప్రతిభనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందితేనే.. మెయిన్ పరీక్ష పేపర్ మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమినరీ నుంచే చక్కటి ప్రతిభ చూపేలా సన్నద్ధం కావాలి. ఉమ్మడి ప్రిపరేషన్ రెండు దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ నుంచే మెయిన్‌పైనా దృష్టిపెట్టాలి. ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీలను మెయిన్‌లోని జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీలతో అనుసంధానించుకుంటూ ప్రిపరేషన్ సాగించే వీలుంది. జూన్‌లో పరీక్ష ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష జూన్‌లో జరిగే ∙అవకాశముంది. అదే విధంగా మెయిన్‌ను జూలై 31న నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే విధంగా నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేయాలి. ముందుగా ప్రిలిమ్స్ తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లను చదవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. మెయిన్ ఎగ్జామ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. మెయిన్‌లో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. వాస్తవానికి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేలా సమయం కేటాయించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిపరేషన్ పటిష్టంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఈ విభాగం ముఖ్య ఉద్దేశం అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించడం. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇడియమ్స్,సెంటెన్స్ కరెక్షన్, వొ కాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇం గ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ మెయిన్ ఎగ్జామినేషన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రధానంగా అర్థమెటిక్ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పూర్తిగా అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృక్పథంతో అడుగులు వేయాలి. రీజనింగ్ ఇది కూడా రెండు దశల్లోనూ(ప్రిలిమ్స్, మెయిన్స్) ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రిలిమ్స్ సమయానికి ఈ అంశాలపై పట్టు సాధిస్తే.. మెయిన్‌లో అధిక శాతం సిలబస్‌ను కూడా పూర్తి చేసినట్లవుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్‌లో మాత్రమే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. తాజా బ్యాంకింగ్ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మెయిన్‌లో మాత్రమే ఉండే మరో విభాగం.. కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్స్ గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఆయా విభాగాలు, అంశాల పరంగా వెయిటేజీపై అవగాహన వస్తుంది. గ్రాండ్ టెస్ట్‌ల సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా.. తాము ఇంకా అవగాహన పొందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల పరీక్ష హాల్లో టైమ్ మేనేజ్మెంట్ పరంగా స్పష్టత వస్తుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ పరీక్షను దృష్టిలోపెట్టుకొని చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడంతోపాటు మెయిన్‌కు కూడా సన్నద్ధత లభిస్తుంది. క్లర్క్ కెరీర్ గ్రాఫ్ ఇలా ► క్లర్క్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్‌గా కొలువు సొంతం చేసుకుంటే.. చీఫ్ మేనేజర్,డీజీఎం వంటి స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ► ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటే క్లర్క్‌గా కెరీర్ మొదలవుతుంది. ► ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సీజీఎం స్థాయి వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ► క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత.. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే ట్రైనీ ఆఫీసర్ హోదా లభిస్తుంది. ► జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ విధానంలో 20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే సమయానికి డీజీఎం హోదాకు సైతం చేరుకోవచ్చు. ► ప్రస్తుతం అమలవుతున్న సర్వీస్ నిబంధనల ప్రకారం–క్లర్క్ స్థాయిలో కొలువుదీరిన వారు చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకోవడం ఖాయం. ఎస్బీఐ నోటిఫికేషన్– ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్ 27, 2021 నుంచి మే 17, 2021; ► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్ నెలలో జరుగుతుంది. ► మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: జూలై 31, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్ కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
SBI Recruitment 2021: బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు 30వేల వేతనం
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. క్లరికల్ కేడర్‌లో 5454 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ► మొత్తం పోస్టుల సంఖ్య: 5454 (రెగ్యులర్–5000, బ్యాక్లాగ్– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్–237). ► హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275. ► విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం: ► ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష : ► ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్: ► మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2గంటల 40నిమిషాలు. ముఖ్య సమాచారం: ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021 ► ప్రిలిమినరీ పరీక్ష : జూన్ 2021లో జరుగుతుంది. ► మెయిన్ పరీక్ష తేది: 31.07.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers -
నిర్మలా సీతారామన్‌కు సీఎం థ్యాంక్స్
సాక్షి, బెంగుళూరు : ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉద్యోగ నియామక పరీక్షలను స్థానిక భాషల్లో నిర్వహించేందుకు కేంద్రం అనుమతించింది. కొన్ని నిర్దిష్ట పోస్టులకు ఇంగ్లీష్, హిందీ కాకుండా 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల ప్రాంతీయ బ్యాంకులు ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు స్కేల్-1 ఆఫీసర్ పోస్టుల నియామక పరీక్షను కూడా స్థానిక భాషలో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్ణయంపై కుమారస్వామి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
30% బ్యాంకు కొలువులకు ముప్పు
♦ టెక్నాలజీలతోపొంచి ఉన్న సవాళ్లు ♦ సిటీ గ్రూపు మాజీ సీఈవో విక్రమ్ పండిట్ అభిప్రాయం... న్యూఢిల్లీ: టెక్నాలజీలతో బ్యాంకు ఉద్యోగాలకూ ముప్పు పొంచి ఉంది. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా రానున్న ఐదేళ్లలో 30 శాతం బ్యాంకు ఉద్యోగాలు కనుమరుగు కానున్నట్లు సిటీ గ్రూపు మాజీ సీఈవో విక్రమ్ పండిట్ (60) తెలిపారు. సిటీ గ్రూపునకు 2007 నుంచి 2012 వరకు విక్రమ్ పండిట్ సీఈవోగా వ్యవహరించారు. గతేడాది న్యూయార్క్ కేంద్రంగా ఓరెగాన్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేశారు. బుధవారం ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వల్ల బ్యాక్ ఆఫీస్ పనుల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పారు. ఈ టెక్నాలజీల వల్ల పని కూడా సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు. వీటి వల్ల ఉద్యోగాల నష్టం అన్నది సిటీగ్రూపు గతేడాది అంచనా వేసిన స్థాయిలోనే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సిటీ గ్రూపు గతేడాది మార్చిలో రూపొందించిన నివేదికలో... 2015 నుంచి 2025 మధ్య రిటైల్ బ్యాంకింగ్‌లో ఆటోమేషన్ (యాంత్రీకరణ) కారణంగా 30 శాతం ఉద్యోగాలు తగ్గిపోతాయని అంచనా వేసింది. ఒక్క అమెరికాలోనే 7,70,000 పూర్తి స్థాయి ఉద్యోగాలు, యూరోప్‌లో 10 లక్షల ఉద్యోగాలు కనుమరుగవుతాయన్నది సిటీ గ్రూపు అంచనా. బ్యాంకింగ్ రంగం మరింత పోటాపోటీగా మారుతోందని, ప్రత్యేకమైన సేవలు అందించే వారి అవసరంతోపాటు ఈ రంగంలో స్థిరీకరణకు అవకాశం ఉందని పండిట్ పేర్కొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు కొలువులు
న్యూఢిల్లీ: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి దేశవ్యాప్తంగా 1,832 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు తేలిందని కేంద్రం ప్రకటించింది. ఈ వివరాలను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2010లో ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం మొత్తం 1832 మందిలో సుమారు 1200 మంది బ్యాంకులు, బీమా సంస్థల్లో కొలువులు సంపాదించిన వారేనని బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. నకిలీ పత్రాలు లేదా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించిన 1,832 కేసుల్లో 276 మందిపై సస్పెన్షన్ వేటు లేదా తొలగింపు, 521మందిపై కోర్టు కేసులు ఉండగా 1,035మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కుల ధ్రువీకరణ నకిలీ పత్రాలతో 157 మంది ఎస్బీఐలో, 135 మంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, 112 మంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో, 103 మంది సిండికేట్ బ్యాంక్ లోనూ పోస్టింగులు పొందారని చెప్పారు. ఇంకా న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా అష్యూరెన్స్‌లో 41మంది చొప్పున ఉద్యోగాల్లో ఉన్నారని జితేంద్ర సింగ్ వెల్లడించారు. -
కాసులు కురిపిస్తున్న ఉద్యోగాలు
ఉపాధి కల్పనలో ఆ శాఖ తీరే సెప‘రేటు’ - ఫోర్జరీ సంతకాలతో చక్రం తిప్పుతున్న మధ్యస్థాయి ఉద్యోగులు - బ్యాంకు ఉద్యోగాలపేరుతో నిరుద్యోగులకు బురిడీ - మిగులు ఉద్యోగులకు అడ్డగోలు నియామకాలు తప్పు చేస్తే శిక్ష ఉంటుంది...ఇది సహజ న్యాయసూత్రం...కానీ తప్పు చేస్తే రక్షణ ఉంటుంది...ఇది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో విచిత్రం... ఫోర్జరీ సంతకాలతో లేని ఉద్యోగాలు కట్టబెట్టినా...ఏకంగా బ్యాంకు ఉద్యోగాలు ఇస్తానంటూ నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చినా... బేఖాతర్... కార్మిక శాఖలో కీలక నేత అండదండలు ఉంటే చాలు...ఆయన్ను ‘తగినవిధంగా ’ ప్రసన్నం చేసుకుంటే చాలు... జిల్లాలో సరిగ్గా అదే జరుగుతోంది. కుంభకోణాలకు పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్య లేకపోవడమే ఇందుకు నిదర్శనం.! – సాక్షి, అమరావతి బ్యూరో సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారి బ్యాంకు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు. ఉత్తుత్తి ఇంటర్వూలు చేసి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి పంపించారు. నిజమేనని నమ్మి బ్యాంకుకు వెళ్లిన నిరుద్యోగులకు అసలు విషయం తెలిసింది. నిరుద్యోగులతోపాటు బ్యాంకు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఉపాధి కల్పన కార్యాలయంలోని ఆ అధికారిపై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు కూడా చేసి రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలుకు పంపారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. కీలక నేత అభయహస్తం... బ్యాంకు ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆ అధికారిపై కార్మిక శాఖ చర్యలు తీసు కోలేదు. సస్పెన్షన్ కాదుకదా కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆ అధికారికి కార్మిక శాఖలో ఓ కీలక నేత అభయహస్తం అందించారు. దాంతో ఆ అధికారి మళ్లీ యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారికి సమాచారం కూడా ఇవ్వకుండా తన సీటులో కూర్చుంటున్నారు. కానీ ఆయన చేస్తున్న సంతకాలను ఆ ఉన్నతాధికారి రౌండప్ చేయసాగారు. ఈ విషయాన్ని కార్మిక శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎందుకంటే కీలక నేత అండతోనే ఆ అధికారి తన సీటులో కూర్చున్నట్లు గ్రహించారు. దాంతో ఏం చేయాలో పాలుపోక ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ‘మిగులు ఉద్యోగాల’ మాయాజాలం హైదరాబాద్‌లోని ఇరిగేషన్ కార్పొరేషన్‌ను రద్దు చేసి ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు చెల్లించేసి సెటిల్ చేసేశారు. కానీ వారిలో 41మందిని మిగులు ఉద్యోగులుగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నియమించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఓ మధ్యస్థాయి అధికారితోపాటు మరో ఉద్యోగ సంఘ నేత దీనికి సూత్రధారులు. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షలు చొప్పున రూ.80లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారి అనుమతిస్తున్నట్లు ఫోర్జరీ సంతకంతో అధికారిక పత్రం చూపించారు. అనంతరం ఆ మిగులు ఉద్యోగులకు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు కూడా ఇచ్చేశారు. దీనిపై ఎన్సీసీ విభాగానికి సందేహం వచ్చి విచారించడంతో మొత్తం డొంకంతా కదిలింది. కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టి రికార్డులు సీజ్ చేశారు. ఉద్యోగాల కుంభకోణానికి బాధ్యులని భావిస్తున్న ఇద్దరికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దాదాపు ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ... ఉద్యోగాల కుంభకోణంలో పాత్రధారులైన ఇద్దరు అధికారులు జిల్లా ఉన్నతాధికారిని కలిసినట్లు తెలిసింది. ఆయన సంతకమే ఫోర్జరీ చేసి ఉద్యోగాలు ఇచ్చేసినట్లు ప్రధాన ఆరోపణ. తన సంతకం ఫోర్జరీపై ఆయనే తీవ్రంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులకు ఆయన అండగా నిలవడం గమనార్హం. ఆయన కూడా కార్మిక శాఖలోని కీలక నేతను సంప్రదించి ‘అసలు విషయం’ మాట్లాడుకున్నారు. అంతే మిగులు ఉద్యోగుల కుంభకోణం విచారణ ఫైలు అటకెక్కింది. కుంభకోణానికి పాత్రధారులైన వారిలో ఓ అధికారి బదిలీపై రాయలసీమ వెళ్లిపోగా, మరో ఉద్యోగ సంఘాల నేత విజయవాడలోనే దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు. -
21న స్క్రీనింగ్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ బ్యాంకులు నిర్వహించే ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థుల కోసం సాంఘిక సంక్షేమశాఖ ఆ««దl్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని బాలాజీనగర్‌లో ఉన్న శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకోసం దరఖాస్తు చేసుకున్న జిల్లా అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ప్రణాళికతోనే బ్యాంకింగ్‌లో ఉద్యోగావకాశాలు
నెల్లూరు (టౌన్): ప్రణాళిక బద్ధంగా చదివితేనే బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరిరెడ్డి తెలిపారు. స్థానిక కేవీ ఆర్ పెట్రోలు బంక్ సమీపంలోని స్వర్ణవేదిక కల్యాణమండపంలో శుక్రవారం శ్రీసాయి గురురాఘవేంద్ర బ్యాంకిం గ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత బ్యాంకు ఉద్యోగాలపై దృష్టి సారించాలన్నారు. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు సాధించాలంటే సమయపాల, ఏకాగ్రత ముఖ్యమని చెప్పారు. బ్యాంకింగ్ ఉద్యోగాలకు అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు, భావవ్యక్తీకరణను పెం పొందించుకోవాలని సూచించారు. ప్రధానంగా ప్రిపిరేషన్, ఇంట ర్వ్యూలు, ఆన్లైన్ ఎగ్జామ్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. కోచింగ్ సెంటరులో ఆధునిక టెక్నాలజీతో కూడిన విధి విధానాలతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కోచింగ్ సెంటర్ ద్వారా 21వేల మంది ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్, డీవీడీలను పంపిణీ చేశారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ షేక్షావలిరెడ్డి పాల్గొన్నారు. -
క్లరికల్ కొలువుదీరే మార్గాలు
ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి భారీగా కొలువుల భర్తీకి నగారా మోగింది.. ఐదు అనుబంధ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్‌లో మొత్తం 6425 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది.. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌కు తొలి మెట్టు అయిన క్లరికల్ ఉద్యోగాలను చేజిక్కించుకోవాలంటే మెరుగైన మార్కులను ఏవిధంగా సాధించాలి.. ఎటువంటి వ్యూహాలను అనుసరించాలో తెలుసుకుందాం.. జి. రమణ, డైరెక్టర్, సాయి మేధ విద్యా సంస్థలు, హైదరాబాద్ ఖాళీల వివరాలు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 725 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 1200 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ 1300 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 1000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 2200 మెత్తం 6425 ఆంధ్రప్రదేశ్: 282 పోస్టులు (ఎస్బీహెచ్-240 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్-30, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు) తెలంగాణ: 1012 పోస్టులు (ఎస్బీహెచ్-1000 పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్-12 పోస్టులు) ఎంపిక విధానం: రెండు దశలుగా ఎంపిక విధానం ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులు రెండో దశ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఈ రెండు దశల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి. వీటికి రెండు గంటల 15 నిమిషాల్లో (135 నిమిషాలు) సమాధానాలను గుర్తించాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1/4 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వివరాలు.. విభాగం మార్కులు జనరల్ అవేర్నెస్ 40 జనరల్ ఇంగ్లిష్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 రీజనింగ్ ఎబిలిటీ 40 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్ 40 మొత్తం 200 సిద్ధమవ్వండిలా... జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్లతోపాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రముఖులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అదే సమయంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్లు, ప్రైవేట్ బ్యాంకులకు లెసైన్స్‌లు, బ్యాంక్ రేట్లు, వివిధ బ్యాంకుల ముఖ్య అధికారులు సంబంధిత అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం ప్రయోజనకరం. ముఖ్యంగా గత 6-8 నెలల కాలంలో చోటుచేసుకున్న సంఘటనలపై ప్రధానంగా దృష్టి సారించాలి. చదవడం కంటే గ్రూప్ డిస్కషన్ వంటి పద్ధతుల ద్వారా ఈ విభాగాన్ని మెరుగ్గా ప్రిపేర్ కావచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: పరీక్షలో ఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, డేటా అనాలసిస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో మంచి స్కోర్ సాధించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వంటి ప్రక్రియల్లో పట్టు సాధించాలి. ఈ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావ చ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అర్థమెటిక్ ఎబిలిటీలో దూరం, నిష్పత్తి, సరాసరి, వయసు వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలను త్వరగా సులువుగా సాధించాలంటే షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. తద్వారా స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. డేటా అనాలిసిస్లో బార్స్, వెన్‌డయాగ్రమ్స్, చార్ట్స్, టేబుల్స్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటికోసం సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఎబిలిటీ: ఈ విభాగంలో అభ్యర్థులు కొంత అప్రమత్తతతో ఉండాలి. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలు ఒక్కోసారి గందరగోళానికి గురి చేయవచ్చు. కాబట్టి సమాధానం ఇచ్చే ముందు ప్రశ్నను పూర్తిగా చదవడం మంచిది. ఈ విభాగం తార్కిక సామర్థ్యాన్ని, సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది. మిగిలిన విభాగాలతో పోలిస్తే రీజనింగ్ లో సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో మెరుగైన స్కోర్‌ను సాధించాలంటే పజిల్స్, అనాలజీస్ను ఇన్పుట్- అవుట్‌పుట్, కోడింగ్-డికోడింగ్, లాజికల్ రీజనింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, డెరైక్షన్స్ తదితర అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ ఇంగ్లిష్: ఇందులో కాంప్రెహెన్షన్, వొకాబ్యులరీ, గ్రామర్, క్లోజ్ టెస్ట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులోని ప్రశ్నల క్లిష్టత ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో దాదాపు 20 మార్కులు సాధించి ముందుగా కటాఫ్ నుంచి పైకి వెళ్లొచ్చు. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. మిగిలిన అంశాల్లో జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివి ఉంటాయి. వీటితో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి. రోజుకు 10-15 వరకు యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ఈ విభాగంలో గ్రామర్ అంశం నుంచి 1/3 వంతు ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ విభాగంలో 25 మార్కులకు తగ్గకుండా స్కోర్ చేసే విధంగా సిద్ధం కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్: ఇందులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, కంప్యూటర్ ఉపయోగాలు, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, పీసీ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంప్యూటర్ నెట్వర్క్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపర్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశముంటుంది. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారించాలి. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం అధిక శాతం అభ్యర్థులకు కొత్తగా ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్లో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా డివిజన్ ఆఫ్ మార్కెటింగ్, సెల్లింగ్, మార్కెటింగ్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, కస్టమర్ వాల్యూ, స్టాఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్, బ్రాండింగ్- కోబ్రాండింగ్, ట్యాగ్‌లైన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్ సీఎంఆర్ కాన్సెప్ట్, 7పీస్ ఆఫ్ మార్కెటింగ్ ((7 P's of Marketing)తదితరాలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. వేతనం-విధులు: క్లరికల్ ఉద్యోగులు ఫ్రంట్ ఆఫీస్ విధులు నిర్వహిస్తారు. బ్యాంకుల్లో ప్రతి పనీ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ద్వారా జరుగుతుంది. అదే విధంగా మేకర్- చెకర్ విధానాన్ని పాటిస్తారు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు మేకర్ పని చేస్తారు. వేతనం పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. ప్రస్తతం క్లరికల్ కేడర్ బేసిక్ పే రూ. 7,200. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్స్ అదనం. అంటే ఏ ప్రాంతంలో ఉద్యోగంలో చేరినా నెలకు రూ. 20,000 వరకు వేతనం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు. తర్వాత శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమానం (డిసెంబర్ 1, 2014 నాటికి) వయసు: 20-28 ఏళ్లు (డిసెంబర్ 1, 2014 నాటికి). ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2014 ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ. 100) ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 9, 2014 ఆఫ్లెన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2014 రాత పరీక్ష: జనవరి/ఫిబ్రవరి, 2015 (స్పష్టమైన తేదీలు ప్రకటించలేదు). రాత పరీక్ష కేంద్రాలు: తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. వెబ్సైట్: www.sbi.co.in సూచనలు ఐబీపీఎస్ గత పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలను ప్రతి రోజూ ప్రిపేర్ కావాలి. అంతేకాకుండా వీటిని సమయ పరిమితి విధించుకుని సాధన చేయాలి. స్వల్ప కాలంలో ఎక్కువ ప్రశ్నలకు కచ్చితత్వంతో సమాధానం గుర్తించగలగాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం. కటాఫ్ తప్పనిసరి మరో కీలకాంశం.. కటాఫ్ మార్కులు. ప్రతి విభాగంలోనూ బ్యాంకు నిర్దేశించిన కటాఫ్ మార్కులను సాధించాలి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ఆయా విభాగాల్లో సాధించిన మార్కులాధారంగా.. కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఖాళీలు, అభ్యర్థులు చూపిన ప్రతిభ.. ఈ రెండు అంశాలతో కటాఫ్ మార్కులతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలో పోస్టులు ఎక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు తక్కువగా ఉండొచ్చు. పోస్టులు తక్కువగా ఉంటే కటాఫ్ మార్కులు పెరగొచ్చు. అంతేకాకుండా ప్రశ్నపత్రం సులువుగా ఉంటే కటాఫ్ మార్కులు పెరుగుతాయి. కఠినంగా ఉంటే కటాఫ్ మార్కులు తగ్గుతాయి. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని విభాగాలకు సమప్రాధాన్యతనివ్వాలి. ప్రతి విభాగంలోనూ 50 శాతం మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్వ్యూ ప్రతి కేటగిరీ నుంచి ఖాళీల ఆధారంగా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో కూడా బ్యాంకు నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి. ఈ మార్కుల విషయంలో రిజర్వ్డ్ అభ్యర్థులకు 5 శాతం సడలింపునిస్తారు. అంతేకాకుండా స్థానిక భాషలో ఉన్న ప్రావీణ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి 10 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూ సాధారణంగా 10-25 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రధానంగా రెజ్యూమె ఆధారంగా అభ్యర్థి వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు వేస్తారు. అంటే కుటుంబ నేపథ్యం, స్వస్థలం, చదువు, అభిరుచులు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవడానికి కారణాలు, తదితరాలు. అంతేకాకుండా సమకాలీన అంశాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగం, క్రీడారంగం ఇలా ఏ రంగం నుంచైనా ప్రశ్నలు అడగొచ్చు. ప్రత్యేకించి ఎస్బీఐ-అనుబంధ బ్యాంకుల విధాన నిర్ణయాలు, పథకాలు సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర ప్రాక్టీస్ తప్పనిసరి. ఆన్లైన్ విధానంపై అవగాహన ఏర్పడేందుకు వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. అప్పుడే టైం మేనేజ్మెంట్పై పట్టు సాధించొచ్చు. అంతేకాకుండా కచ్చితత్వంతో కూడిన వేగం ప్రధానం. ఏ విభాగాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఇతర పరీక్షల్లో మాదిరి బ్యాంక్ పరీక్షల్లో ఓవరాల్ కటాఫ్ కాకుండా ప్రతి విభాగంలోనూ కటాఫ్ ఉంటుంది. కాబట్టి అన్ని విభాగాల్లో మంచి స్కోరు సాధించాలి. దినపత్రికలను రెగ్యులర్‌గా చదవడం వల్ల కరెంట్స్ అఫైర్స్ విభాగంలో మంచి మార్కులు సాధించొచ్చు. - ఆరేటి కేశవయ్య, క్లరికల్ విజేత, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (2013) -
బ్యాంకింగ్ ఉద్యోగమే లక్ష్యం
బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం శిక్షణ డిగ్రీ అర్హతతో చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం ఏటా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉద్యోగాల కోసం కళాశాలల నుంచి పోటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా ఉద్యోగాల సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అయితే ఒక్క బ్యాంకింగ్ రంగంలో మాత్రమే పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. పలు బ్యాంకులు తమ శాఖలను విస్తరించడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. దీంతో యువత ఆ ఉద్యోగాల సాధన కోసం శిక్షణ పొందుతోంది. గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లల్లో నిరంతర సాధన చేస్తూ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. మచిలీపట్నం (ఈడేపల్లి) : బ్యాంకు ఉద్యోగాలంటే గతంలో నిరుద్యోగులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కారణం ఉద్యోగాలపై అవగాహన లేమి, ఇతర ప్రభుత్వ శాఖలతో పోలిస్తే బ్యాంకింగ్ రంగంలో ఖాళీలు తక్కువ ఉండడమే. ఇటీవల కాలంలో బ్యాం కుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్టు సిబ్బంది, నిపుణులైన యువత కావాలి. ఖాళీలు, వేతనాలు ఎక్కువగా ఉండడంతో నిరుద్యోగులతో పాటు చిరుద్యోగులు కూడా ఈ కొలువులకు సై అంటున్నారు. బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సహా ఇతర అన్ని ప్రభుత్వరంగ సంస్థల బ్యాంకులు ఉద్యోగాల భర్తీకోసం అధిక సంఖ్యలో ప్రకటనలు వెలువరిస్తున్నాయి. నవంబర్ నెలాఖరు వరకు ప్రొబేషనరీ ఆఫీసర్స్(పీవో) పరీక్షలు ఉన్నాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పరీక్షల్లో వేల సంఖ్యలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. బ్యాంకు ఉద్యోగాలకు డిగ్రీలో 60శాతం మార్కుల వచ్చిన వారే అర్హులు. ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంకు, అనుబంధ సంస్థలు ఒకే విధమైన పరీక్షలు నిర్వహిస్తే, మరో 19 రకాల బ్యాం కులకు అవసరమయ్యేలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్(ఐబీపీఎస్) బ్యాంకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రశ్న పత్రాలు ఇలా... ఎస్బీఐ పరీక్షలో వివిధ విభాగాలుగా 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఏ విభాగంలో తక్కువ మార్కులు వచ్చినా పరీక్షలో ఉత్తీర్ణులు కానట్టే. జనరల్ నాలెడ్జ్‌లో సమకాలీన అంశాలతో పాటు అన్నిరంగాల్లో పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిషులో గ్రామర్‌పై అవగాహన ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్‌లో బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, డేటా ఎడిటింగ్, విండోస్, లాంగ్వేజెస్ తెలిసి ఉంటే చాలు. బిజినెస్ పత్రికలు, బిజినెస్ చానళ్లు వీక్షించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసుకుంటే షేర్ మార్కెట్లపై పట్టు వస్తుంది. ప్రణాళిక ప్రకారం చదివితే పరీక్ష ఎంత కఠినంగా ఉన్నా విజయం సాధించడం తేలికేనని ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)గా నియమితులైన సమీర్ పేర్కొన్నారు. నిరంతర సాధనే విజయానికి సోపానం నిరంతర సాధనతో బ్యాంకింగ్ పరీక్షల్లో విజయం సాధించడం సులువేనని మచిలీపట్నానికి చెందిన కోచింగ్‌సెంటర్ నిర్వాహకుడు ఎం.ఎస్.నాయుడు పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన సూచనలు ఇవీ.. ప్రశ్నలకు జాగ్రత్తగా, నేర్పుతో, సమయం వృథా చేయకుండా ఆలోచించి సమాధానం ఇవ్వాలి. తెలియని వాటిని వదిలేయడం మేలు. రీజ నింగ్‌లో 30 మార్కుల వరకు డెషిషన్ మేకింగ్‌పై ప్రశ్నలు వస్తాయి. ఐబీపీఎస్ పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రశ్నలు అడుగుతుంటారు.నమూనా ఆన్లైన్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవ్వాలి. ఆన్లైన్ పరీక్షలు ప్రాక్టీసు చేయాలి. పట్టుదలతో చదివితే గెలుపు సాధ్యం. ప్రతి బిట్టూ ఉద్యోగ సాధనలో కీలకం అనే విషయం మర్చిపోకూడదు. రీజనింగ్‌పై ఎక్కువ పట్టు సాధించాలి. ఉజ్జ్వల భవిష్యత్తుకు మార్గం బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఎటువంటి అవకతవకలు ఉండవు. ఇవి పూర్తిగా అభ్యర్థి సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. క్లర్క్ ఉద్యోగంతో బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టిన వారు కూడా చైర్మన్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఉజ్జ్వల భవిష్యత్తుకు బ్యాంకు ఉద్యోగాలు మంచి మార్గం. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యువత సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా పొందుతారు. -పి.వి.శేఖర్, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఏజీఎం పోస్టల్ ఉద్యోగిగా పనిచేస్తూనే పోస్టల్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నా. డిగ్రీతో బ్యాంకింగ్ రంగంలో ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలుసుకున్నా. దీంతో రెండేళ్లుగా ఉద్యోగాల కోసం సాధన చేస్తున్నా. పోస్టాఫీస్ నుంచి ఇంటికి రాగానే రోజూ నాలుగు గంటలకు తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా సిలబస్‌ను అధ్యయనం చేస్తున్నా. ఇప్పటి వరకు పదికి పైగా బ్యాంకింగ్ పరీక్షలు రాశా. ఇంటర్వ్యూలో మిస్ అవుతూ వచ్చాను. ఈ సారి తప్పక విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. - కె.వెంకటే శ్వరరావు, పిట్టల్లంక(కోడూరు) బ్యాంకింగ్‌లో ఎన్నో అవ కాశాలు బీటెక్ పూర్తిచేశా. సాఫ్ట్వేర్ రంగం కంటే బ్యాంకింగ్‌లోనే యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని గ్రహించా. ఆరు నెలల నుంచి కోచింగ్ సెంటర్లో సాధన చేస్తున్నా. రోజూ కోచింగ్‌లో నేర్చుకున్న అంశాలను రెండు గంటల పాటు పునఃశ్చరణ చేస్తూ వస్తున్నా. ప్రణాళికతో అధ్యయనం చేస్తే ఉద్యోగం పొందండం అంత కష్టమేమీ కాదు. సిలబస్‌ను పూర్తిగా అధ్యయనం చేయడం ముఖ్యం. - ఎస్.దివ్య, బీటెక్