SBI PO Recruitment 2021: Notification for 2056 Vacancies - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో భారీగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ జాబ్స్‌

Published Tue, Oct 5 2021 11:48 AM | Last Updated on Tue, Oct 5 2021 12:40 PM

SBI PO Recruitment 2021: Check Exam Date For 2056 Posts Here - Sakshi

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

► పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో)

► మొత్తం పోస్టుల సంఖ్య: 2056(రెగ్యులర్‌ పోస్టులు–2000, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 56).

► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

► వయసు: 01.04.2021 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

► ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.10.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021


► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌/డిసెంబర్‌ 2021

► వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement