Applying for a bank job? candidates need to have a healthy CIBIL score - Sakshi
Sakshi News home page

మంచి స్కోర్‌ ఉంటేనే బ్యాంక్‌ జాబ్‌! స్కోర్‌ అంటే ఎగ్జామ్‌లో కాదు..

Published Wed, Jul 5 2023 9:07 PM | Last Updated on Thu, Jul 6 2023 10:45 AM

Applying for a bank job candidates need to have healthy CIBIL score - Sakshi

మంచి స్కోర్‌ ఉంటేనే బ్యాంక్‌ జాబ్‌కు అర్హత సాధించగలరు. స్కోర్‌ అంటే ఎగ్జామ్‌లో వచ్చే స్కోర్‌ కాదు.  ఎస్‌బీఐ మినహా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ నిర్వహించే ఉమ్మడి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అభ్యర్థులకు కొత్త నిబంధన విధించింది. దీని ప్రకారం అభ్యర్థులు ఆరోగ్యకరమైన సిబిల్‌ స్కోర్‌ కలిగి ఉండాలి. 

ఐబీపీఎస్‌ ఇటీవల విడుదల చేసిన భారీ క్లరికల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని, ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు కనీసం 650 సిబిల్ స్కోర్ కలిగి ఉండాలని పేర్కొంది. అయితే బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు తమ సిబిల్‌ స్టేటస్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ది హిందూ పత్రిక నివేదించింది. 

ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే నాటికి సిబిల్‌ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేయించుకోవాలి లేదా ప్రతికూలంగా ప్రతిబింబించే అకౌంట్లకు సంబంధించి ఎటువంటి బాకీ లేదని బ్యాంకు, రుణదాత నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని నోటిఫికేషన్‌ స్పష్టం చేస్తోంది. సిబిల్ విఫలమైతే, అర్హత ప్రమాణాల మేరకు ఆఫర్ లెటర్‌ను ఉపసంహరిస్తామని, లేదా రద్దు చేస్తామని ఐబీపీఎస్‌ పేర్కొంది.

 

సిబిల్‌ స్కోర్‌ అంటే.. 
సిబిల్ నివేదిక అనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వివరాలకు సంబంధించిన ఆర్థిక నివేదిక. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ అనేది వారి క్రెడిట్ హిస్టరీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా లెక్కిస్తారు.

సిబిల్‌తోపాటు ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్,  సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌ వంటివి భారతదేశంలో క్రెడిట్ స్కోర్‌లను గణించే క్రెడిట్ బ్యూరోలు. సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మీ క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. సిబిల్ నివేదికలో ఉన్న క్రెడిట్ హిస్టరీ ఆధారంగా సిబిల్ స్కోర్ రూపొందిస్తారు. హోమ్ లోన్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, పర్సనల్ లోన్‌లు, ఆటోమొబైల్ లోన్‌లు, ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీస్‌తో పాటు ఇతర రుణాలు, వాటి చెల్లింపు చరిత్ర వంటి అన్ని వివరాలు ఈ క్రెడిట్‌ ప్రొఫైల్‌లో ఉంటాయి. 

కాగా ఐబీపీఎస్‌ ఈ సంవత్సరం 4,045  క్లరికల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్‌​ ఇచ్చింది.  తర్వాత మళ్లీ 500 పోస్టులను అదనంగా చేర్చింది. అంటే మొత్తం 4,545 ఖాళీలకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూలై 21న ముగియనుంది. 

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీలో చేరినప్పుడు దీపక్‌ పరేఖ్‌ జీతం.. ఆన్‌లైన్‌లో 1978 నాటి ఆఫర్‌ లెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement