‘వికాస్‌పీడియా’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం
తెలుగుతో సహా ఐదు భాషల్లో అందుబాటులోకి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల ద్వారా అందే సేవలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి సామాజికాభివృద్ధి రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇక తెలుగులో కూడా తెలుసుకోవచ్చు. స్థానిక అధికార భాషల్లోనే ఆన్‌లైన్‌లో సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు విజ్ఞానాన్ని, సేవలను పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘వికాస్‌పీడియా.ఇన్ (ఠిజీజ్చుటఞ్ఛఛీజ్చీ.జీ)అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సమాచారాన్ని ప్రజాస్వామ్యీకరించడంలో భాగంగా ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు భారత ప్రభుత్వరంగ సంస్థ ‘ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక శాఖ (డైటీ)’ కార్యదర్శి జె.సత్యనారాయణ వెల్లడించారు. డైటీ ఆధ్వర్యంలోని ఈ పోర్టల్‌ను హైదరాబాద్‌లోని ‘ప్రగతి సంగణన వికాస కేంద్రం (సీ-డాక్)’ నిర్వహిస్తోందనిచెప్పారు. ఇంతకుముందు కొన్నిరకాల సమాచారాన్ని పొందేందుకు డబ్బు చెల్లించాల్సి వచ్చేదని, ఈ పోర్టల్ ద్వారా ఉచితంగానే సమాచారాన్ని పొందవచ్చన్నారు.
పోర్టల్‌లో ఉండే సమాచారం...
{పస్తుతం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, విద్యుత్, ఈ-గవర్నెన్స్ విభాగాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ-డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, పెన్షన్లు, తదితర అంశాల గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. మిగతా రంగాల సమాచారాన్ని కూడా తర్వాతి దశల్లో చేరుస్తారు.
తొలిదశగా ప్రస్తుతం తెలుగు, హిందీ, ఆంగ్లం, మరాఠీ, అస్సామీ భాషల్లోనే ఈ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. దశలవారీగా 22 అధికారిక భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారు.
ఏడు ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టుల్లో భాగంగా.. సమాచారాన్ని వివిధ భాషల్లోకి మార్చేందుకు ఉపయోగపడే టూల్స్‌ను, మొబైల్ అప్లికేషన్లను రూపొం దించిన వారికి బహుమతులూ అందజేశారు.
ఇక స్థానిక భాషల్లోనే సమాచారం
Published Wed, Feb 19 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement