యూజర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల కోసం మల్టీ లాంగ్వేజ్ పేరుతో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఇతర భాషల వీడియోలను తమకు నచ్చిన భాషలో (ఆడియోలో) చూడొచ్చు.
తొలిసారి ఈ తరహా టెక్నాలజీని నెట్‌ఫ్లిక్స్ వీక్షకులకు పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకున్న కొరియన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్క్విడ్ గేమ్‌ను వీక్షకులకు అర్ధమయ్యేలా సబ్‌టైటిల్స్ పాటు, స్థానిక భాషల్లో డబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పుడు యూట్యూబ్ సైతం అదే తరహాలో ఇతర లాంగ్వేజ్ వీడియోలను యూజర్లకు నచ్చిన భాషలో చూడొచ్చు.
అంటే..యూట్యూబ్‌లో మనం కొన్ని వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. భాష అర్ధం గాక పోవచ్చు.. కానీ భావం తెలుస్తుంది. అయితే యూట్యూబ్ అందించే కొత్త ఫీచర్ సాయంతో బాహుబలిలో కాలకేయ కిలికి వంటి భాషల నుంచి ఇతర దేశాల్లోని స్థానిక భాషల వరకు.. మనకు అర్ధమయ్యే భాషలో డబ్ చేసుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్‌లో ఉన్న ఆడియో ట్రాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో నచ్చిన భాషను సెలక్ట్ చేస్తే ఆ భాషలో ఆడియో వినిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment