హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ సంస్థ యప్‌టీవీ కొత్తగా వీడియో స్ట్రీమింగ్ అవసరాలకు ఉపయోగపడే వీడియోగ్రాఫ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఆన్ డిమాండ్, లైవ్ స్ట్రీమింగ్ మొదలైన వాటికి కావాల్సిన ప్లగ్ అండ్ ప్లే ఏపీఐలు ఇందులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ రెడ్డి తెలిపారు.
వేగవంతమైన వీడియో ఎన్‌కోడింగ్‌కు, వీడియో ఎడిటింగ్, లైవ్ వీడియో క్లిప్పింగ్‌లాంటి వాటికి ఇది అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. యూజర్లు, కంటెంట్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వినూత్న ఫీచర్లతో ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇప్పటికే ట్యూరి టో, హీరోగో తదితర సంస్థలు వీడియోగ్రాఫ్‌ను వినియోగిస్తున్నట్లు ఉదయ్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment