YuppTV
-
యప్‌టీవీ నుంచి వీడియోగ్రాఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓటీటీ సంస్థ యప్‌టీవీ కొత్తగా వీడియో స్ట్రీమింగ్ అవసరాలకు ఉపయోగపడే వీడియోగ్రాఫ్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఆన్ డిమాండ్, లైవ్ స్ట్రీమింగ్ మొదలైన వాటికి కావాల్సిన ప్లగ్ అండ్ ప్లే ఏపీఐలు ఇందులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ రెడ్డి తెలిపారు. వేగవంతమైన వీడియో ఎన్కోడింగ్కు, వీడియో ఎడిటింగ్, లైవ్ వీడియో క్లిప్పింగ్లాంటి వాటికి ఇది అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. యూజర్లు, కంటెంట్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వినూత్న ఫీచర్లతో ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. ఇప్పటికే ట్యూరి టో, హీరోగో తదితర సంస్థలు వీడియోగ్రాఫ్ను వినియోగిస్తున్నట్లు ఉదయ్ రెడ్డి చెప్పారు. -
ఐపీఎల్-2022 బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న యప్ టీవీ
టాటా ఐపీఎల్-2022 బ్రాడ్ కాస్టింగ్ హక్కులను వరుసగా యప్ టీవీ ఐదో సారి గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా యప్ టీవీ సబ్స్రైబర్లకు టాటా ఐపీఎల్-2022 స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. ఐపీఎల్-15 ఎడిషన్‌ను దాదాపు 99 దేశాల్లో యప్ టీవీ ప్రసారం చేయనుంది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్-15 ఎడిషన్‌ను చూడవచ్చును. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, ఆగ్నేయాసియా (సింగపూర్ మినహా), మలేషియా, మధ్య & దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, శ్రీలంక, పాకిస్తాన్, జపాన్, నేపాల్, భూటాన్, మాల్దీవులుతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్-2022ను యప్‌టీవీ ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా యప్ టీవి వ్యవస్థాపకుడు అండ్ సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. “క్రికెట్ ఎల్లప్పుడూ భారీ క్రౌడ్-పుల్లర్‌గా ఉంటుంది. క్రికెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో...ప్రపంచవ్యాప్తంగా 99 దేశాలకు విస్తరించడంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంగా యప్ టీవీ నిలుస్తోన్నందుకు మేము సంతోషిస్తున్నాము. అంతర్జాతీయ లీగ్‌లకు సంబంధించి భారత్‌ను ప్రపంచ పటంలో ఉంచేందకు కృషి చేస్తాము. ప్రపంచ స్థాయి కంటెంట్‌తో గ్లోబల్ ఇండియన్ డయాస్పోరా సేవలను కొనసాగిస్తున్న యప్ టీవీతో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు. టాటా ఐపీఎల్-15 ఎడిషన్ ప్రజలకు అద్బుతమైన అనుభవాన్ని అందిస్తోందని డిస్నీ స్టార్ అక్విజిషన్ అండ్ సిండికేషన్-స్పోర్ట్స్ హెడ్ హ్యారీ గ్రిఫిత్ పేర్కొన్నారు. ఇక యప్ టీవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ, ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలుస్తోంది. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్ చేసిన ఇంటెల్..! ధర ఏంతంటే..? -
ఆహా కంటెంట్ ఇప్పుడు దీనిలో కూడా..!
హైదరాబాద్: వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ (ఓటీటీ) సేవల్లోని ‘ఆహా’తో యుప్ టీవీ స్కోప్ జతకట్టింది. తన ప్లాట్‌ఫామ్‌పై తెలుగు షోలను, సినిమాలను అందించనుంది. ‘‘ఆహాకు చెందిన అన్ని రకాల వీడియో కంటెంట్‌ను యుప్‌టీవీ స్కోప్ వినియోగదారులు పొందొచ్చు. యూజర్లకు నాణ్యమైన కంటెంట్‌ను ఇవ్వాలన్న మా లక్ష్యంలో భాగమే ఆహాతో భాగస్వామ్యం’’ అని యుప్‌టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇక పూర్తిగా -
యప్‌టీవీ స్మార్ట్ టీవీ ఆఫర్ విజేతలు వీరే..
హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం యప్‌టీవీ ఇటీవల ప్రవేశపెట్టిన స్మార్ట్ టీవీ (55 ఇంచెస్) ఆఫర్ విజేతలను ప్రకటించింది. తమ వార్షిక ప్యాకేజ్‌లను కొనుగోలు చేసిన వారిలో లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి జూన్ తొలివారం విజేతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని భారతీయులకు 12కి పైగా భాషల్లో భారత టీవీ ఛానెల్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గత పదేళ్లుగా ఈ సేవలను అందిస్తున్న యప్‌టీవీ దక్షిణాసియాలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ఒకటిగా నిలిచింది. యప్ టీవీపై వీక్షకులు ప్రస్తుతం హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ సహా ఇతర భారతీయ భాషల్లో వినోదాన్ని కేవలం కొద్ది డాలర్లు వెచ్చించి ఆస్వాదించవచ్చని సంస్థ పేర్కొంది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో రెండు నెలల పాటు తమిళ, మళయాళం వంటి కొన్ని భాషల్లో తాజా కంటెంట్ కొరవడిన క్రమంలో ప్రస్తుతంతాజా కంటెంట్ అందుబాటులోకి రాగా, తెలుగు, బెంగాలీ, హిందీ చానెల్స్ త్వరలోనే అన్ని షోలు, కార్యక్రమాలకు సంబంధించిన తాజా కంటెంట్‌తో ముందుకు రానున్నాయి. ఇక స్మార్ట్ టీవీ ఆఫర్లో విజేతల వివరాలు చూస్తే..అమెరికా నుంచి పట్టాభిరాజు ముండ్రు (పెన్సిల్వేనియా), శ్రావ్య గొట్టిపాటి (కాలిఫోర్నియా), ఎల్ సుబ్రమణియన్ (వర్జీనియా), రమేష్ టిమకొందు (కనెక్టికట్), ఆర్ముగం పళనిస్వామి (మిచిగాన్), బ్రిటన్ నుంచి హనుమంతరావు విడదల (లాంక్షైర్), యూరప్ ప్రాంతం నుంచి కిషోర్ రావూరి (స్విట్జర్లాండ్), సమంతా కర్బందా (సింగపూర్), ఆస్ట్రేలియా నుంచి సునీల్ కుమార్ నూతి (న్యూ సౌత్‌వేల్స్) ఎంపికై స్మార్ట్ టీవీలను గెలుచుకున్నారని యప్‌టీవీ వెల్లడించింది. చదవండి : ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ.. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్!
సాక్షి, ఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించక ముందే పలు రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించి, పరీక్షలను వాయిదా వేశాయి. తరువాత కరోనా విజృంభణ మరింత ఉధృతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడు వారాల పాటు ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించారు. దీంతో సీబీయస్‌ఈతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదవ తరగతి మినహా మిగిలిన విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇక కరోనా కేసులు నానాటికి పెరిగిపోవడంతో ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తారో లేదో అనే సందిగ్థల నెలకొంది. తెలంగాణతో పాటు కొన్ని రాష్టరాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని లేకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని కేంద్రానికి సూచిస్తున్నాయి. (లాక్ డౌన్ పొడిగింపుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు) ఈ నేపథ్యంలోనే ఐఐటీ/జే ఈ ఈ, నీట్ విద్యార్థులకు యప్ టీవీ ఉచిత ఆన్ లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమ అధ్యాపకులు, ప్రపంచ స్థాయి స్ట్రీమింగ్ టెక్నాలజీ , లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావడానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్సులను డిజైన్ చేశారు. యప్ మాస్టర్ ద్వారా ప్రతిరోజూ ఆరు గంటల లైవ్ క్లాసులు, ఇంటరాక్షన్ కు అవకాశం లభిస్తుందని యప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు www.yuppmaster.comకు లాగిన్ అయి ఉచితంగా పాఠాలు వినొచ్చు అన్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 14,32,577 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 82,195 మంది చనిపోయారు. భారత్ విషయానికి వస్తే 5,194 కరోనా కేసులు నమోదు కాగా, 149 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కరోనా భారిన పడి ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. -
ట్రిపుల్‌ప్లే సేవలు: బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ జోడీ..
సాక్షి, న్యూఢిల్లీ : గ్రామీణ ప్రజలకు, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్ లీడర్ యప్ టీవీ బీఎస్ఎన్ఎల్తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్ జోన్లో సేవలు మొదలవనున్నాయి. ఈనెల 22న ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో టెమా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామంలో భారత్ ఎయిర్‌ఫైబర్ సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. భారత్ ఎయిర్‌ఫైబర్ బిజినెస్ మోడల్ గురించి బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (సీఎఫ్ఏ) వివేక్ బంజల్ వివరిస్తూ గ్రామీణ ప్రాంత గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే క్రమంలో ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని చెప్పారు. గ్రామీణ గృహాలకు రేడియో ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిచేందుకు గ్రామస్ధాయి వాణిజ్యవేత్తలు బీఎస్ఎన్ఎల్తో చేతులు కలిపే విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. యప్ టీవీ వ్యవస్ధాపక సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తదుపరి డిజిటలీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును బీఎస్ఎన్ఎల్తో కలిసి తాము చేపట్టడం సంతోషకరమని అన్నారు. గ్రామీణ భారతానికి హైస్పీడ్ ఇంటర్నెట్ను బీఎస్ఎన్ఎల్ చేరువ చేస్తే తాము తమ యూజర్లకు వినోదభరితంగా వారిని చైతన్యపరిచేలా వైవిధ్యమైన కంటెంట్‌ను అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సౌత్ జోన్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియకు అద్భుత స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కాగా బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లకు కంటెంట్‌ను అందించేలా గత ఏడాది బీఎస్ఎన్ఎల్తో యప్ టీవీ ఓ అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన క్రమంలో తదనుగుణంగా ఎంపిక చేసిన సర్కిళ్లలో ట్రిపుల్ ప్లే సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. చదవండి : అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్ చదవండి : యప్ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్ రైట్స్ -
యప్ టీవీకి బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ హక్కులు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం యప్‌టీవీ బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని యప్‌టీవీ యూజర్లు తమ ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్‌లను ఈ ఫ్లాట్‌ఫాంపై వీక్షించే వెసులుబాటు కలిగింది. బీసీసీఐ హోం సీజన్లో శ్రీలంక, ఆస్ర్టేలియా, సౌత్ఆఫ్రికా, ఇండియాలు తలపడే మ్యాచ్‌లను క్రీడాభిమానులు లైవ్‌లో చూసే అవకాశం యప్‌టీవీ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూరప్, మధ్య ఆసియా, సార్క్ దేశాలకు చెందిన యూజర్ల చెంతకు ఈ ఆసక్తికర స్పోర్టింగ్ ఈవెంట్‌ను యప్‌టీవీ చేరవేస్తోంది. ఈ స్పోర్ట్స్ ఈవెంట్‌ను తమ యూజర్లు లైవ్‌లో యాక్సెస్ చేసుకునేందుకు తాము బీసీసీఐ హోం సీజన్ డిజిటల్ హక్కులను కైవసం చేసుకున్నామని యప్‌టీవీ వ్యవస్ధాపక సీఈఓ ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు యప్టీవీలో వీక్షించవచ్చు. యప్‌టీవీ.కాంను లాగ్ అవడం లేదా స్మార్ట్‌టీవీల్లో యప్‌టీవీ యాప్‌ల ద్వారా వివిధ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డివైజ్‌ల్లో ఆయా మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చని యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆసియాకప్ డిజిటల్ హక్కులు యప్ టీవీ సొంతం
దుబాయ్ : ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. ఆసియాకప్-2018 టోర్నీ ప్రత్యేక డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు యూరప్‌లోని అన్నిదేశాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లను యప్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్, భారత్, శ్రీలంక, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్‌ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీ సెప్టెంబర్ 28న ముగుస్తోంది. -
వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లు యప్టీవీలో..
ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. అమెరికా, కెనడా, కరీబియన్ దీవుల్లోని క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. ఈ మేరకు ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌లను యప్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ఫ్లోరిడా వేదికగా ఆగస్ట్ 27, 28 తేదీలలో ఇండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. యప్‌టీవీ గతంలోనూ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. -
'ఏసీటీ'తో యప్‌టీవీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే ప్రముఖ ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్రొవైడర్ యప్‌టీవీ.. భారత దేశపు నాల్గవ అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ(అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏసీటీ సేవలను వినియోగించుకుంటున్న వారు యాడ్ ఆన్ ప్యాకేజీ కింద కేవలం నెలకు రూ 99 చెల్లించి యప్టీవీలో అందుబాటులో ఉండే 200లకు పైగా లైవ్ టీవీ చానల్స్, రెండు వేలకు పైగా సినిమాలు, షార్ట్ ఫిల్మ్‌లు, టీవీ షోలు లాంటి విభిన్న కార్యక్రమాలను వీక్షించే అవకాశం హైదరాబాద్ వాసులకు కలుగుతోంది. హైదరాబాద్‌లో ఏసీటీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకునే వారికి మనోరంజకమైన యప్‌టీవీ కార్యక్రమాలు ఈ ఒప్పందం ద్వారా తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా యప్‌టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. స్ట్రీమింగ్ వీడియోలు వీక్షించడానికి హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ కావాలని.. ఏసీటీతో ఒప్పందం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సర్వీస్ అందుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలు తమ ఈ కార్యక్రమాన్ని సాదరంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఆన్ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్
ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ తాజాగా ఆన్ డిమాండ్ సినిమాల కోసం 'యప్ ఫ్లిక్స్'ను ప్రారంభించింది. ఇందులో 12 భారతీయ భాషల్లోని 5వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్, డ్రామా, భక్తి.. ఇలా అన్నిరకాల సినిమాలను తాము వినియోగదారులకు అందించనున్నట్లు యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం ఈ సేవలు అందిస్తున్నామన్నారు. తాజా హిట్ సినిమాలు అన్నింటినీ యప్ ఫ్లిక్స్ ద్వారా యూజర్లు చూసుకోవచ్చని ఆయన అన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ప్రాంతీయభాషల్లోని సినిమాలు చట్టబద్ధంగా చూసే అవకాశం తక్కువగా ఉంటుందని, ఇప్పటికే యప్ టీవీ ద్వారా వివిధ రకాల సేవలు అందిస్తున్న తాము.. తాజాగా యప్ ఫ్లిక్స్‌తో ఆన్ డిమాండ్ డిజిటల్ సినిమాలను కూడా అందిస్తామని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాళం, పంజాబీ, బెంగాలీ... ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాలు హై క్వాలిటీ డిజిటల్ కాపీలు అందుబాటులో ఉంటాయని ఉదయ్ రెడ్డి వివరించారు. -
షార్ట్ ఫిల్మ్స్‌కు ఆహ్వానం
మంచి క్రియేటర్‌గా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైన ఆలోచనలు ఆచరణలో పెట్టి ఆకట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు ఆ అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది యప్ టీవీ. వివిధ వార్తా చానళ్లను చూపించే యప్ టీవీ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌ల పోటీ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఈ కార్యక్రమానికి యప్ టీవీ తెరతీసింది. క్రియేటివిటీ ఉన్నవాళ్లను ప్రోత్సహించేందుకు తాజాగా షార్ట్ ఫిల్మ్స్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేసింది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ లు ఏ భాషలోనైనా రూపొందించవచ్చు. అయితే ప్రాంతీయ భాషల్లో తీసినప్పుడు మాత్రం వాటికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ చిత్రాలను పరిశీలించే జ్యూరీ ప్యానెల్ లో ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, కేతన్ మెహతా, సుదీర్ మిశ్రా ఉన్నారు. ఈ చిత్రాలను పంపించడానికి ఆఖరు తేదీని డిసెంబర్ 11గా నిర్ణయించారు. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లకు రూ.5లక్షల వరకు నగదు బహుమతితోపాటు 20 ఉత్తమ చిత్రాలను ప్రసారం చేస్తారు. -
యప్ టీవీ నుంచి.. 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'
యప్ టీవీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు(శుక్రవారం) నుంచి క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా నటించిన వెబ్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్' గా నామకరణం చేశారు. మొత్తం ఐదు ఎపిసోడ్లుగా రానున్న ఈ కార్యక్రమం కేవలం యప్ టీవీలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. యప్ టీవీ స్థాపకుడు, సీఈఓ ఉదయ్ రెడ్డి తొలిసారిగా మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్మించారు. స్టార్ ఆటగాళ్లతో ఈ నెలలో జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో లారా ఆడనున్నారు. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజాలందరూ కలిసి తమ ఇష్టమైన క్రికెట్‌ని మళ్లీ అమెరికాలో జరగనున్న మ్యాచ్‌లలో ఆడనున్నారు. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ రెండు టీంల మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ వెబ్ సిరీస్‌లో లారా వ్యక్తిగత జీవితంతో పాటు, క్రికెట్ పై అతనికున్న ప్రేమ, క్రికెట్ ఆటపై మక్కువ ఉన్నవారికి ఆయన సూచనలు ఇవ్వనున్నారు. నలభై ఆరేళ్ల వయసులో స్టార్ మ్యాచ్‌లలో మళ్లీ క్రికెట్ ఆడటానికి మానసికంగా, శారీరకంగా ఏవిధంగా సన్నద్ధమయ్యాడో వివరించనున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమాలను వీక్షించవచ్చు. యప్ టీవీ ఆప్ ద్వారా ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, బ్లూరే ప్లేయర్స్ లాంటి వాటిలో బ్రియాన్ లారా నాటౌట్ చూడొచ్చు. ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ 'బ్రియన్ లారా ఈజ్ నాటౌట్'.. యప్ టీవీ యూజర్స్ కోసం నాణ్యతతో రూపొందించిన మరో మంచి కార్యక్రమం అని అన్నారు. 'మరో సారి క్రికెట్ ఆడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడే అభిమానులు ఎక్కువగా నన్ను ఇష్టపడుతున్నారు. బ్రియాన్ లారా ఈజ్ నాటౌట్‌కు వస్తున్న భారీ స్పందన చూస్తే సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన యప్ టీవీకి, ఉదయ్ రెడ్డికి నా కృతజ్ఞతలు' అని బ్రియాన్ లారా అన్నారు. ప్రపంచంలో ఉన్న ఎందరో క్రికెటర్లకు బ్రియన్ లారా అదర్శప్రాయమని మధుర శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ వీడియో సిరిస్‌ను లారాతో రూపొందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, కర్టన్ రైజర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. జార్జియాలోని అట్లాంటా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యప్ టీవీ 13 భాషల్లో 200కు పైగా టీవీ చానళ్లు, 5000 పైగా సినిమాలు, వందలాది టీవీ షోలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. -
యప్ టీవీకి రెడ్ హెర్నింగ్ పురస్కారం
హైదరాబాద్: యప్ టీవీ 2015 సంవత్సరానికినూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెడ్ హెర్రింగ్ టాప్ 100 ఉత్తర అమెరికా పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత రంగాల్లో అభివృద్ధి చెందుతూ..మార్కెట్ లీడర్లుగా ఎదిగే సంస్థలకు ఈ జాబితాలో చోటు కల్పిస్తారు. ఉత్తర అమెరికాలోని వందలాది సంస్థలతో పోటీపడి వినోదం, మీడియారంగంలో యప్ టీవీ ఈ అవార్డును కైవసం చేసుకుంది. ప్రముఖ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్, ఈబేలు ఇంతకు ముందు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్‌కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్‌గా యప్ టీవీ ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్‌నందన్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో ప్రముఖ కంపెనీల నడుమ యప్ టీవీని రెడ్ హెర్రింగ్ అవార్డుకు ఎంపిక చేయడం గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. పురస్కారానికి ఎంపిక కావడంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, నూతన ఆవిష్కారాలకు ఊతమందించే చోదకంలా ఈ పురస్కారం తమను ఉత్సాహపరుస్తుందని తెలిపారు. -
మూడేళ్లలో.. రూ.600 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో నివసిస్తున్న వారికి ఆన్లైన్ ద్వారా భారతీయ టీవీ ఛానల్స్‌ను అందిస్తున్న యప్‌టీవీ మరింత వేగంగా విస్తరించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం రూ.66 కోట్లుగా ఉన్న ఆదాయం వచ్చే మూడేళ్ళలో రూ.600 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యప్‌టీవీ ఫౌండర్ సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, ఇందులో భాగంగా తొలిసారిగా ఏంజెల్ ఇన్వెస్టర్ శశిరెడ్డి 2.5 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. విస్తరణ, పెట్టుబడి వివరాలను తెలియచేయడానికి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీ విలువను రూ.160 కోట్లుగా మదింపు చేశారని, దీని ప్రకారం శశిరెడ్డికి 10 శాతం వాటాతో పాటు బోర్డులో సభ్యత్వం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరోసారి నిధులు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యప్‌టీవీకి లక్ష లోపు ప్రీమియం చెల్లించే సభ్యులు ఉండటమే కాకుండా గతేడాది రూ.66 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. గత రెండేళ్లుగా ఆదాయం 100%పైగా పెరుగుతోందని, ప్రస్తుతం 170 భారతీయ ఛానెల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ వీడియో వ్యాపారంలో అవకాశాలు బాగుండటంతో యప్టీవీలో సొంతగా ఇన్వెస్ట్ చేసినట్లు శశిరెడ్డి చెప్పారు. శ్రీ క్యాపిటల్ పేరుతో స్టార్ట్అప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి రూ.100 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను శశిరెడ్డి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అట్లాంటా కేంద్రంగా యప్‌టీవీ పనిచేస్తుండటంతో శ్రీ క్యాపిటల్ నుంచి కాకుండా సొంతంగా ఇన్వెస్ట్ శశి చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఇండియాలో రుసుము ఆధారిత కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ
ప్రపంచ ప్రఖ్యాత యాప్ టీవీ యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకుల కోసం భారతీయ ఛానెళ్ల ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు యాప్ టీవీ ముఖ్యకార్యనిర్వహాణాధికారి ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. అందులోభాగంగా స్టార్ ప్లస్, లైఫ్ ఓకే హిందీ ఛానెల్స్ ప్రసారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయ్ రెడ్డి అట్లాంటాలో మీడియాతో మాట్లాడుతూ... యాప్ టీవీ ద్వారా యూఎస్‌లోని దక్షిణాసియా ప్రాంత వాసులంతా భారతీయ టీవీ సీరియళ్లను వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్టార్ ప్లస్, లైఫ్ ఓకే చానెల్స్ రెండు పెయిడ్ ప్యాకేజీ కింద వీక్షించేందుకు యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకులకు అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యాప్ టీవీ ఇప్పటికే తన ప్రసారాలను 170 ఛానెల్స్‌లను వివిధ భారతీయ భాషలలో ప్రసారం చేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు. యూఎస్‌లో టీవీ ప్రేక్షకులకు భారతీయ టెలివిజన్ ఛానల్స్ అంటే అత్యంత ప్రీతి పాత్రమమని ఆయన గుర్తు చేశారు. యాప్ టీవీ ద్వారా ప్రసారాలను స్మార్ట్ టీవీలు, ఎస్టీబ్సీ, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, పీసీలు ద్వారా వీక్షించవచ్చని చెప్పారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా చూసే ప్రత్యేకత యాప్ టీవీ సొంతమని ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. -
యప్ టీవీ నుంచి లైవ్ కవరేజి సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాసీలు లక్ష్యంగా ఇంటర్నెట్ టీవీ సేవలు అందించే యప్‌టీవీ తాజాగా లైవ్ కవరేజి సర్వీసులను ప్రారంభించింది. కార్పొరేట్ ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు మొదలైన వాటిని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మాధ్యమంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ‘యప్‌టీవీ లైవ్’ సర్వీసులు ఉపయోగపడతాయని సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో తెలిపారు. లైవ్ టెలికాస్ట్ మధ్యలో అంతరాయం కలగకుండా ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు వివరించారు. అలాగే, వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమాలను సుమారు నెల రోజుల దాకా వీక్షించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లను వీడియోగ్రాఫర్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు, నెలవారీ అద్దె సుమారు రూ. 13,000 నుంచి ఉంటుందని (డేటా స్టోరేజి మొదలైనవన్నీ కలిపి) ఉదయ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇది అందుబాటులో ఉండగలదన్నారు. వీడియోగ్రాఫర్లే కాకుండా.. ఈ సర్వీసులు పొందదల్చుకునే వినియోగదారులూ నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. యప్టీవీలో ప్రస్తుతం 170 పైగా టీవీ చానళ్లను అందిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో 70-80 మిలియన్ డాలర్ల ఆదాయాలను అంచనా వేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు.