ఆన్‌ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్ | yuppflix launched for on demand movie content | Sakshi
Sakshi News home page

ఆన్‌ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్

Published Thu, Dec 3 2015 10:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

ఆన్‌ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్

ఆన్‌ డిమాండ్ సినిమాల కోసం యప్‌ఫ్లిక్స్

ఇంటర్‌నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ తాజాగా ఆన్ డిమాండ్ సినిమాల కోసం 'యప్ ఫ్లిక్స్'ను ప్రారంభించింది. ఇందులో 12 భారతీయ భాషల్లోని 5వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్, యాక్షన్, డ్రామా, భక్తి.. ఇలా అన్నిరకాల సినిమాలను తాము వినియోగదారులకు అందించనున్నట్లు యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం ఈ సేవలు అందిస్తున్నామన్నారు.

తాజా హిట్ సినిమాలు అన్నింటినీ యప్ ఫ్లిక్స్ ద్వారా యూజర్లు చూసుకోవచ్చని ఆయన అన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయులకు ప్రాంతీయభాషల్లోని సినిమాలు చట్టబద్ధంగా చూసే అవకాశం తక్కువగా ఉంటుందని, ఇప్పటికే యప్ టీవీ ద్వారా వివిధ రకాల సేవలు అందిస్తున్న తాము.. తాజాగా యప్ ఫ్లిక్స్‌తో ఆన్ డిమాండ్ డిజిటల్ సినిమాలను కూడా అందిస్తామని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాళం, పంజాబీ, బెంగాలీ... ఇలా అన్ని భాషలకు చెందిన సినిమాలు హై క్వాలిటీ డిజిటల్ కాపీలు అందుబాటులో ఉంటాయని ఉదయ్ రెడ్డి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement