స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ | YuppTV launches Star Plus and Life OK channels in USA | Sakshi
Sakshi News home page

స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ

Published Sat, Jan 25 2014 2:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ

స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ

ప్రపంచ ప్రఖ్యాత యాప్ టీవీ యూఎస్లోని భారతీయ టీవీ ప్రేక్షకుల కోసం భారతీయ ఛానెళ్ల ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు యాప్ టీవీ ముఖ్యకార్యనిర్వహాణాధికారి ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. అందులోభాగంగా స్టార్ ప్లస్, లైఫ్ ఓకే హిందీ ఛానెల్స్ ప్రసారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయ్ రెడ్డి అట్లాంటాలో మీడియాతో మాట్లాడుతూ... యాప్ టీవీ ద్వారా యూఎస్లోని దక్షిణాసియా ప్రాంత వాసులంతా భారతీయ టీవీ సీరియళ్లను వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు.

 

స్టార్ ప్లస్, లైఫ్ ఓకే చానెల్స్ రెండు పెయిడ్ ప్యాకేజీ కింద వీక్షించేందుకు యూఎస్లోని భారతీయ టీవీ ప్రేక్షకులకు అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యాప్ టీవీ ఇప్పటికే తన ప్రసారాలను 170 ఛానెల్స్లను వివిధ భారతీయ భాషలలో ప్రసారం చేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు. యూఎస్లో టీవీ ప్రేక్షకులకు భారతీయ టెలివిజన్ ఛానల్స్ అంటే అత్యంత ప్రీతి పాత్రమమని ఆయన గుర్తు చేశారు.

 

యాప్ టీవీ ద్వారా ప్రసారాలను స్మార్ట్ టీవీలు, ఎస్టీబ్సీ, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, పీసీలు ద్వారా వీక్షించవచ్చని చెప్పారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా చూసే ప్రత్యేకత యాప్ టీవీ సొంతమని ఉదయ్ రెడ్డి  ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement