టాటా ఐపీఎల్-2022 బ్రాడ్ కాస్టింగ్ హక్కులను వరుసగా యప్ టీవీ ఐదో సారి గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా యప్ టీవీ సబ్‌స్రైబర్లకు టాటా ఐపీఎల్-2022 స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. ఐపీఎల్-15 ఎడిషన్‌ను దాదాపు 99 దేశాల్లో యప్ టీవీ ప్రసారం చేయనుంది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్-15 ఎడిషన్‌ను చూడవచ్చును. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, ఆగ్నేయాసియా (సింగపూర్ మినహా), మలేషియా, మధ్య & దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, శ్రీలంక, పాకిస్తాన్, జపాన్, నేపాల్, భూటాన్, మాల్దీవులుతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్-2022ను యప్‌టీవీ ప్రసారం చేయనుంది.
ఈ సందర్భంగా యప్ టీవి వ్యవస్థాపకుడు అండ్ సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. “క్రికెట్ ఎల్లప్పుడూ భారీ క్రౌడ్-పుల్లర్‌గా ఉంటుంది. క్రికెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో...ప్రపంచవ్యాప్తంగా 99 దేశాలకు విస్తరించడంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంగా యప్ టీవీ నిలుస్తోన్నందుకు మేము సంతోషిస్తున్నాము. అంతర్జాతీయ లీగ్‌లకు సంబంధించి భారత్‌ను ప్రపంచ పటంలో ఉంచేందకు కృషి చేస్తాము. ప్రపంచ స్థాయి కంటెంట్‌తో గ్లోబల్ ఇండియన్ డయాస్పోరా సేవలను కొనసాగిస్తున్న యప్ టీవీతో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.
టాటా ఐపీఎల్-15 ఎడిషన్ ప్రజలకు అద్బుతమైన అనుభవాన్ని అందిస్తోందని డిస్నీ స్టార్ అక్విజిషన్ అండ్ సిండికేషన్-స్పోర్ట్స్ హెడ్ హ్యారీ గ్రిఫిత్ పేర్కొన్నారు. ఇక యప్ టీవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ, ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలుస్తోంది.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్ చేసిన ఇంటెల్..! ధర ఏంతంటే..?
Comments
Please login to add a commentAdd a comment