షార్ట్ ఫిల్మ్స్కు ఆహ్వానం
మంచి క్రియేటర్గా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారా? అద్భుతమైన ఆలోచనలు ఆచరణలో పెట్టి ఆకట్టుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు ఆ అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది యప్ టీవీ. వివిధ వార్తా చానళ్లను చూపించే యప్ టీవీ.. తాజాగా షార్ట్ ఫిల్మ్ల పోటీ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.
టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఈ కార్యక్రమానికి యప్ టీవీ తెరతీసింది. క్రియేటివిటీ ఉన్నవాళ్లను ప్రోత్సహించేందుకు తాజాగా షార్ట్ ఫిల్మ్స్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేసింది. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ షార్ట్ ఫిల్మ్ లు ఏ భాషలోనైనా రూపొందించవచ్చు. అయితే ప్రాంతీయ భాషల్లో తీసినప్పుడు మాత్రం వాటికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఈ చిత్రాలను పరిశీలించే జ్యూరీ ప్యానెల్ లో ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, కేతన్ మెహతా, సుదీర్ మిశ్రా ఉన్నారు. ఈ చిత్రాలను పంపించడానికి ఆఖరు తేదీని డిసెంబర్ 11గా నిర్ణయించారు. ఉత్తమ షార్ట్ ఫిల్మ్ లకు రూ.5లక్షల వరకు నగదు బహుమతితోపాటు 20 ఉత్తమ చిత్రాలను ప్రసారం చేస్తారు.