ఐపీఎల్ కామెంటేటర్స్ (ఫైల్ ఫొటో)
ముంబై : మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం అవుతున్న ఓ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వార్తే ఏమిటంటే ఈ సీజన్ ఐపీఎల్‌లో మొత్తం 100 మంది వ్యాఖ్యాతలుగా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ 100 మందిలో మ్యాచ్‌ల్లో కనిపించేది మాత్రం 24 మంది కామెంటేటర్సేనంటా.! మిగతా వారంతా మరో అరడజను స్థానిక భాషల్లో కామెంటరీ చెప్పనున్నారని సమాచారం.
ఇందులో మహిళా కామెంటేటర్లతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఆడని వాళ్లు ఉన్నారు. ఈ సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ టోర్నీని 700 మిలియన్ల మందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోందని, దీనిలో భాగంగానే స్థానిక భాషలకు కామెంటేటర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక కామెంటేటర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారనదే ముఖ్యం కాదు.. ప్రజలకు ఎంత చేరువ అవుతున్నామనదే ముఖ్యమని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ కామెంటేటర్స్ ఎంపికలో మాజీ ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు.
ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీలో ఈ సీజన్ ఐపీఎల్ ప్రేక్షకులను అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment