
సునీల్ గావస్కర్, ఎల్. శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, రోహన్ గావస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రా ఈ ప్యానల్‌లో చోటు దక్కించుకున్నారు.
న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్‌ను ఏర్పాటు చేసిన బీసీసీఐ అందులో మంజ్రేకర్‌ను విస్మరించింది. సునీల్ గావస్కర్, ఎల్. శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, రోహన్ గావస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రా ఈ ప్యానల్‌లో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ జరుగనుంది. దాస్ గుప్తా, కార్తీక్ అబుదాబిలో... మిగతా వారు షార్జా, దుబాయ్ వేదికల్లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. లీగ్‌లో 21 మ్యాచ్‌ల చోప్పున దుబాయ్, అబుదాబి ఆతిథ్యమివ్వనుండగా, షార్జాలో 14 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
(చదవండి: ఇప్పుడే చెప్పలేం )