Commentators
-
వరల్డ్‌కప్ కామెంటేటర్ల జాబితాను ప్రకటించిన ఐసీసీ
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రకటించింది. 31 మంది సభ్యులున్న ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలకు చెందిన వరల్డ్‌కప్ విన్నర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆరుగురు భారతీయులకు చోటు దక్కింది. భారత్ నుంచి స్టార్ వ్యాఖ్యాతలు హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, దినేశ్ కార్తీక్, అంజుమ్ చోప్రా వరల్డ్‌కప్ కామెంట్రీ ప్యానెల్లో చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, ఆరోన్ ఫించ్, మాథ్యూ హేడెన్, డిర్క్ నానెస్, మార్క్ హోవర్డ్, లిసా స్థాలేకర్, వ్యాఖ్యాతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ నుంచి ఇయాన్ స్మిత్, సైమన్ డౌల్, కేటీ మార్టిన్.. ఇంగ్లండ్ నుంచి ఇయాన్ మోర్గన్, నాసర్ హుస్సేన్, మైఖేల్ ఆథర్టన్, మార్క్ నికోలస్, ఇయాన్ వర్డ్.. పాకిస్తాన్ నుంచి రమీజ్ రజా, వకార్ యూనిస్, అథర్ అలీ ఖాన్.. వెస్టిండీస్ నుంచి ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ.. సౌతాఫ్రికా నుంచి షాన్ పోలాక్, కస్తూరీ నాయుడు, నటాలీ జెర్మనోస్.. జింబాబ్వే నుంచి ఎంపుమలెలో ఎంబాంగ్వా.. శ్రీలంక నుంచి రసెల్ ఆర్నాల్డ్ వ్యాఖ్యాతల లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. పైన పేర్కొన్న వ్యాఖ్యాతలంతా వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల నుంచే తమ నోటికి పని చెప్పనున్నారు. -
వరల్డ్‌కప్ కామెంటేటర్ల జాబితా విడుదల.. వివాదాస్పద వ్యాఖ్యాతకు దక్కని చోటు
టీ20 వరల్డ్‌కప్-2022లో కామెంట్రీ చెప్పబోయే వ్యక్తుల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు చోటు దక్కకపోగా.. భారత్ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. మొత్తంగా ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 29 మందికి చోటు లభించింది. ఐసీసీ వరల్డ్‌కప్-2022 కామెంటేటర్ల ప్యానెల్లో ఈ సారి ఏకంగా ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలకు చోటు దక్కడం విశేషం. ఇంగ్లండ్‌కు చెందిన ఇషా గుహ, మెల్ జోన్స్, నథాలీ జెర్మానోస్ వరల్డ్‌కప్‌లో మహిళా వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. వరల్డ్‌కప్ వ్యాఖ్యాతల ప్యానెల్లో భారత్‌కు చెందిన రవిశాస్త్రి, హర్షా భోగ్లే, న్యూజిలాండ్‌కు చెందిన డానీ మారిసన్, సైమన్ డౌల్, వెస్టిండీస్‌కు చెందిన ఇయాన్ బిషప్, ఇంగ్లండ్‌కు చెందిన నాసిర్ హుసేన్ వ్యాఖ్యానం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలువనుంది. What an elite commentary line-up for #T20WorldCup 2022 😍 Details 👉 https://t.co/sCOReFrnTH pic.twitter.com/CuTJlwBeOk — ICC (@ICC) October 16, 2022 వరల్డ్‌కప్-2022 కోసం ఎంపిక చేసిన కామెంటేటర్ల వివరాలు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), అథర్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్), బాజిద్ ఖాన్ (పాకిస్తాన్), బ్రియాన్ ముర్గత్రయోడ్ (నమీబియా), కార్లోస్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), డానీ మారిసన్ (న్యూజిలాండ్), డిర్క్ నానెస్ (ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్), హర్షా భోగ్లే (ఇండియా), ఇయాన్ బిషష్ (వెస్టిండీస్), ఇయాన్ స్మిత్ (న్యూజిలాండ్), ఇషా గుహా (ఇంగ్లండ్), మార్క్ హోవర్డ్ (ఆస్ట్రేలియా), మెల్ జోన్స్ (ఆస్ట్రేలియా), మైఖేల్ అథర్టన్ (ఇంగ్లండ్), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్), నథాలీ జెర్మానోస్ (గ్రీస్), నీల్ ఓబ్రెయిన్ (ఇంగ్లండ్), పోమి ఎంబాంగ్వా (జింబాబ్వే), ప్రెస్టన్ మోమ్సేన్ (స్కాట్లాండ్), రవిశాస్త్రి (ఇండియా), రసెల్ ఆర్నాల్డ్ (శ్రీలంక), సామ్యూల్ బద్రి (వెస్టిండీస్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), షాన్ పొలాక్ (సౌతాఫ్రికా), సైమన్ డౌల్ (న్యూజిలాండ్), సునీల్ గవాస్కర్ (ఇండియా) -
ఐపీఎల్ ప్యానెల్లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్..
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న వారి పేర్లను స్టార్ స్పోర్ట్స్ ఆదివారం ప్రకటించింది. ఈ జాబితాలో స్థానం ఆశించిన టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లకు ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన వ్యాఖ్యాతల బృందంలో మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. దీంతో యూఏఈ వేదికగా జరగనున్న కాష్ రిష్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అతను మరోసారి కోల్పోయాడు. కాగా, మంజ్రేకర్ తన నోటి దురుసు కారణంగా 2019లో బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించబడ్డాడు. మంచి క్రికెట్ పరిజ్ఞానం.. అంతకుమించి ఇంగ్లీష్, హిందీ భాషలు అనర్గలంగా మాట్లాడగల సత్తా ఉన్న మంజ్రేకర్.. చాలా సందర్భాల్లో ఆటగాళ్లు, సహచర వ్యాఖ్యాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పొలార్డ్‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ, 2019 వన్డే ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్' అంటూ సంబోధించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు పెద్ద దుమారమే రేగింది. అతనికున్న నోటి దురుసు కారణంగా బీసీసీఐ వేటు వేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరినప్పటికీ బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే, స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రకటించిన ఐపీఎల్ వ్యాఖ్యాతల ప్యానెల్లో హర్షా భోగ్లే, సునీల్ గవాస్కర్, నిక్ నైట్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఇయాన్ బిషప్(ఇంగ్లీష్) ఉన్నారు. ఇక హిందీ కామెంటేటర్స్ ప్యానెల్లో గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రాలకు చోటు దక్కింది. ఇక ఇటీవల వ్యాఖ్యాతగా మారిన దినేష్ కార్తీక్ మ్యాచ్‌లు ఆడనుండడంతో అతడికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ప్యానెల్: హర్షా భోగ్లే, సునీల్ గావాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషప్, అలన్ విల్కిన్స్, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్ నైట్, డానీ మోరిసన్, సైమన్ డౌల్, మ్యాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్. హిందీ కామెంటేటర్స్ ప్యానెల్: జతిన్ సప్రు, సురెన్ సుందరమ్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, తన్యా పురోహిత్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, కిరణ్ మోరే. చదవండి: సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం -
మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్‌ను ఏర్పాటు చేసిన బీసీసీఐ అందులో మంజ్రేకర్‌ను విస్మరించింది. సునీల్ గావస్కర్, ఎల్. శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, రోహన్ గావస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రా ఈ ప్యానల్లో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ జరుగనుంది. దాస్ గుప్తా, కార్తీక్ అబుదాబిలో... మిగతా వారు షార్జా, దుబాయ్ వేదికల్లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. లీగ్‌లో 21 మ్యాచ్‌ల చోప్పున దుబాయ్, అబుదాబి ఆతిథ్యమివ్వనుండగా, షార్జాలో 14 మ్యాచ్‌లు జరుగనున్నాయి. (చదవండి: ఇప్పుడే చెప్పలేం ) -
ఎగిరి గంతేసిన కామెంటేటర్..!
-
మెస్సీ 600వ గోల్.. ఓ పండగ..!!
క్యాటలోనియా : స్టేడియంలో ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తమదైన శైలిలో వ్యాఖ్యానించడం.. ప్రేక్షకుల్లో జోష్ పెంచడం సాధారణంగా కామెంటేటర్ల పని. కానీ, ప్రపంచం ఆరాధించే, తను అత్యంత అభిమానించే గోల్ మాస్టర్, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ అద్భుతాలకే అద్భుతం అనిపించే గోల్ సాధిస్తే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్, కామెంటేటర్ గ్యారీ లైన్కేర్ కూడా అదే చేశారు. బార్సీలోనా తరపున మెస్సీ 600వ గోల్ సాధించడంతో లైన్కేర్ ఆనందంతో ఊగిపోయారు. ‘వావ్’ అంటూ కామెంటరీ క్యాబిన్లో సహచరుడు లియో గార్సియోతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన లివర్‌పూల్-బార్సిలోనా సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత లూయిస్ స్వారెజ్ ఓ గోల్ సాధించడంతో బార్సిలోనా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అనంతరం మెస్సీ మరో రెండు గోల్స్ సాధించి తన టీమ్‌ను 3-0 ఆదిక్యంలోకి తీసుకెళ్లడంతో బార్సిలోనా ఘన విజయం సాధించింది. ఆట మరో 7 నిముషాల్లో ముగుస్తుందనగా మెస్సీ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచిన తీరుతో అటు కామెంటేటర్లు ఇటు అభిమానులు ఫిదా అయ్యారు. మెస్సీ చేసిన ఈ గోల్ (బార్సిలోనా తరపున 600వది) చర్రిత్రాత్మకం అని గ్యారీ లైన్కేర్, లియో గార్సియో పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘ఎప్పుడూ లేనంతగా ఈ రోజు మేం సమష్టిగా రాణించాం. అందుకే ఈ గెలుపు సాధ్యమైంది. మొదటి గోల్ సాధించి స్వారెజ్ మా గెలుపునకు బాటలు వేశాడు’ అని చెప్పుకొచ్చాడు. 31 ఏళ్ల మెస్సీ ఇప్పటికే తన ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ కెరీర్లో 600 గోల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ నోరుజారిన ఆసీస్ కామెంటేటర్
మెల్బోర్న్: మూడో టెస్టు తొలి రోజు ‘జలంధర్ రైల్వే క్యాంటీన్ నౌకర్ల’ బౌలింగ్‌లో రంజీ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటాడంటూ మయాంక్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ కెరీ ఓ కీఫ్ మళ్లీ మాట తూలాడు. తన గత వ్యాఖ్యపై క్షమాపణలు చెప్పిన అతను నాలుగో రోజు అదే తరహాలో భారత ఆటగాళ్ల గురించి పరుషంగా మాట్లాడాడు. జడేజా, పుజారాల పేర్లను సరిగ్గా పలకలేక సహచర కామెంటేటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కీఫ్ ఈ పేర్లపై తన అక్కసు వెళ్లగట్టాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. కీఫ్ వ్యాఖ్యల గురించి భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందిస్తూ...‘ఇలాంటి వ్యాఖ్యలు సహజంగానే కొంత బాధిస్తాయి. కానీ వాటిని మనం నియంత్రించలేం. అయితే ఆ బాధను కసిగా మార్చుకొని మైదానంలో చెలరేగితే అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చినట్లే’ అని అభిప్రాయపడ్డారు. లెగ్‌స్పిన్ బౌలర్ అయిన 69 ఏళ్ల కెరీ ఒ కీఫ్ ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. -
ఈ ఐపీఎల్లో 100 మంది కామెంటేటర్స్!
ముంబై : మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రచారం అవుతున్న ఓ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వార్తే ఏమిటంటే ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం 100 మంది వ్యాఖ్యాతలుగా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ 100 మందిలో మ్యాచ్‌ల్లో కనిపించేది మాత్రం 24 మంది కామెంటేటర్సేనంటా.! మిగతా వారంతా మరో అరడజను స్థానిక భాషల్లో కామెంటరీ చెప్పనున్నారని సమాచారం. ఇందులో మహిళా కామెంటేటర్లతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఆడని వాళ్లు ఉన్నారు. ఈ సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ టోర్నీని 700 మిలియన్ల మందికి చేరువ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోందని, దీనిలో భాగంగానే స్థానిక భాషలకు కామెంటేటర్స్ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక కామెంటేటర్‌గా ఎవరు వ్యవహరిస్తున్నారనదే ముఖ్యం కాదు.. ప్రజలకు ఎంత చేరువ అవుతున్నామనదే ముఖ్యమని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ కామెంటేటర్స్ ఎంపికలో మాజీ ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మ్యాచ్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభం కానుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీలో ఈ సీజన్ ఐపీఎల్ ప్రేక్షకులను అలరించనుంది. -
కామెంటేటర్స్... కొంచెం మారండి!
టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ దేశాల కామెంటేటర్స్ వారి జట్లను సమర్ధించుకుంటూ మాట్లాడుతుంటే... భారత వ్యాఖ్యాతలు మాత్రం ధోని సేనను పదే పదే విమర్శిస్తున్నారని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. గెలిచిన సమయంలో కూడా పాజిటివ్‌గా మాట్లాడకపోతే కష్టమని, ఇప్పటికైనా మన కామెంటేటర్స్ మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యకు సోషల్ మీడియాలో స్పందన బాగా వచ్చింది. మన కామెంటేటర్ల తీరు బాగోలేదని పలువురు విమర్శించారు. -
మాటల మాంత్రికులు నచ్చే కెరీర్..
క్రీడా వ్యాఖ్యానం టీవీలు విస్తృతంగా అందుబాటులోకి రాకముందు క్రికెట్ కామెంటరీని ట్రాన్సిస్టర్లలో వినడం చాలామందికి ఒక మధుర జ్ఞాపకం. ప్రతి బంతిని, పరుగును విశ్లేషిస్తూ, ఎప్పటికప్పుడు స్కోర్‌ను తెలియజేస్తూ వ్యాఖ్యాతలు మ్యాచ్‌ను కళ్లకు కట్టినట్టు చూపించేవారు. కామెంటేటర్లకు ఎందరో అభిమానులుండేవారు. మాటల మాంత్రికులు స్పోర్ట్స్ కామెంటరీని కెరీర్‌గా ఎంచుకుంటే నేడు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. స్పోర్ట్స్ చానళ్ల సంఖ్య పెరగడంతో కామెంటేటర్లకు డిమాండ్ పెరిగింది. కాబట్టి క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు. గ్లామరస్ జాబ్: స్పోర్ట్ కామెంటరీ అనేది గ్లామరస్ జాబ్. కామెంటరీ బాక్సుల్లో కూర్చొని లైవ్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకప్పుడు క్రికెట్‌కే పరిమితమైన వ్యాఖ్యానం ఇప్పుడు ఇతర క్రీడలకు కూడా పాకింది. స్పోర్ట్స్ చానళ్లలో అన్ని రకాల క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కామెంటేటర్లను తప్పనిసరిగా నియమిస్తున్నారు. వ్యాఖ్యాతలుగా సాధారణంగా క్రీడాకారులకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ, హర్షా బోగ్లే, పద్మజీత్ షెరావత్ లాంటివారు క్రీడలతో సంబంధం లేకపోయినా కామెంటేటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. కాబట్టి ప్రతిభాపాటవాలు ఉంటే ఇందులో సులువుగా రాణించొచ్చు. క్రీడా వ్యాఖ్యాతలకు స్పోర్ట్స్ చానళ్లు, ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలున్నాయి. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలోనూ కామెంటేటర్ల అవసరం ఉంటోంది. వ్యాఖ్యాతలకు నిత్యం పని దొరకదు. ఒక్కోసారి నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని పార్ట్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవడం మంచిది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే దీన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: స్పోర్ట్స్ కామెంటేటర్లకు ఆంగ్ల, హిందీ భాషలపై గట్టి పట్టు ఉండాలి. క్రీడలను ప్రేమించే గుణం అవసరం. క్రీడల నియమ నిబంధనలు, పాత రికార్డులపై పరిజ్ఞానం చాలా ముఖ్యం. సమయస్ఫూర్తిని ప్రదర్శించే నేర్పు, వినసొంపైన స్వరం, ఆకట్టుకొనే రూపం ఉండాలి. అర్హతలు: క్రీడా రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతలుగా రాణిస్తున్నారు. జాతీయస్థాయి మాజీ క్రీడాకారులు కామెంటరీ బాక్సుల్లో దర్శనమిస్తున్నారు. కాబట్టి మొదట క్రీడల్లో పాల్గొని కామెంటేటర్‌గా మారొచ్చు. వ్యాఖ్యాతలకు సాధారణ విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. మొదట స్పోర్ట్స్ చానళ్లలో పనిచేసి, అనుభవం పెంచుకున్న తర్వాత ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలు పొందొచ్చు. వేతనాలు: క్రీడా వ్యాఖ్యాతలకు ప్రతినెలా స్థిరమైన వేతనం అందకపోయినా పని దొరికినప్పుడు మాత్రం ఆర్జన భారీగానే ఉంటుంది. సాధారణ కామెంటేటర్ రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకోవచ్చు. ఈ రంగంలో అనుభవం పెంచుకుంటే రోజుకు రూ.25 వేలకు పైగానే అందుకోవచ్చు. ఎక్కువ రోజులు పనిచేస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కోగల నైపుణ్యం ఉంటే డబ్బుకు లోటుండదు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: క్రీడలపై వ్యాఖ్యానం చెప్పడం తరగతి గదిలో నేర్చుకొనే విద్య కాదు. స్పోర్ట్స్ కామెంటరీపై మనదేశంలో ఎలాంటి కోర్సులు లేవు. ఆంగ్ల, హిందీ భాషలు నేర్చుకోవడంతోపాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ కింది సంస్థల్లో ఆయా స్కిల్స్‌పై కోర్సులు ఉన్నాయి. ఆర్.కె.ఫిలింస్ అండ్ మీడియా అకాడమీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://rkfma.com/ డబ్లిన్ బిజినెస్ స్కూల్ వెబ్సైట్: www.dbs.ie