ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్‌గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది.
▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా మారింది.
▶ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్.
▶యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది.
▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
▶సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment