మడిచే స్క్రీన్‌.. వాక్‌ చేయించే షూస్‌! | CES 2024 showcased some incredible innovations that are set to shape the future of technology ces 2025 going on | Sakshi
Sakshi News home page

మడిచే స్క్రీన్‌.. వాక్‌ చేయించే షూస్‌!

Published Tue, Jan 7 2025 2:12 PM | Last Updated on Tue, Jan 7 2025 2:12 PM

CES 2024 showcased some incredible innovations that are set to shape the future of technology ces 2025 going on

టెక్నాలజీ పెరుగుతున్న ఈరోజుల్లో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచిస్తూ కంపెనీలు తమ వినియోగదారులకు అవసరాలు తీర్చేందుకు అనువైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు, వాటిని ప్రదేర్శించేందుకు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో(CES) వేదికగా మారింది. 2025వ సంవత్సరానికిగా ఇది లాస్‌వెగాస్‌(Los Vegas)లో జనవరి 7 నుంచి 10 వరకు జరుగుతుంది. గతేడాదిలోని కొన్ని ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం.

మడిచే స్క్రీన్, ప్రొజెక్టర్

అరోవియా కంపెనీ ‘స్ప్లే’ అనే ఫోల్డబుల్ స్క్రీన్, ప్రొజెక్టర్‌ను ఆవిష్కరించింది. మడిచేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు.

ట్రాన్స్‌పరెంట్‌ ఎల్ఈడీ స్క్రీన్

2024 సీఈఎస్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి పారదర్శక మైక్రో ఎల్ఈడీ స్క్రీస్‌ను శాంసంగ్‌ కంపెనీ ఆవిష్కరించింది. క్రిస్టల్ క్లియర్ డిస్ ప్లే దీని సొంతం.

బ్లాక్‌బెరీ కీబోర్డ్‌

గతంలో మొబైల్‌ ఫోన్లను తయారు చేసిన బ్లాక్‌బెరీ కంపెనీ సీఈఎస్‌ 2024లో వినూత్న ఆవిష్కరణ చేసింది. టచ్‌ ఫోన్‌ను తాకకుండా టైపింగ్‌ చేసేందుకు వీలుగా ఫిజికల్‌ కీబోర్డును ఆవిష్కరించింది. ఫోన్‌లోని కొన్ని సెన్సార్ల సాయంతో ఇది పని చేస్తుంది.

వేగంగా వాక్‌ చేయించే షూస్‌

షిఫ్ట్‌ రొబోటిక్స్‌ సంస్థ మూన్‌వాకర్స్‌ ఎక్స్‌ పేరుతో వేగంగా వాక్‌ చేయించేందుకు వీలుగా ఉండే షూస్‌ను ఆవిష్కరించింది. ఈ షూస్‌తో గంటకు 7 మైళ్లు(12 కి.మీ) వాక్‌ చేసే సదుపాయం ఉంటుంది.

ఎగిరే కారు

చైనాకు చెందిన ఎక్స్‌పెంగ్‌ ఏరోహెచ్‌టీ అనే కంపెనీ ‘ఫ్లైయింగ్‌కార్‌’ను ఆవిష్కరించింది.

స్మార్ట్‌ టాయిలెట్‌

కోలర్‌ కంపెనీ సెన్సార్లతో పని చేసే స్మార్ట్‌ టాయిలెట్‌ను ఆవిష్కరించింది. ఇది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement