మరో నెల రోజుల్లో 2022 గుడ్ బై చెప్పి న్యూఇయర్‌ని ఆహ్వానించబోతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మార్చి నెల ముగిసే సమయానికి (ఆర్ధిక సంవత్సరం) అన్నీ రంగాల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల శాలరీలు పెరుగుతాయని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ వచ్చే ఏడాది వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదితో పోలిస్తే జీతాల పెంపు 2023 తక్కువగా ఉండనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
డెలాయిట్ ఇండియా మన దేశానికి చెందిన సుమారు 300 కంపెనీల నుండి డేటా సేకరించింది. ఆ డేటా ప్రకారం..వచ్చే ఏడాది ఏ విభాగంలో శాలరీ హైక్స్ ఎక్కువగా ఉంటాయి. ఏయే రంగాల్లో జీతాలు పెంపు తక్కువగా ఉంటుందో తెలిపింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫైనాన్షియల్ ఇయర్ - 2022లో జనవరి-డిసెంబర్ సంస్థల పనితీరు కారణంగా 2023 ఆర్ధిక సంవత్సరంలో వేతన పెంపు తక్కువగా ఉంటాయని అంచనా.
పెరిగే రంగాలు?
ముఖ్యంగా భారత ఎకానమీకి ఆర్ధికంగా వెన్నదన్నుగా నిలిచే రంగాలైన హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం, కన్స్యూమర్/ఎఫ్ఎంసీజీ, పవర్ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది శాలరీ హైకులు ఎక్కువగా ఉంటాయని ఎకనామిక్ టైమ్స్‌కు డెలాయిట్ ఇండియా తెలిపింది.
మరి టెక్ కంపెనీల్లో?
ఇక ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. తద్వారా టెక్ కంపెనీల్లో శాలరీల పెంపు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో రెసిషన్ భయాలు వణికించడంతో టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందని, అందుకు మెటా, అమెజాన్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో పాటు ఇతర టెక్ కంపెనీల పనితీరే నిదర్శనమని డెలాయిట్ నివేదిక హైలెట్ చేస్తుంది. వచ్చే ఏడాది సైతం ఐటీ రంగం ఈ తరహా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వేతన పెంపు , నిలిచి పోనున్న నియామకాలు!
ఐటీ ప్రొడక్ట్ కంపెనీల్లో శాలరీల పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం పెరుగుతాయని అంచనా. ఐటి సర్వీసెస్ లో వేతన పెంపు 2022 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంతో పోలిస్తే 2023లో 8.8 శాతంగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఐటి సేవలు 2022 ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వద్ద ఉంటాయని అంచనా వేయగా..క్యాప్టివ్ సేవలు (ఔట్ సోర్సింగ్) 2022 ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతానికి తగ్గుతాయని భావిస్తున్నారు. వేతనాల పెంపు ఇలా ఉంటే కొత్త నియామకాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని అంచనా.
జోరుమీదున్న సర్వీస్ సెక్టార్
సర్వీస్ సెక్టార్‌లో అప్రైజల్ అంచనాలు 2023 ఆర్థిక సంవత్సరంలో 9.4 శాతంగా ఉన్నాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉంది. అదేవిధంగా, హాస్పిటాలిటీ, ట్రావెల్ అండ్ టూరిజం రంగంలోని ఉద్యోగులు ఈ ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం వేతన పెంపును పొందవచ్చు, ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నుండి పెరిగింది. రిటైల్ విభాగంలో శాలరీల పెరుగుదల స్థూలంగా 8.0 శాతం వద్ద ఫ్లాట్ గా ఉంటుందని భావిస్తున్నారు. కన్స్యూమర్/ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలో ఇంక్రిమెంట్లు 9.8 శాతం ఉండనున్నాయి.
పవర్, పునరుత్పాదక శక్తిని(రెన్యూవబుల్ ) వంటి విభాగాల్లో శాలరీలు పెరగనున్నాయని భావిస్తున్నారు. పునరుత్పాదక ఉద్యోగులు 9.6 శాతం నుండి 11 శాతం పెరుగుదలను చూస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ రంగంలోని కార్మికులు 2022 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం నుండి 9.5 శాతం ఇంక్రిమెంట్లను చూడవచ్చు. ఫార్మాలో 8.9 శాతం వద్ద ఫ్లాట్‌గా ఉంటాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment