సాక్షి, విశాఖపట్నం: విశాఖ సీపోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్‌లో డ్రైఈస్ట్‌తో మిక్స్ చేసి బ్యాగ్‌ల్లో డ్రగ్స్ తరలించారు. ఒక్కో బ్యాగ్‌లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేపన్ చేపట్టింది. విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతోనే డెలీవరి అడ్రస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్ పేరుతో కంటైనర్ బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. లాసన్స్ బే కాలనీలో సంధ్యా అక్వా ఎక్స్ పోర్టు కార్యాలయం ఉంది. ఏ1గా సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ లిమిటెడ్‌ను చేర్చగా, నిందితులుగా మరి కొంతమందిని చేర్చే అవకాశం ఉంది.
18న ఈ-మెయిల్ ద్వారా సీబీఐకి కీలక సమాచారం వచ్చింది. అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఇంటర్‌పోల్ గుర్తించింది. సీబీఐకి ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్ రాకెట్ ముఠా గట్టు రట్టయ్యింది. డ్రగ్ రాకెట్ ముఠాను పట్టుకునేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు లిమిటెడ్‌కి చెందిన ప్రతినిధుల పేర్లను సైతం సీబీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment