సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు.రూ .2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్స్‌ను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి చెప్పారు.
మౌలిక సదుపాయాల నిధులను ఈ ఏడాది 34 శాతం పెంచిందనీ, రూ. 5.54 లక్షల కోట్లు మేర పెంచినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం కరోనా మహమ్మారి సమయంలో ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment