seeks
-
ఆ ఇద్దరి నామినేషన్లు రద్దు చేయాల్సిందే.. బీజేపీ డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఒక సిట్టింగ్ ఎంపీ సహా ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను రద్దు చేయాల్సిందేనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. వారి నామినేషన్లు పత్రాల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది.బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోల్‌కతా-దక్షిణ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలా రాయ్ ఎంపీగానే కాకుండా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాభదాయకమైనదిగా పరిగణించే ఆ పదవికి రాజీనామా చేయకుండానే ఆమె ఈసారి నామినేషన్ దాఖలు చేశారని చటోపాధ్యాయ చెప్పారు.మరో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హత్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న హాజీ నూరుల్ ఇస్లాం నామినేషన్‌ను కూడా రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నూరుల్ ఇస్లాం ఇదే నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు.నామినేషన్ దాఖలు చేసేవారెవరైనా ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వ, శాసనసభ లేదా పార్లమెంటరీ హోదాలో ఉన్నట్లయితే తమ నామినేషన్‌తో పాటు గత 10 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని, కానీ నూరుల్ ఇస్లాం ఆ నో డ్యూ సర్టిఫికెట్‌ను సమర్పించలేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ ఛటోపాధ్యాయ అభ్యంతరం వ్యక్తం చేశారు.బీర్భూమ్ లోక్‌సభ నియోజకవర్గానికి తమ మొదటి అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి దేబాసిష్ ధర్ నామినేషన్‌ను ఇదే కారణంతో రద్దు చేశారని ఛటోపాధ్యాయ గుర్తు చేశారు. దీంతో తాము అభ్యర్థిని మార్చవలసి వచ్చిందన్నారు. రాయ్, ఇస్లాం నామినేషన్లలో ఈ లోపాలను ఎత్తిచూపుతూ ఇప్పటికే ఈసీని ఆశ్రయించామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు సహా ఎంత వరకూ అయినా వెళ్తామని చటోపాధ్యాయ స్పష్టం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..
ఆత్మీయత.. అనురాగం.. అనుబంధం.. వీటిని మించి.. అమ్మంటే అంతులేని ప్రేమ. బిడ్డలపై అమ్మ ప్రేమకు సరితూగగలదేది ఈ లోకంలో ఉండదు. తనకోసం గాక పిల్లల కోసం తమను అర్పించగల కరుణామూర్తి తల్లి. ఈ స్వభావం సృష్టిలో అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది. జంతువులు సైతం పిల్లల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మాతృప్రేమను చాటే ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క పడే యాతన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు బీబీత్సం సృష్టించాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసుల చుట్టే ఓ కుక్క తిరిగింది. ఏదో చెప్పాలన్నట్లు ఆవేదన చెందుతూ పోలీసుల వంకే దీనంగా చూస్తూ ఏడిచింది. దీంతో పోలీసులు కుక్క ఇంతలా వెంబడించడానికి గల కారణమేంటని ఆలోచించారు. దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆ కుక్క వరదల్లో మునిగిన ఓ ఇంటి వైపుకు తీసుకెళ్లింది. #APPolice rescued puppies stranded in flood water: In #NTR(D) due to massive floods loomed the puppies were trapped in a house. Cops realized the distress of mother #dog for her children. They immediately rescued them&safely brought them to their mother&showed humanity.(1/2) pic.twitter.com/UdA8KD99XD — Andhra Pradesh Police (@APPOLICE100) July 30, 2023 అక్కడే పోలీసులు ఆ కుక్క పిల్లలను గుర్తించారు. వరద నీటిలో బురదలో చిక్కుకున్న కుక్క పిల్లలు ఆ ఇంటిలో ఉన్నాయి. వెంటనే వాటిని బయటకు తీశారు. వాటికి అంటుకున్న బురదను శుభ్రపరిచి కుక్కకు అందించారు. పిల్లలను ముద్దాడిన తల్లి కుక్క పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తల్లి ప్రేమను ప్రతిబింబించే సాంగ్‌ను జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు చేసిన సహాయానికి జంతుప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన విజయవాడ సిటీ పోలీసులను రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసించారు. ఇదీ చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
ఛీ ఏం మనుషులు! చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంటే ఫోటోలా!
లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. (చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్..! ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా మొబైల్ కొట్టేసిన స్నాచర్) -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్‌విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్‌లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్‌లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్‌లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్‌లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
మోదీ జీ సాయం చేయండి అంటూ... మహిళ లేఖ
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ జిల్లాలోని సంగీత శర్మ అనే మహిళ భర్త కోసం ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రిని సాయం చేయమని అభ్యర్థించింది. ఆమె తన భర్త అనారోగ్యంతో దక్షిణాఫ్రికాలో మృతి చెందాడని, ఆయన మృతదేహాన్ని భారత్‌కి రప్పించేందుకు సాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సంగీతా శర్మ ఉత్తరప్రదేశ్‌లోని భాయ్లా గ్రామ నివాసి. ఆమె తన భర్త మనోజ్ కుమార్ మృతదేహాన్ని తిరిగి రప్పించేందుకు తన వద్ద తగినంత డబ్బులేదంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ రాయ్ తెలిపారు. మనోజ్ కుమార్ దక్షిణాఫ్రికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నడని, ఆగస్టు 27న అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పారు. అంతేకాదు జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ సబ్ డివిజనల్ దేవబంద్ దీపక్ కుమార్‌ను ఆ మహిళకు సాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఐతే సంగీతశర్మ అంగన్ వాడి కార్యకర్త అని ఆమె పిల్లలు కూడా చాలా చిన్నవాళ్లని పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. (చదవండి: విధిరాత అంటే ఇదేనేమో! టైంకి ఆస్పత్రికి తరలించిన...ఓపెన్ కానీ అంబులెన్స్ డోర్లు) -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
హైవేల పక్కనే టౌన్‌షిప్‌లు : నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులకు సమీపంలో పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్స్ పార్క్‌లు, స్మార్ట్ పట్టణాలు, టౌన్‌షిప్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ కేబినెట్ నోట్‌ను తయారు చేసినట్టు కేంద్ర రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు, హంగులతో రహదారుల నెట్‌వర్క్‌ను నిర్మించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత రహదారుల ప్రాజెక్టులను విక్రయించేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 400 ప్రాంతాల్లో రహదారుల పక్కన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు.రూ .2.5 లక్షల కోట్ల విలువైన టన్నెల్స్‌ను నిర్మించాలని తమ మంత్రిత్వ శాఖ యోచిస్తోందని మంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల నిధులను ఈ ఏడాది 34 శాతం పెంచిందనీ, రూ. 5.54 లక్షల కోట్లు మేర పెంచినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగడం కరోనా మహమ్మారి సమయంలో ఉపాధిని సృష్టించడానికి సహాయపడుతుందని గడ్కరీ పేర్కొన్నారు. -
బడ్జెట్ 2020 : ఆటో ఇండస్ట్రీ ఏం ఆశిస్తోంది?
సాక్షి, ముంబై: రాబోయే యూనియన్ బడ్జెట్లో తమకు ప్రోత్సాహకాల కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. సుదీర్ఘ మందగమనం, 2019 లో రెండు దశాబ్దాలు కనిష్టానికి పడిపోయిన అమ్మకాలు నేపథ్యంలో ఆటో రంగ పునరుద్ధరణకు కొన్ని ఆర్థిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వాహనలపై జీఎస్టీ భారం తగ్గింపు, లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతిపై సుంకం రద్దు చేయడం వంటి చర్యలను పరిశ్రమ ఆశిస్తోంది. దాదాపు ఏడాది కాలంగా తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ పరిశ్రమ, పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానంతోపాటు వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది. అలాగే బీఎస్-6 ఉద్గార నిబంధనల అమలును పరిశ్రమ స్వాగతిస్తోంది. ఈ చొరవ వాహన వ్యయంలో 8-10 శాతం పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని భావిస్తోంది. అయితే, ఈ అదనపు ఖర్చు డిమాండ్ తగ్గడానికి దారి తీస్తుందనీ, ఈ క్రమంలో ఏప్రిల్ నుండి బీఎస్ 6 వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది. కాగా 2019 లో వాహనాల అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. గత వారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అన్ని వాహన విభాగాల్లో నూ 13.77 క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకింగ్ భవిష్యత్తుకు ఐడియాలివ్వండి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ ఓ వినూత్న ప్రయత్నానికి బీజం వేసింది. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకోగా... దీన్ని సాధించేందుకు గాను బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో పెట్టాలని భావించింది. ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ నెల పాటు బ్రాంచ్‌ల స్థాయిలో అధికారులతో సంప్రదింపుల ప్రక్రియను చేపట్టి.. వారి సలహాలు స్వీకరించాలని కోరింది. శనివారాల్లో దీన్ని చేపట్టాలని వారిచ్చిన సూచనలను, బ్యాంకింగ్ రంగ భవిష్యత్తు వృద్ధికి రోడ్‌మ్యాప్ రూపకల్పనలో వినియోగించాలని సూచించింది. దిగువ స్థాయి నుంచి ఈ సంప్రదింపుల ప్రక్రియ ఉంటుందని, బ్రాంచ్‌ల స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగుతుందని ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లకు పంపిన లేఖలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తొలుత బ్రాంచ్ లేదా ప్రాంతీయ స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సలహాల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అనంతరం, ఢిల్లీలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశం ఉంటుంది. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే విషయంలో కీలక భాగస్వాములైన ప్రభుత్వరంగ బ్యాంకుల పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలుస్తోంది. -
అనిల్ అంబానీని జైలుకు పంపండి!
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అనిల్ అంబానీని నిర్బంధించాలని కోరుతూ స్వీడన్‌కు చెందిన టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ అప్పులు చెల్లించకుండా విదేశాలకు పారిపోకుండా చూడాలని సుప్రీంను కోరింది. ఆర్‌కాం ఛైర్మన్ అనిల్ అంబానీని జైలుకు పంపి, విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తద్వారా రూ.550 కోట్ల బాకీని వడ్డీతో సహా చెల్లించేలా చూడాలంటూ గురువారం రెండవ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ అనిల్ సహా ఈ కంపెనీలకు చెందిన ఇతర అధికారులు దేశం విడిచిపోకుండా నివారించేలా హోం మంత్రిత్వశాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు గడువులోపు బాకీ చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకుగాను అనిల్ అంబానీని జైలుకు పంపాలని డిమాండ్ చేసింది. చాలాకాలంగా ఆర్‌కాం చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నాం..550 కోట్ల రూపాయల చెల్లింపునకు అంబానీ కోర్టులో వ్యక్తిగత హామీ ఇచ్చారు, కానీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం ఇది రెండవసారి. ఈ నేపథ్యంలో ఆర్‌కాంపై దివాలా చర్యలు చేపట్టాలని ఎరిక్సన్ సీనియర్ అడ్వకేట్ అనిల్ ఖేర్ వ్యాఖ్యానించారు. -
లోకసభకు సప్లిమెంటరీ డిమాండ్ గ్రాంట్
సాక్షి, న్యూఢిల్లీ: రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర వ్యయానికి గాను పార్లమెంటు ఆమోదం కోసం సభ ముందు వచ్చింది. మార్చి, 2018 నాటికి కొత్త ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయం కేటాయింపుల ఆమోదం కోసం పార్లమెంటు దిగువ సభముందు ఉంచింది. ఈ మేరకు గ్రాంట్‌ను కోరుతూ రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. రూ. 33,380 కోట్ల వ్యయానికి అనుమతిని కోరినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
సెల్ టవర్ల రేడియేషన్‌పై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : మొబైల్ టవర్ల రేడియేషన్ ప్రభావంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. దీనిపై ఒక నివేదిక సమర్పించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు సి. నాగప్పన్, ఎం ఖాన్ విల్కార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివరణలు కోరింది. నివాస ప్రాంతాల్లో మరియు పాఠశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్ టవర్ల నిర్మాణంపై నోయిడా నివాసి నరేస్ చంద్ర గుప్త దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీం విచారించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 17కి వాయిదా వేసింది. సెల్ టవర్ల ద్వారా వెలుబడే రేడియేషన్ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మొబైల్ టవర్లనుంచి వెలువడే రేడియేషన్ విషతుల్య ప్రభావాలు, ఉద్గారాల ప్రమాణాల అమలుకు తీసుకుంటున్న చర్యలను సహా పలు అంశాలపై కేంద్రం నుండి ఒక నివేదిక కోరింది. మొబైల్ టవర్ల ప్రతికూల ప్రభావాలు ఏమిటి? వీటిని మానిటర్ చేయడానికి ఏదైనా ఏజెన్సీ ఉందా ? చట్టపరమైన నిబంధనలు, ఈ ప్రమాణాలను సుప్రీం ప్రశ్నించింది. సెల్ టవర్ల ఏర్పాటులో టెలికమ్యూనికేషన్ శాఖ ఏవైనా ఉల్లంఘనలను గుర్తించిందా, ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగితే, దానిపై తీసుకున్న చర్యలపై సుప్రీం ఆరా తీసింది. నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుపై ఉన్న కండీషన్స్ చెప్పాలని కోర్టు కోరింది. అలాగే ఇప్పటి వరకు దేశంలో ఉన్న సెల్ టవర్ల సంఖ్య, వాటిపై దాట్ తనిఖీలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికంను కోరింది. దేశంలోని సెల్ టవర్స్ రేడియేషన్ నియంత్రణలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాయా? అని ధర్నాసనం ప్రశ్నించింది. నిబంధనలు, నిబంధనలు ఉల్లంఘన రిపోర్టులు, అలాంటి వారిపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి డాట్ నుండి సమాచారాన్ని కోరింది. దీంతోపాటు ఫోన్ సర్వీసు ప్రొవైడర్స్ లకు టవర్ల నిర్మాణంలో పాటించాల్సిన రేడియేషన్ ప్రమాణాలు, నిబంధనల అమలుపై ఒక టైమ్ ఫ్రేమ్ విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి కొంత సమయం కావాలని డాట్ న్యాయవాది పత్వాలియా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకు...
వాషింగ్టన్ః సముద్ర ఆస్తుల రక్షణ, నిఘాకోసం భారత్ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. సరిహద్దుల్లోకి చొచ్చుకొని వచ్చి ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు ఆధునిక డ్రోన్లు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు దేశాలు చేస్తున్న ఆక్రమణలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణంచింది. అమెరికానుంచి అధునాతన నిఘాడ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమౌతోంది. హిందూ మహాసముద్రంలోని ఆస్తుల రక్షణ, నిఘా కోసం పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకోసం అమెరికాకు తాజాగా అభ్యర్థన లేఖ పంపింది. ఇండియా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజెమేను అమెరికా ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించిన పదిహేను రోజుల్లోనే ఈ కదలిక ప్రారంభమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సందర్భంలో భారత్ ను ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించడంతో కొత్త ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ముంబై తీవ్రవాద దాడివంటి అవాంఛనీయ చొరబాట్లు ఇకపై జరగకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సముద్ర పెట్రోల్ ప్రిడేటర్ గార్డియన్ మానవ రహిత వైమానిక వాహనాన్ని జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ఎత్తులోను, విస్తృత ప్రాంతంలో సైతం నిఘాకు పనికివచ్చే ఐఎస్ ఆర్ సామర్థ్యం కలిగిఉన్న ఈ డ్రోన్లు హిందూ మహా సముద్రంలో భారత తూర్పు, పశ్చిమ తీరాల్లోని సముద్ర ఆస్తులను పరిరక్షించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. 50,000 అడుగుల ఎత్తులో, 24 గంటలపాలు నిరవధికంగా పనిచేసే అధునాతన డ్రోన్లు చిన్నపాటి ఫుడ్‌బాల్ ఆకారంలో ఉంటాయని, ఇంతకు ముందే ఇండియా ఇటువంటి డ్రోన్లు కొనేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఇండియాకు ఎంటీసీఆర్ లో భాగస్వామ్యం లేకపోవడంతో ఒబామా ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసి పుచ్చింది. ప్రస్తుతం పదిహేను రోజులక్రితం ఇండియా ఎంటీసీఆర్ సభ్యత్తం పొందడంతో మరోసారి అమెరికాకు అభ్యర్థనను పంపింది. ఈ డ్రోన్లు ఉగ్రదాడుల చర్యలను దూరంనుంచే పసిగట్టగల్గుతాయి. అంతేకాక కదిలే వాహనాలు, వస్తువులను సులభంగా గుర్తు పట్టగల్గడంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. -
300 కోట్లు మాయంపై 6వారాల్లో వివరణ ఇవ్వండి!
రెండేళ్ళ క్రితం అనుమానాస్పద పరిస్థితుత్లో అస్సాంలో అదృశ్యమైన ఖజానా విషయాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది.కోట్ల సంపద మాయమవ్వడాన్ని కఠినంగా స్వీకరించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు, అస్పాం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు సంపద అదృస్యంపై అస్పాం డీజీపీ సహా ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ టి. ఎస్ ఠాకూర్ అస్సాం ఖజానా అదృశ్యాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రెండేళ్ళ క్రితం అస్సాం డిస్ పూర్ లోని కాళికా మాత మందిరం నుంచి మాయమైన భారీ సంపదను అన్వేషించాలంటూ మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మనోజ్ కౌశల్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్... కేంద్ర ప్రభుత్వంతోపాటు, అస్పాం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కాళికా మాత మందిరంలోని విగ్రహం కింద సంపద ఉందనే విషయం రహస్యంగా తెలుసుకున్న ఆర్మీ బృందం అక్కడకు చేరేసరికే సంపద మొత్తం మాయమవ్వడంతో అప్పట్లో అక్కడ ఆర్మీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనోజ్ కౌశల్ ఈ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ చేయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినీతి పోలీసు అధికారుల సాయంతోనే సంపద మాయమైనట్లు ఆయన ఆరోపించారు. మనోజ్ కౌశల్ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అక్కడి వ్యాపారుల వద్ద బోడో ఉగ్రవాదులు డబ్బు వసూలు చేస్తుంటారని, అక్కడి టీ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు భట్టాచార్య టీగార్డెన్స్ యజమానులనుంచి డబ్బును వసూలు చేసి వారికి అందిస్తుంటారన్నది సంపద మాయం వెనుక సమాచారం. అంతేకాదు భట్టాచార్య అక్కడినుంచి మయన్మార్ కు బంగారం స్మగ్టింగ్ చేస్తారని కూడ చెప్నేవారు. దీంతో జరగక ముందే భట్టాచార్యతో పాటు ఆయన భార్యను కూడ గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారని, దీంతో ఘటనకు సంబంధించి అనుమానితులను గుర్తించి వారి కాల్ డేటాను కూడ కౌశల్ పరిశీలించారు. డేటానుబట్టి వీరంతా ఉమ్మడిగానే సంపదను మాయం చేశారని, అందుకు వారి బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తం బ్యాలెన్స్ ఉండటాన్ని కూడ కౌశల్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయంపై పోలీసులు ఏమాత్రం స్పందించలేదని, జాతి సంపద ఉగ్రవాదుల చేతిలో పడితే వ్యతిరేక చర్యలకు వినియోగించే అవకాశం ఉందని, ఆ సంపద ఎప్పటికైనా భారత ప్రభుత్వానికి దక్కాలని కౌశల్ వాదిస్తున్నారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు అప్పట్లోనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, అస్సాం డీజీపీకి కూడ నోటీసులు జారీ చేసిన కోర్టు... విషయంపై ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. -
నిబంధనలనుంచి మినహాయింపు కోరిన 'యాపిల్'
అమెరికాకు చెందిన ఐఫోన్, ఐ ప్యాడ్ తయారీ సంస్థ యాపిల్ విడిభాగాల సమీరకణ నిబంధనలపై మరోసారి మినహాయింపును కోరింది. ఈ నేపథ్యంలో యాపిల్.. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక మండలి (డిప్) కు ఓ ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని దుకాణాలతోపాటు, ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి కోరిన సంస్థ.. డీఐపీపీకి వివరణ ఇచ్చింది. భారత్ లో వస్తువులను విక్రయించాలంటే 30 శాతం విడి భాగాలను దేశీయంగా సమీకరించాలన్న నిబంధన నుంచి యాపిల్ సంస్థ మినహాయింపు కోరుతూ మరోసారి వివరణ ఇచ్చింది. అమెరికా ఆధారిత సంస్థ దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి ఆమోదం కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) నిబంధనల ప్రకారం అత్యున్నత సాంకేతికత ఇమిడి ఉండే సింగిల్ బ్రాండ్ ఉత్పత్తులకు నిబంధనలు తప్పనిసరి చేసే అవకాశం లేకపోవడంతో యాపిల్ కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్ త్వరలోనే యాపిల్ సంస్థ ధరఖాస్తును స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సమీక్షించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీఐపిపి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ అనుమతి 100 శాతం ఉంది. కానీ కంపెనీలు 49 శాతం మించి ఉన్నపుడు ఎఫ్ ఐపిబి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను తమ స్వంత రిటైల్ దుకాణాల ద్వారా చైనా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం యాపిల్ స్వంత దుకాణాలను తెరవలేదు. రెడింగ్టన్, ఇన్ గ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తో పాటు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ గ్జియామీ కూడ భారత్ లో సింగిల్ బ్రాండ్ విక్రయశాలల ప్రారంభానికి అనుమతికోసం ధరఖాస్తు చేసుకుంది. -
వారిపై జోకులను బ్యాన్ చేయండి..!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు. అయితే ఆ నవ్వుల పువ్వులు విరిసేందుకు హాస్యాన్ని పండించేవారూ, ఆస్వాదించేవారూ కూడ అవసరమే. స్పాంటేనియస్ గా పుట్టే హాస్యం... ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది. కానీ హాస్యానికి వస్తువు ఏమిటి అనేది ఎంచుకోవడం మాత్రం ఒక్కోసారి కష్టంగానే మారుతుంది. ముఖ్యంగా నలుగురు కలిసినప్పుడు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఏదో ఒక జోక్ చెప్పుకుని నవ్వుకుంటుంటారు. అందులో ఒక్కటైనా సర్దార్జీలపై ఉంటుండటం షరా మామూలుగా కనిపిస్తుంది. అయితే ఆ సర్దార్జీ జోక్ ల వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. జోక్ లపై అభ్యంతరాలతో ఓ లాయర్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేయడంతో కేసు విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకప్పుడు హాస్యాన్నిపండించేందుకు సినిమా యాక్టర్లనో, రాజకీయ నాయకులనో, భాషనో, యాసనో వస్తువుగా మలచుకునేవారు. కానీ రాను రాను అది తీవ్ర రూపం దాల్చడంతో ఆయా సంబంధింత వర్గాలు అభ్యంతరాలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో హాస్యాన్ని పండించడం ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త కష్టంగానే మారింది. అయితే ఇప్పుడు సర్దార్జీ జోక్స్ పై సుప్రీంకు చేరిన పిల్ ను కోర్టు పరిశీలించేందుకు అంగీకరించింది. మొత్తం సిక్కు సమాజంపై నిర్లక్ష్యం, తొందరపాటుతనం తో వేసే జోక్స్... మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందంటూ సర్దార్జీలపై వెబ్ సైట్లలో జోక్ లను తొలగించాలన్న డిమాండ్ కోర్టు పరిశీలిస్తోంది. బుద్ధి తక్కువ వ్యక్తులుగానూ, అవివేకులుగానూ సిక్కులను చిత్రీకరిస్తుండటం బాధిస్తోందని సిక్కు న్యాయవాది హర్విందర్ చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేరస్తులకు పెనాల్టీ విధించే దిశగా అధికారులకు ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. సర్దార్జీ జోక్స్ ఉన్న సుమారు ఐదు వేల వెబ్ సైట్లను నిషేధించాలని, లేదా వాటినుంచీ సిక్కు సమాజాన్ని కించపరిచే జోక్స్ ను పూర్తిగా తొలగించేందుకు టెలికాం, ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రులకు ఆదేశాలివ్వాలని ఆమె అభ్యర్థించారు. కోర్టులు... విదేశాలతో సహా అన్ని ప్రాంతాల్లో తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వాతావరణంలో తమ పిల్లలు సైతం ఇంటిపేరైన కౌర్, సింగ్ లను పెట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. న్యాయమూర్తులు టి.ఎస్. థాకూర్, గోపాల్ గౌడ లతో కూడిన ధర్మాసనం... ఈ జోక్స్ ను పలువురు సిక్కులు పెద్దగా పట్టించుకోవడం లేదని, వారిపై వారే జోక్స్ వేసుకుని హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారని అన్నారు. అంతేకాక హాస్యోక్తులు రాసిన కుష్వంత్ సింగ్ కూడ సిక్కేనని ఎత్తి చూపారు. పైగా ఎంతోమంది జోక్స్ ను స్పోర్టివ్ గా తీసుకుంటారని, అవమానంగా భావించడం లేదని అన్నారు. కేవలం వినోదం కోసం పండించే హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. అటువంటి జోక్స్ ను పూర్తిగా నిలిపివేయాలని మీరు కోరితే... ఏకంగా సిక్కులే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండొచ్చని బెంచ్ అభిప్రాయ పడింది. అయితే ఇటీవల బీహార్ లో ప్రధాని మోడీ పర్యటనను న్యాయవాది చౌదరి బెంచ్ కు ఉదహరించారు. అక్కడ జరిగిన ర్యాలీలో ప్రధాని బీహారీలు తెలివైన వారు అన్నారని, అదే మా విషయానికి వస్తే... ప్రతివారూ జోక్స్ వేసేందుకే ప్రయత్నిస్తారని చెప్పారు. దానికి బెంచ్ స్పందిస్తూ.. ఒకవేళ మోడీ పంజాబ్ వెడితే సిక్కులు కూడ తెలివైనవారని ప్రశంసిస్తారని మీరు చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా చౌదరి పిటిషన్.. ఓ నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన సున్నిత విషయమని, అందుకే ఆమె పిటిషన్ ను సుప్రీం కోర్ట్ సిక్కు న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. కెహర్ ముందు ఉంచుతామని చెప్పారు. మీ కమ్యూనిటీ నుంచీ సుప్రీంకోర్టు ఓ న్యాయమూర్తిని కలిగి ఉండటం అదృష్టమని, అదే సమాజానికి చెందిన వ్యక్తి సమస్యను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని, కేసును ఆయన బెంచ్ కు తరలిస్తామని ఆమెను కోరారు. కాగా పిటిషనర్.. అందుకు అంగీకరిస్తూ... తిరిగి తన వాదనను కొనసాగించేందుకు ఒక నెల గడువును అడిగారు. -
మరో వివాదంలో రాధే మా
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా కు మరోసారి చుక్కెదురైంది. త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించిన కేసులో దాఖలైన పిటిషన్ పై శుక్రవారం ముంబై హైకోర్టు స్పందించింది. ఈ కేసులో కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 18లోగా దీనికి సమాధానం చెప్పాలని జస్టిస్ విఎం కనాడే, షాలిన్ ఫానల్కార్ లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ ఏడాది ఆగస్టులో ఔరంగాబాద్ నుండి ముంబైకి ఓ ప్రయివేటు విమానంలో రాధే మా ప్రయాణిస్తున్న సమయంలో త్రిశూలంతో ప్రయాణించడంపై సామాజిక కార్యకర్త రమేష్ జోషి వ్యాజ్యం దాఖలు చేశారు. మారణాయుధం లాంటి త్రిశూలాన్ని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ చర్య ద్వారా సివిల్ యావియేషన్ నిబంధనలను ఆమె అతిక్రమించారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాధేమా మరింత ఇరకాటంలో పడ్డారు. రాధే మా మినీస్కర్టులో ఉన్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతోపాటు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు, వరకట్న వేధింపులు తదితర నేరాలతో పాటు మరికొన్ని కేసుల్లో ఆమెను పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. -
కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలి
రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయి హోదా అంటున్నారే తప్ప.. మిగతా సమస్యలు పట్టవా? శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేకహోదాను ప్రకటించడంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేంత వరకు అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని అర్ధించారు. ప్రత్యేకహోదాపై సోమవారం రాష్ట్ర శాసనసభలో అసంపూర్తిగా ముగించిన ప్రకటనను ముఖ్యమంత్రి మంగళవారం కొనసాగించారు. దీనిపై చర్చ సందర్భంగా చంద్రబాబుకు, విపక్ష నేత జగన్మోహన్రెడ్డికి మధ్య వాడీవేడీ సంవాదం నడిచింది. పరస్పరవాద ప్రతివాదాలు, సవాళ్లు, వ్యంగ్యోక్తులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకహోదాపై విపక్షం తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా ఆక్షేపించగా సభలో ఇచ్చిన ప్రకటనకు చంద్రబాబు చెప్పేదానికి అసలు పొంతనే లేదని వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు. సభ్యుల సమాచారం కోసమే ప్రకటన ఇస్తారని, దాన్ని స్ఫూర్తిని, సారాంశాన్ని ఆధారం చేసుకుని చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పట్టవా? అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు సహా ప్రత్యేకహోదా సాధన కోసం నేను చేస్తున్న కృషిని గుర్తించడానికి బదులు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గత 15 నెలల కాలంలో 17సార్లు ఢిల్లీ వెళ్లా. ప్రధానితో ఏడుసార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యా. నా ప్రయత్నాల వల్ల గతేడాది బడ్జెట్ లోటు భర్తీకి రూ.2,300కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.350కోట్లు, కొత్త రాజధాని నిర్మాణానికి రూ.1,500కోట్లు, అదనపు తరుగుదల రాయితీ 15శాతం, ప్రణాళికా నిధులకు అదనపు కేంద్ర సాయం కింద రూ.3,700కోట్లు వచ్చాయి. నాపై నిఘానా? సహించబోను హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. రెండు ప్రభుత్వాలకు సమానాధికారాలుంటాయి. కానీ.. ఒక రాష్ట్ర ప్రభుత్వంపై మరో ప్రభుత్వం పెత్తనం చేస్తోంది. ఒక ప్రభుత్వంపై మరోటి నిఘా పెట్టడమా? బహిరంగంగా మీ వాళ్లను(తెలంగాణ ఎమ్మెల్యేలను) కొంటుంటే మీరు నోరు మెదపలేదు. కానీ మీరిప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు. హోదా అంటున్నారే తప్ప మిగతావి పట్టవా? సమస్యలన్నింటినీ ప్రతిపక్షం పట్టించుకోదా? మాట్లాడుకుందాం రమ్మన్నా.. వినలేదు రాజకీయ లబ్ధి కోసం జరిగిన విభజన ఇది. విభజనతో తలెత్తిన సమస్యల్ని మనం కలిసి కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుందాం రమ్మని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాం. సయోధ్యతో ముందుకు పోదామన్నా. మనవల్ల కాకపోతే పెద్ద మనుషుల్ని అడుగుదామని చెప్పా. కానీ, కలిసి రాలేదు. ప్రత్యేకహోదా అంటే సరిపోతుందా? ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం నిఘా పెట్టినా, ఇక్కడి ప్రజలు అభద్రతతో బతుకుతు న్నా, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నా ప్రశ్నించాల్సిన బాధ్యత విపక్షానికి లేదా? హో దా అంటూ పోరాడితే సరిపోతుందా? జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవమైనప్పటికీ నేను జరుపలేదు. నవ నిర్మాణ దిక్షగా నిర్వహించా. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజైన జూలై 8ని సంకల్ప దినంగా పాటిస్తున్నాం. ఎన్డీఏలో ని తమ మంత్రుల్ని ఉపసంహరించుకోమంటున్నారు. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. రాజీనామా చేయాల్సిన అవస రం లేదని చెబుతున్నాం. (ఈ సందర్భంలోనే వైఎస్సార్సీపీ ఆనాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు). బాబు ప్రసంగం మధ్యలో వైఎస్ జగన్ జోక్యం చేసుకొని రాష్ట్ర విభజనపై టీడీపీ తెలంగాణలో ఒకమాట, ఆంధ్రలో మరోమాట చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు వరంగల్ సభలో మాట్లాడుతూ టీడీపీ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతారు. అదే ఆంధ్రాలో వైఎస్సార్సీపీ వల్లనే రాష్ట్రం విడిపోయిందంటారు. చంద్రబాబు ఇలా రెండు రకాలుగా మాట్లాడుతారు’ అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. సమష్టిగా ముందుకు పోదాం.. రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చే వారు కలిసిరండి. సమష్టిగా ముందుకు పోదాం. నెంబర్ వన్ రాష్ట్రంగా మారుద్దాం అని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలను ఏకరవు పెట్టారు. భావోద్వేగాలకు ప్రతీక ఆ లేఖ ప్రత్యేకహోదా ప్రతిపత్తి కోసం రాష్ట్రంలో నానాటికీ భావోద్వేగాలు పెరిగిపోతున్నాయనే ప్రతీకే గుడివాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిన లేఖని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏపీకి స్వతంత్య్రం వస్తుందా? సోనియమ్మ రాజకీయంతో రాష్ట్రం విడిపోయింది. ఈ రాజకీయ నాయకులు ఇకనైనా కళ్లు తెరుస్తారా? ప్రత్యేకహోదా సాధిస్తారా? పాలకులు సమాధానం చెప్పాలంటూ’ ఆ యువకుడు రాసిన లేఖ సారాంశమన్నారు. ప్రజల మనోభావాలకు ఈ లేఖ అద్దం పడుతోందన్నారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు వద్దని, ఆత్మహత్యలకు పాల్పడేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. హరీశ్‌తో జగన్ కలసిన ఆధారాలున్నాయ్ హరీశ్‌తో జగన్ ఎక్కడ కలిసిందీ తమవద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. లాలూచీ పడకుంటే... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినైన తన ఫోను, మంత్రుల ఫోన్లను టాప్ చేస్తే ప్రతిపక్షనేత ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... తెలంగాణ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని స్టీఫెన్సన్కు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జగన్ లేఖ రాసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఆ లేఖను జత చేసి స్టీఫెన్సన్ పేరును ఎమ్మెల్యే పదవికి నామినేట్ చేస్తూ తెలంగాణ సీఎం గవర్నర్‌కు లేఖ రాశారని తె లిపారు. -
ఒక మనిషికి ఒకే పదవి....