
సాక్షి, న్యూఢిల్లీ: రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను బీజేపీ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రూ. 33,380 కోట్లు నికర వ్యయానికి గాను పార్లమెంటు ఆమోదం కోసం సభ ముందు వచ్చింది.
మార్చి, 2018 నాటికి కొత్త ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయం కేటాయింపుల ఆమోదం కోసం పార్లమెంటు దిగువ సభముందు ఉంచింది. ఈ మేరకు గ్రాంట్‌ను కోరుతూ రెండవ సప్లిమెంటరీ డిమాండ్ (ఆఫ్ గ్రాంట్)ను ప్రవేశపెట్టారు. రూ. 33,380 కోట్ల వ్యయానికి అనుమతిని కోరినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment