
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది.
దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది.
Comments
Please login to add a commentAdd a comment