పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకు...
వాషింగ్టన్ః సముద్ర ఆస్తుల రక్షణ, నిఘాకోసం భారత్ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. సరిహద్దుల్లోకి చొచ్చుకొని వచ్చి ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు ఆధునిక డ్రోన్లు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు దేశాలు చేస్తున్న ఆక్రమణలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణంచింది.
అమెరికానుంచి అధునాతన నిఘాడ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమౌతోంది. హిందూ మహాసముద్రంలోని ఆస్తుల రక్షణ, నిఘా కోసం పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకోసం అమెరికాకు తాజాగా అభ్యర్థన లేఖ పంపింది. ఇండియా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజెమేను అమెరికా ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించిన పదిహేను రోజుల్లోనే ఈ కదలిక ప్రారంభమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సందర్భంలో భారత్ ను ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించడంతో కొత్త ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ముంబై తీవ్రవాద దాడివంటి అవాంఛనీయ చొరబాట్లు ఇకపై జరగకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సముద్ర పెట్రోల్ ప్రిడేటర్ గార్డియన్ మానవ రహిత వైమానిక వాహనాన్ని జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ఎత్తులోను, విస్తృత ప్రాంతంలో సైతం నిఘాకు పనికివచ్చే ఐఎస్ ఆర్ సామర్థ్యం కలిగిఉన్న ఈ డ్రోన్లు హిందూ మహా సముద్రంలో భారత తూర్పు, పశ్చిమ తీరాల్లోని సముద్ర ఆస్తులను పరిరక్షించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. 50,000 అడుగుల ఎత్తులో, 24 గంటలపాలు నిరవధికంగా పనిచేసే అధునాతన డ్రోన్లు చిన్నపాటి ఫుడ్బాల్ ఆకారంలో ఉంటాయని, ఇంతకు ముందే ఇండియా ఇటువంటి డ్రోన్లు కొనేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఇండియాకు ఎంటీసీఆర్ లో భాగస్వామ్యం లేకపోవడంతో ఒబామా ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసి పుచ్చింది. ప్రస్తుతం పదిహేను రోజులక్రితం ఇండియా ఎంటీసీఆర్ సభ్యత్తం పొందడంతో మరోసారి అమెరికాకు అభ్యర్థనను పంపింది. ఈ డ్రోన్లు ఉగ్రదాడుల చర్యలను దూరంనుంచే పసిగట్టగల్గుతాయి. అంతేకాక కదిలే వాహనాలు, వస్తువులను సులభంగా గుర్తు పట్టగల్గడంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి.