patrol
-
ఏం కష్టమొచ్చిందో...
ఏం కష్టమొచ్చిందో...ఓ పాతికేళ్ల యువతి పట్టణ శివారు ప్రాంతంలో ఎవరికీ కనబడకుండా తుప్పల్లోకి వెళ్లి వస్తువులన్నీ పక్కన పెట్టి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొంది. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృత్యుఒడిలోకి చేరింది. చికిత్స సమయంలో ఆమె పోలీసులకు చెప్పిన మాటలకు, సంఘటన స్థలం వద్ద ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తుండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌తో పాటు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ జి.పాలరాజు పర్యవేక్షణ చేశారు. సీసీ పుటేజీలలో ఆమె స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి కెఎల్.పురం వైపు వెళ్లే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న దృశ్యాలను కనుగొన్నారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం టౌన్: పట్టణ శివారు ద్వారపూడి గ్యాస్ గోడౌన్స్ దాటిన తర్వాత ఉన్న రియల్ ఎస్టేట్ ఖాళీ స్థలం లోపలికి పట్టణానికి చెందిన ముదునూరి అశ్విని (25) శుక్రవారం సాయంత్రం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందింది. పోలీసుల విచారణలో మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ వేగవంతం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ జి.పాలరాజు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువతి చెప్పిన ఆధారాలతో తమదైన శైలిలో అశ్వినిది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ లభ్యమైన యువతి బైక్ కీ, కర్చీఫ్, కళ్లద్దాలు, కాలిన వస్త్రాలు, చర్మం, వంటి వాటిని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ఆమె కాలిన తర్వాత కొంత దూరం వచ్చిన దూరాన్ని గుర్తించగలిగింది. ఈ సందర్భంగా సంఘటనా çస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జి.పాలరాజు మాట్లాడుతూ పూర్తి ఆధారాలు సేకరించామన్నారు. పెట్రోల్ బాటిల్ ఇంట్లోదే.. సంఘటనా స్థలం వద్ద లభించిన పెట్రోల్ బాటిల్‌ను అశ్వని తండ్రి వెంకటసాయిరామ్ గుర్తించారు. అది ఇంట్లో బాటిలేనని తెలిపారు. కర్చీఫ్, కళ్లద్దాలు కూడా ఆమెవేనని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. సీసీ పుటేజీల్లో... అశ్విని ఆత్మహత్యకు ముందు కలెక్టరేట్ నుంచి కెఎల్.పురం వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 3.41 నిమషాల నుంచి ఆమె పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని పెట్రోల్ ముందు బైక్‌లో కొట్టిం చి, తర్వాత బాటిల్లో నిండుగా పోయించింది. ఒకానొక సమయంలో టెన్షన్‌తో ఉన్నట్లు అక్కడ పుటేజీలో కనబడింది. పెట్రోల్ కొనుగోలు తర్వాత బాటిల్ ముందున పెట్టుకుంటే అది కాస్త కిందపడిపోయింది. దాన్ని అక్కడ పని చేస్తున్న సిబ్బంది అందించడంతో వెనుక సీట్ కిందన పెట్టి వేగంగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఒబిసిటీయే కారణమా? అతి లావు, పెరిగిన వయసు, పెళ్లి కాకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. అవి కారణాలు కాకపోయి ఉండవచ్చనే అనుమానాలు బలమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు ఇంకా బలమైన కారణమేదో ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఎందుకలా... అశ్విని మృత్యువుతో పోరాడుతున్న సమయంలో పోలీసులకు ఇచ్చిన సమాచారంలో ఎవరో ఇద్దరు దుండగులు తన దగ్గరకు వచ్చి పేరేంటని ప్రశ్నించి, పేరు చెప్పగానే కిరోసిన్ పోసి నిప్పంటించారని, మరోసారి కాళ్లు చేతులు కట్టేశారని చెప్పుకొచ్చింది. పట్టణంలోని సీసీ కెమెరాల పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం బట్టబయలైంది. పెట్రోల్ బంక్‌లో అశ్వినియే పెట్రోల్ కొనుగోలు చేసినట్లు రికార్డ్ అయింది. దీని ఆధారంగా యువతిపై దాడి జరగలేదని తనే ఆత్మహత్యకు పాల్ప డినట్లు తెలుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఎందుకలా చెప్పింది, ఆ యువతికి వచ్చిన కష్టమేంటి, ఆత్మహత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ కోసం వెళ్తుండగా..
సోమందేపల్లి/పెనుకొండ: జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమందేపల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన రవి(28) అక్కడికక్కడే మరణించగా, గీతానగర్ కు చెందిన బోయ నరేష్(24) తీవ్రంగా గా యపడ్డాడు. పెట్రోల్ వేయించుకోవడానికి బైక్‌పై బయలుదే రిన యువకులు జాతీయ రహదారి క్రాస్ చేస్తుండగా బెంగళూరు వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన నరేష్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. -
పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకు...
వాషింగ్టన్ః సముద్ర ఆస్తుల రక్షణ, నిఘాకోసం భారత్ మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. సరిహద్దుల్లోకి చొచ్చుకొని వచ్చి ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెట్టేందుకు మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు ఆధునిక డ్రోన్లు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకొని ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు దేశాలు చేస్తున్న ఆక్రమణలను అరికట్టేందుకు అత్యాధునిక డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణంచింది. అమెరికానుంచి అధునాతన నిఘాడ్రోన్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమౌతోంది. హిందూ మహాసముద్రంలోని ఆస్తుల రక్షణ, నిఘా కోసం పెట్రోల్ డ్రోన్ల కొనుగోలుకోసం అమెరికాకు తాజాగా అభ్యర్థన లేఖ పంపింది. ఇండియా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజెమేను అమెరికా ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించిన పదిహేను రోజుల్లోనే ఈ కదలిక ప్రారంభమైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన సందర్భంలో భారత్ ను ముఖ్య రక్షణ భాగస్వామిగా గుర్తించడంతో కొత్త ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ముంబై తీవ్రవాద దాడివంటి అవాంఛనీయ చొరబాట్లు ఇకపై జరగకుండా ఉండేందుకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సముద్ర పెట్రోల్ ప్రిడేటర్ గార్డియన్ మానవ రహిత వైమానిక వాహనాన్ని జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ఎత్తులోను, విస్తృత ప్రాంతంలో సైతం నిఘాకు పనికివచ్చే ఐఎస్ ఆర్ సామర్థ్యం కలిగిఉన్న ఈ డ్రోన్లు హిందూ మహా సముద్రంలో భారత తూర్పు, పశ్చిమ తీరాల్లోని సముద్ర ఆస్తులను పరిరక్షించడానికి సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. 50,000 అడుగుల ఎత్తులో, 24 గంటలపాలు నిరవధికంగా పనిచేసే అధునాతన డ్రోన్లు చిన్నపాటి ఫుడ్‌బాల్ ఆకారంలో ఉంటాయని, ఇంతకు ముందే ఇండియా ఇటువంటి డ్రోన్లు కొనేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఇండియాకు ఎంటీసీఆర్ లో భాగస్వామ్యం లేకపోవడంతో ఒబామా ప్రభుత్వం ఆ అభ్యర్థనను తోసి పుచ్చింది. ప్రస్తుతం పదిహేను రోజులక్రితం ఇండియా ఎంటీసీఆర్ సభ్యత్తం పొందడంతో మరోసారి అమెరికాకు అభ్యర్థనను పంపింది. ఈ డ్రోన్లు ఉగ్రదాడుల చర్యలను దూరంనుంచే పసిగట్టగల్గుతాయి. అంతేకాక కదిలే వాహనాలు, వస్తువులను సులభంగా గుర్తు పట్టగల్గడంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. -
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
ఏపీ ఆటో ట్రాలీ, డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకోకర్నూలు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ ఆటో ట్రాలీ, డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కృష్ణానగర్‌లోని ఐటీసీకి ఎదురుగా జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఆటోడ్రైవర్లంతా భారీగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, పాణ్యం డివిజన్ కార్యదర్శి గోపాల్, అధ్యక్షుడు సుధాకర్ తదితరులు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. చమురు ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో కంపెనీలు తమకు ఇష్టమొచ్చినట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయన్నారు. అధికారంలోకి రాకముందు వాటి ధరలు తగ్గిస్తామని హామీచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విస్మరించిందని విమర్శించారు. ఒక్క మే నెలలోనే మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమన్నారు. ఆటో యూనియన్ నాయకులు మహమూద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు సాయిబాబా, ఏసు, అయ్యస్వామి, సుధాకర్, మురళి, శాలు, నరసింహ, సుంకన్న, రాముడు, భాస్కర్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనం
ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు రోలుగుంట: మండలంలోని ఎంకేపట్నం- బీబీపట్నం మార్గంలో గంజాయి వ్యాపారులపై పోలీసు లు నిర్వహించిన దాడుల్లో ఒక వ్యక్తి పట్టుబడగా, మరో వ్యక్తి తప్పించుకున్నాడు. అతని నుంచి 88 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ గోవిందరావు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. ఎంకేపట్నం- బీబీపట్నం మార్గంలో బుధవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పక్షుల చెరువువద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతని వద్ద బస్తాలను పరిశీలించగా గంజాయి బయటపడింది. అక్కడి ఉన్న బీబీపట్నం గ్రామానికి చెందిన విసారపు వెంకట్రావును పట్టుకోగా, మరో వ్యక్తి పరారైనట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.76 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
చమురు వాత
పెట్రోల్‌పై రూ.3.17, డీజిల్‌పై రూ.2 పెంపు జిల్లాపై రోజుకు రూ.1.20 కోట్ల అదనపు భారం నిత్యావసర సరుకుల రేట్లపై ప్రభావం వాహనదారుల సంతోషం కొన్ని రోజులకే ఆవిరైపోయింది. అంతర్జాతీయ విపణిలో చమురు ఉత్పత్తుల ధరలు దిగి వస్తుంటే నెలవారీ బడ్జెట్లో మిగులు కనిపిస్తుందని ఆశించిన సగటు జీవికి నిరాశే మిగిలింది. తగ్గించేటప్పుడు రూపాయి, అర్ధ చొప్పున తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెంచేటప్పుడు మాత్రం పెద్దవాత పెట్టింది. ప్రస్తుతం ఏకంగా పెట్రోల్‌పై రూ.3.17, డీజిల్‌పై రూ.2 పెంచేసింది. దీంతో జిల్లాలో పెట్రోల్ లీటరు ధర రూ.65.37కు, డీజిల్ ధర రూ.54.23కు పెరగనున్నారుు. ఈ దెబ్బతో జిల్లావాసులపై రోజుకు రూ.1.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇక ఆర్టీసీపై నెలకు రూ.50 లక్షల వరకూ అదనపు భారం తప్పదు. మరోవైపు రవాణా వాహనాల బాడుగలూ పెరిగి ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. అసలే వేసవి కాలం.. దీనికి చమురు వాత కూడా తోడవ్వడంతో ధరలు చుక్కలు చూపిస్తాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ/ అంబాజీపేట : జిల్లాలో రోజూ పెట్రోల్, డీజిల్ విక్రయాలు సగటున రూ.15 కోట్ల మేర జరుగుతుంటాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, భారత్ పెట్రోలియం బంకులు 650 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతోంది. ఇటీవల చమురు ధరల పతనం కొనసాగడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఆ దామాషాలో తగ్గించుకుంటూ వచ్చింది. వాహనదారులు కాస్త ఊరట చెందారు. ఇటీవల పెట్రోలు ధర లీటరుకు రూ.2 పైగా తగ్గడంతో రూ.62.20 ఉండేది. మూడు నెలలు తిరగక ముందే ఏకంగా రూ.3.17లు పెంచడంతో ఇప్పుడు రూ.65.37కు చేరింది. ఇక డీజిల్ ధర గతంలో లీటరు రూ.52.25లు ఉండగా ఇప్పుడు అదనంగా రూ.1.98లను పెంచడంతో రూ.54.23కి చేరింది. అన్నింటి పైనా అదనపు భారం.. చమురు ఉత్పత్తుల ధరలు దిగివస్తాయని వినియోగదారులు ఆశిస్తున్న తరుణంలో మళ్లీ పెరగడం వారిని హతాశుల్ని చేసే పరిణామమే. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వాత వేస్తోంది. లీటరు పెట్రోలుపై ప్రస్తుతం 32.55 శాతం, డీజిల్‌పై 21.33 శాతం ఈ భారమే పడుతోంది. ఈ పన్నుల భారంతో కలిపి జిల్లాలోని వాహనదారులపై నెలకు దాదాపు రూ.36 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. దీని ప్రభావం జిల్లాలోని కొబ్బరి, అరటి, బియ్యం, పౌల్ట్రీ వ్యాపారాలపైనా పడుతుంది. మరోవైపు వేసవిలో సాగునీటి కోసం డీజిల్ మోటార్లను వినియోగించే రైతులపైనా అదనపు భారం పడుతుంది. మెట్ట భూముల్లో దుక్కు చేయడానికి ట్రాక్టరు అద్దె కూడా పెరిగిపోతుంది. ఇక జిల్లాకు రవాణా అయ్యే కూరగాయలు, దుంపలు ఇతర నిత్యావసర వస్తువుల పైనా డీజిల్ ధర పెంపు ప్రభావం కనిపిస్తుంది. దీంతో సామాన్యుల బడ్జెట్‌కు సెగ తప్పదు. ఆర్టీసీపై అరకోటి భారం జిల్లాలోని అన్ని డిపోల ఆర్టీసీ బస్సులకు నెలకు 65 వేల లీటర్లు డీజిల్ వినియోగమవుతోంది. వ్యాట్ తదితర పన్నులతో కలిపి డీజిల్‌పై లీటరుకు రూ.2.25 చొప్పున ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. ఇలా సగటున నెలకు రూ.50 లక్షల వరకూ ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో డీజిల్ రూపేణా రూ.6 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీకి ఈ పెంపు పుండు మీద కారమనే చెప్పాలి. దీని ప్రభావం ప్రయాణికులపై పడుతుందనడంలో సందేహం అక్కర్లేదు. -
పోలీసు పహారాలో ఉస్మానియా యూనివర్సిటీ
-
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్‌పై రూ.1.60, లీటర్ డీజిల్‌పై 40పైసలు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం శనివారం పెంచింది. శనివారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. సుంకం పెంపు కారణంగా తమపై భారాన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థలు వినియోగదారులపై మోపలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని ప్రముఖ చమురు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియంరంగం నుంచి సుంకం వసూళ్లను పెంచుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో మరో రూ.3,200 కోట్లు వచ్చే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.33,042 కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.99,184కోట్లు వచ్చాయి. అన్‌బ్రాండెడ్ లేదా సాధారణ పెట్రోల్‌పై లీటర్‌కు బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.5.46 నుంచి రూ.7.05కు పెరిగింది. -
విజిలెన్స్ నిల్.. అఫెన్స్ ఫుల్!
తనిఖీలు, పెట్రోలింగ్ మరచిన పోలీసులు రెచ్చిపోతున్న అసాంఘికశక్తులు సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు పెట్రోలింగ్, వాహన తనిఖీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతవారం రోజుల్లో నగరంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ . ఎన్నికలప్పుడు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదుతో పాటు మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఎన్నికలు ముగిశాక.. ఇక గస్తీ, వాహన తనిఖీలు ఎందుకనుకున్నారో ఏమో.. పోలీసులు వాటిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రౌడీషీటర్లు, దొంగలు, స్నాచర్లు రాత్రి, పగలు అనే తేడాలేకుండా రెచ్చిపోతున్నారు. నగర కొత్త పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుండగా... కింది స్థాయిలో మాత్రం అది ఆచరణకు నోచుకోకపోవడంతో అసాంఘికశక్తులు విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల్లో బేగంపేట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, హుస్సేనీఆలంలో జరిగిన ఘటనలు పోలీసుల పని తీరును వెక్కిరిస్తున్నాయి. రాత్రి గస్తీలేకే.... ఈనెల 21వ తేదీ తెల్లవారుజాము 4.30కి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నానగర్‌లో పాలవ్యాపారి తిరుపతిరా వు (29)పై శ్రీనివాస్ (ఇతనిపై వివిధ ఠా ణాలలో 30కి పైగా కేసులున్నాయి) పథకం ప్రకారం కళ్లల్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. రాత్రి పూట పోలీసుల గస్తీలేక పోవడం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గస్తీ ఉండి ఉంటే.. పోలీసులు ఘటనకు అరగంట ముందు నుంచే శ్రీనివాస్ పట్టుకొని తిరిగిన ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకొని ఉండేవారని, తిరుపతిరావు హ త్యకు గురై ఉండేవాడు కాదని స్థానికు లు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు శ్రీ నివాస్ ఆగడాలు రోజు రోజుకూ అధికమవుతున్నాయని, పోలీసులు అతడిపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కత్తులతో స్వైరవిహారం... చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలోని వాహెద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ ఖాలేద్ (20)పై పాత కక్షల నేపథ్యంలో ఈనెల 20న అదే కాలనీకి చెందిన పాతనేరస్తులు ఖాలాహిమ్నా, వాసిఫ్, అమర్లాల్ కత్తులతో దాడి చేశారు. ఖాలేద్ కడుపు, చేయి, తొడ భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. పట్టపగలే చోరీ... సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు దొంగలు తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి.. రూ.10 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చార్మినార్ సాక్షిగా.... రక్షణ శాఖ శాస్త్రవేత్త ఆర్.సత్పత్తిపై చైన్‌స్నాచర్ కత్తితో దాడి చేశాడు. చార్మినార్ సాక్షిగా.. పోలీసు స్టేషన్ ఎదుటే ఆదివా రం మధ్యాహ్నం 12.30కి ఈ ఘటన జరిగింది. నగరంలో చైన్‌స్నాచర్ల స్వైరవిహారం నిత్యకృత్యంగా మారింది. అయి నా.. పోలీసులు మాత్రం స్నాచర్లను నియంత్రించలేకపోతున్నారు. నగరంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒకపక్క ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. మరోపక్క పోలీసులు తమ విధులను మరచిపోవడం గమనార్హం. ఇప్పటికైనా గస్తీని పెంచి అసాంఘికశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రజలు కోరుతు న్నారు.