న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్‌పై రూ.1.60, లీటర్ డీజిల్‌పై 40పైసలు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం శనివారం పెంచింది. శనివారం అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. సుంకం పెంపు కారణంగా తమపై భారాన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థలు వినియోగదారులపై మోపలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉంటాయని ప్రముఖ చమురు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియంరంగం నుంచి సుంకం వసూళ్లను పెంచుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంలో మరో రూ.3,200 కోట్లు వచ్చే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.33,042 కోట్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.99,184కోట్లు వచ్చాయి. అన్‌బ్రాండెడ్ లేదా సాధారణ పెట్రోల్‌పై లీటర్‌కు బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ.5.46 నుంచి రూ.7.05కు పెరిగింది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు
Published Sun, Nov 8 2015 1:19 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
Advertisement