
సాక్షి, ముంబై : ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు ధరలీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది. (చదవండి: వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు)
దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్‌కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్‌లో లీటరుకు 85.04 రూపాయలుగాను ఉంది. మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్‌కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్‌లో లీటరుకు రూ 80.17 రూపాయలు పలుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment