న్యూఢిల్లీ : రికార్డు స్థాయిల్లో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆయిల్ కంపెనీలు గత కొన్ని రోజులుగా ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. వరుసగా 11వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు తగ్గించాయి. లీటరు పెట్రోల్‌పై 40 పైసలు, లీటరు డీజిల్‌పై 30 పైసలు ధర తగ్గించినట్టు తెలిసింది. ఈ తగ్గింపు గత 10 రోజుల పోలిస్తే నేడే అత్యధిక తగ్గింపు. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.02గా నమోదైంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరల ప్రకారం.. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 84.84గా, కోల్‌కతాలో రూ. 79.68, చెన్నైలో రూ. 79.95గా, హైదరాబాద్‌లో రూ.81.59గా ఉంది. ఇక డీజిల్ ధరలు కూడా 30 పైసలు తగ్గడంతో, లీటర్ డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ. 68.28గా, ముంబైలో రూ. 72.70గా, కోల్‌కతాలో రూ. 70.83గా, చెన్నైలో రూ. 72.08గా, హైదరాబాద్‌లో రూ.74.22గా నమోదైంది. మొత్తంగా ఈ పదకొండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.42, డీజిల్ ధర రూ. 1.03 తగ్గింది. అయితే ధరలు పెంచేటప్పుడు భారీగా పెంపును చేపట్టిన ఆయిల్ కంపెనీలు, తగ్గించేటప్పుడు చాలా మెల్లగా చేపడుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment