Shocking Incident: Injured Girl Seeks Help, People Busy Filming Her, Video Viral - Sakshi
Sakshi News home page

కలిచివేసే ఘటన: చావుబతుకుల మధ్య ఉంటే చుట్టూ చేరి ఫోటోలు తీస్తూ...

Published Tue, Oct 25 2022 11:41 AM | Last Updated on Tue, Oct 25 2022 12:38 PM

Shocking Indident: Injured Girl Seeks Help People Busy Filming Her - Sakshi

లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్‌ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉ‍త్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది.

కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కున్వార్‌ అనుపమ్‌ సింగ్‌ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. 

(చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్‌..! ఫేస్‌బుక్‌ లైవ్‌ రికార్డు చేస్తుండగా మొబైల్‌ కొట్టేసిన స్నాచర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement