300 కోట్లు మాయంపై 6వారాల్లో వివరణ ఇవ్వండి!
రెండేళ్ళ క్రితం అనుమానాస్పద పరిస్థితుత్లో అస్సాంలో అదృశ్యమైన ఖజానా విషయాన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది.కోట్ల సంపద మాయమవ్వడాన్ని కఠినంగా స్వీకరించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు, అస్పాం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు సంపద అదృస్యంపై అస్పాం డీజీపీ సహా ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ టి. ఎస్ ఠాకూర్ అస్సాం ఖజానా అదృశ్యాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రెండేళ్ళ క్రితం అస్సాం డిస్ పూర్ లోని కాళికా మాత మందిరం నుంచి మాయమైన భారీ సంపదను అన్వేషించాలంటూ మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మనోజ్ కౌశల్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన జస్టిస్... కేంద్ర ప్రభుత్వంతోపాటు, అస్పాం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. కాళికా మాత మందిరంలోని విగ్రహం కింద సంపద ఉందనే విషయం రహస్యంగా తెలుసుకున్న ఆర్మీ బృందం అక్కడకు చేరేసరికే సంపద మొత్తం మాయమవ్వడంతో అప్పట్లో అక్కడ ఆర్మీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మనోజ్ కౌశల్ ఈ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ చేయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అవినీతి పోలీసు అధికారుల సాయంతోనే సంపద మాయమైనట్లు ఆయన ఆరోపించారు. మనోజ్ కౌశల్ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
అక్కడి వ్యాపారుల వద్ద బోడో ఉగ్రవాదులు డబ్బు వసూలు చేస్తుంటారని, అక్కడి టీ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు భట్టాచార్య టీగార్డెన్స్ యజమానులనుంచి డబ్బును వసూలు చేసి వారికి అందిస్తుంటారన్నది సంపద మాయం వెనుక సమాచారం. అంతేకాదు భట్టాచార్య అక్కడినుంచి మయన్మార్ కు బంగారం స్మగ్టింగ్ చేస్తారని కూడ చెప్నేవారు. దీంతో జరగక ముందే భట్టాచార్యతో పాటు ఆయన భార్యను కూడ గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారని, దీంతో ఘటనకు సంబంధించి అనుమానితులను గుర్తించి వారి కాల్ డేటాను కూడ కౌశల్ పరిశీలించారు. డేటానుబట్టి వీరంతా ఉమ్మడిగానే సంపదను మాయం చేశారని, అందుకు వారి బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తం బ్యాలెన్స్ ఉండటాన్ని కూడ కౌశల్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయంపై పోలీసులు ఏమాత్రం స్పందించలేదని, జాతి సంపద ఉగ్రవాదుల చేతిలో పడితే వ్యతిరేక చర్యలకు వినియోగించే అవకాశం ఉందని, ఆ సంపద ఎప్పటికైనా భారత ప్రభుత్వానికి దక్కాలని కౌశల్ వాదిస్తున్నారు. దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు అప్పట్లోనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, అస్సాం డీజీపీకి కూడ నోటీసులు జారీ చేసిన కోర్టు... విషయంపై ఆరు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది.