న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించింది. ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు సహజ వనరులు కావని తేల్చి చెప్పింది. వీటిని ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలులేదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8:1 మెజారిటీతో వివాదాస్పద అంశంపై మంగళవారం తీర్పు వెల్లడించింది.
- ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు
- అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే.. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు
- వీటిపై ప్రస్తుత ప్రైవేటీకరణ, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమకాలీన వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఉంది
- 1950ల్లో భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు.
- అప్పుడు జాతీయీకరణ జరుగుతోంది. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది.
- ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం కొత్తగా ఉండాలి.
- ప్రస్తుత భారత్‌కు అనుగుణంగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలి.. అని తీర్పును తెలియజేసింది ధర్మాసనం.
ప్రైవేటు ఆస్తులను సమాజవనరుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా, లేదా అనే అంశంపైర్పు వెలువడింది. మొత్తం మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బీవీ నాగరత్న, సుధాన్షు ధులియా, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసీ ఉన్నారు. వీరిలో జస్టిస్ బీసీనాగరత్న పాక్షికంగా ఏకీభవించగా..జస్టిస్ సుధాన్షు ధులియా విభేదించారు.
Comments
Please login to add a commentAdd a comment