
మద్యం అమ్మకాలపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: రహదారుల పక్కన మద్యం షాపుల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యువుల్ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది. జాతీయ, రాష్ట్రాల హైవేలకు మద‍్యం షాపులు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని స్పష్టం చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయించాలని పేర్కొంది.