సాక్షి, చెన్నై: తమిళనాడులో మద్యం షాపులు నిర్వహించుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షాపులు తెరవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మే 17 దాకా లిక్కర్ షాపులు మూసివేయాలని గతంలో మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో తెల్లవారు జామునుంచే మద్యం షాపులు ముందు పాదరక్షలు, హెల్మెట్‌లు, గొడుగులు దర్శన మిచ్చాయి. భౌతిక దూరం పాటిస్తూ.. టోకన్ సిస్టమ్ అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించడంతో మద్యం దుకాణాల ముందు రద్దీ నెలకొంది. కాగా.. రోజుకు ఒక్కో షాపు కేవలం 500 టోకెన్లు జారీ చేసి వాటికి మాత్రమే మద్యం అమ్మేలా చూడాలని ఆదేశించింది.
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టస్మాక్) ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడవనున్నాయి. వీటిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా.. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న చెన్నై, తిరువళ్లూర్, ఇతర కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగలిన ప్రాంతాల్లో మాత్రమే మద్యం షాపులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు
మద్యం షాపులుకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ.. షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమిళనాడులో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10,108కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ 2,599 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 71 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 7,435 యాక్టివ్ కేసులున్నాయి. అటు చెన్నైలో శుక్రవారం 309 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 5,947కి చేరింది. చదవండి: మద్యం అమ్మకాలు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
Comments
Please login to add a commentAdd a comment