ఢిల్లీ : కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మద్యం షాపులు తెరవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా పిటిషనర్‌పై లక్ష రూపాయల జరిమానా విధించింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, మస్కులు ధరించడం లాంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున లిక్కర్ షాపులు తక్షణం మూసి వేయాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. గౌతమ్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎల్‌ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయని, ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మద్యం షాపుల ముందు ప్రజలు బారులు తీరుతున్నందున ఆన్‌లైన్ ద్వారా మద్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ-టోకెన్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కేజ్రివాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం..టోకెన్ నెంబర్ ఆధారంగా వారిచ్చిన సమయంలోనే మద్యం కొనాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ముందుగానే వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా టోకెన్ నెంబర్ ఇస్తారు. (మందుబాబుల కోసం సరికొత్త వ్యూహం )
Comments
Please login to add a commentAdd a comment