
సుప్రీం కోర్టులో కరోనా కలకలకం రేగింది. న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులూ
సాక్షి, ఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేగింది. పలువురు న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులకు వైరస్ సోకింది. దీంతో ఇవాళ్టి(సోమవారం) నుంచి కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
కరోనా బారినపడ్డ న్యాయమూర్తుల్లో స్వలింగ వివాహల చట్టబద్ధతపై పిటిషన్లపై విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల బెంచ్‌లోని ఓ న్యాయమూర్తికి సైతం కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ్టి విచారణపై అనుమానాలు నెలకొన్నాయి.