న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ టెక్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్ వెంకటరమణన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు.
దీన్ని తిప్పి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)కి పంపి.. గూగుల్‌కు ’రెండో ఇన్నింగ్స్’ ఆ డే అవకాశం ఇవ్వొద్దని స్వయంగా సుప్రీం కోర్టే విచారణ జరపాలని కోరారు. అటు గూగుల్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ..ఏఎస్‌జీ సూచనలతో తాము కూడా ఏకీభవిస్తున్నామ ని, ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాల ని కోరుకుంటున్నామని విన్నవించారు. ఇరు పక్షా ల వాదనలు విన్న మీదట తదుపరి విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో గూగుల్‌కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
Comments
Please login to add a commentAdd a comment