వరంగల్ రూరల్ : హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆది నుంచీ అడ్డంకులే ఏర్పడుతున్నారుు. అటవీశాఖ అభ్యంతరాలు, సుప్రీంకోర్టు తీర్పులో జాప్యం, టెండర్ల డ్రామా, వర్గాల పట్టు వంటి కారణాలతో జాతీయ రహదారిలోని పస్రా-ఏటూరునాగారం రోడ్డు విస్తరణ పనులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో పడ్డారుు. అభ్యంతరాలు పరిష్కారం కాగా.. ఈ నిడివి మేడారం జాతరతో ముడిపడి ఉండడంతో 2014లో నిధులు మంజూరయ్యూరు.
ఈ మేరకు నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించాలని జాతీయ రహదారుల శాఖ అధికారులపై అప్పటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తీచ్చారు. వీరి ఒత్తిడి మేరకు అధికారులు నామినేషన్ పద్ధతిన పనులు కట్టబెట్టాలని ప్రతిపాదించారు. అరుుతే.. కేంద్రంలోని అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నిధులు సైతం అందుబాటులోకి రావడంతో ఎట్టకేలకు టెండర్లు నిర్వహించారు. రాష్ట్ర విభజన, ఎన్నికలు తదితర అంశాలతో అవి ఖరారు
కాలేదు.
ఆ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలు కావొస్తున్నా.. ఈ రహదారిని పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. సింగిల్ రోడ్డు కారణంగా మేడారం జాతర సమయంలో వేలాది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వ చ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు రానున్నారుు. ఈ రహదారిపై మళ్లీ రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముంది. దీనిని పరిగణనలోకి తీసుకుని టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి రహదారి పనులు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది.
రహదారి నంబర్ మారినా..
హైదరాబాద్-భూపాలపట్నం ప్రధాన రహదారిని 202 నంబర్ జాతీయ రహదారిగా గుర్తించారు. 20 ఏళ్లు గడుస్తున్నా.. పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం 163 జాతీయ రహదారిగా మారింది. అయినప్పటికీ దీని దశ మారలేదు. ఈ రహదారిలో భాగంగా హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు.. హన్మకొండ నుంచి ములుగు వరకు.. ములుగు నుంచి పస్రా వరకు.. రెండు లేన్లుగా విస్తరించారు. కానీ.. పస్రా నుంచి ఏటూరునాగారం చెక్‌పోస్టు వరకు టెండర్‌తోనే ఆగింది.
పస్రా నుంచి ఏటూరునాగారం చెక్‌పోస్టు వరకు సుమారు 27 కిలోమీటర్ల ఉంటుంది. ఈ రహదారి విస్తరణకు రూ.49.68 కోట్లు కేటారుుంచారు. ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాల్సి ఉన్నా.. రెండు దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ రోడ్డు అటవీశాఖ పరిధిలో ఉండడం వల్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈ రహదారి ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణకు తీసుకోనున్న చర్యలపై పర్యావరణ శాఖకు సంబంధిత అధికారులు వివరించి అనుమతి వచ్చేందుకు కృషి చేశారు.
ఈ మేరకు రెండేళ్ల కిందటే అటవీ, పర్యావరణ శాఖ నుంచి జాతీయ రహదారుల శాఖ అనుమతి పొందింది. చివరకు సుప్రీంకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. గత మేడారం జాతరలోపే పనులు పూర్తి చేసి రాకపోకలకు దారి సుగమం చేస్తారని అందరూ భావించినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది.
అడ్డంకుల రహదారి
Published Wed, Nov 12 2014 2:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement