bhupalapatnam
-
రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ పట్టివేత
-
చంపి.. సంచిలో కట్టి.. చెరువులో పడేసి
సాక్షి, రాజానగరం: బొమ్మూరు పోలీసు స్టేషనులో వ్యక్తి అదృశ్యం కేసుగా నమోదైన యువకుడు మండలంలోని భూపాలపట్నం చెరువులో శవమై తేలాడు. తల, మొండెం వేరుచేయబడి ఉన్న ఈ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం చూసి వీఆర్వో కాళ్ల మోహనరావు ద్వారా రాజానగరం పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తిగత కక్షలో, మరో కారణమో తెలియదుగానీ ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా నరికి, సిమెంటు సంచిలో వేసి మూట కట్టి చెరువులో పడవేశారు. అయితే మూట కట్టు విడిపోయి, సంచెలో నుంచి కాళ్లు బయటకు వచ్చి నీటిపై తేలడంతో స్థానికుల ద్వారా బయటపడింది. ఈ సంఘటన వివరాలను మంగళవారం రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. భూపాలపట్నం శివారులోని చెరువులో తేలిన ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం శాంతిపురానికి చెందిన రొంగలి దుర్గాప్రసాద్(22)గా గుర్తించారు. అవివాహితుడైన ఆ యువకుడు ఈనెల 13న ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని అతడి తండ్రి వీరబాబు ఈనెల 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విరోధులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేరొక ప్రాంతంలో హత్య చేసి, ఆపై తలను, మొండేన్ని వేరుచేసి, సంచిలో మూట కట్టి, ఇక్కడికి తీసుకువచ్చి పడవేసి ఉంటారని తెలిపారు. చెరువులో నుంచి మృతదేహాన్ని వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు, రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల, మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం -
అడ్డంకుల రహదారి
వరంగల్ రూరల్ : హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి ఏ ముహూర్తాన ప్రకటించారో.. ఆది నుంచీ అడ్డంకులే ఏర్పడుతున్నారుు. అటవీశాఖ అభ్యంతరాలు, సుప్రీంకోర్టు తీర్పులో జాప్యం, టెండర్ల డ్రామా, వర్గాల పట్టు వంటి కారణాలతో జాతీయ రహదారిలోని పస్రా-ఏటూరునాగారం రోడ్డు విస్తరణ పనులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో పడ్డారుు. అభ్యంతరాలు పరిష్కారం కాగా.. ఈ నిడివి మేడారం జాతరతో ముడిపడి ఉండడంతో 2014లో నిధులు మంజూరయ్యూరు. ఈ మేరకు నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించాలని జాతీయ రహదారుల శాఖ అధికారులపై అప్పటి రాజకీయ నాయకులు ఒత్తిళ్లు తీచ్చారు. వీరి ఒత్తిడి మేరకు అధికారులు నామినేషన్ పద్ధతిన పనులు కట్టబెట్టాలని ప్రతిపాదించారు. అరుుతే.. కేంద్రంలోని అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నిధులు సైతం అందుబాటులోకి రావడంతో ఎట్టకేలకు టెండర్లు నిర్వహించారు. రాష్ట్ర విభజన, ఎన్నికలు తదితర అంశాలతో అవి ఖరారు కాలేదు. ఆ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలు కావొస్తున్నా.. ఈ రహదారిని పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. సింగిల్ రోడ్డు కారణంగా మేడారం జాతర సమయంలో వేలాది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వ చ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు రానున్నారుు. ఈ రహదారిపై మళ్లీ రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముంది. దీనిని పరిగణనలోకి తీసుకుని టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి రహదారి పనులు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. రహదారి నంబర్ మారినా.. హైదరాబాద్-భూపాలపట్నం ప్రధాన రహదారిని 202 నంబర్ జాతీయ రహదారిగా గుర్తించారు. 20 ఏళ్లు గడుస్తున్నా.. పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. రెండేళ్ల క్రితం 163 జాతీయ రహదారిగా మారింది. అయినప్పటికీ దీని దశ మారలేదు. ఈ రహదారిలో భాగంగా హైదరాబాద్ నుంచి హన్మకొండ వరకు.. హన్మకొండ నుంచి ములుగు వరకు.. ములుగు నుంచి పస్రా వరకు.. రెండు లేన్లుగా విస్తరించారు. కానీ.. పస్రా నుంచి ఏటూరునాగారం చెక్‌పోస్టు వరకు టెండర్‌తోనే ఆగింది. పస్రా నుంచి ఏటూరునాగారం చెక్‌పోస్టు వరకు సుమారు 27 కిలోమీటర్ల ఉంటుంది. ఈ రహదారి విస్తరణకు రూ.49.68 కోట్లు కేటారుుంచారు. ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాల్సి ఉన్నా.. రెండు దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ రోడ్డు అటవీశాఖ పరిధిలో ఉండడం వల్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈ రహదారి ఆవశ్యకత, వన్యప్రాణుల రక్షణకు తీసుకోనున్న చర్యలపై పర్యావరణ శాఖకు సంబంధిత అధికారులు వివరించి అనుమతి వచ్చేందుకు కృషి చేశారు. ఈ మేరకు రెండేళ్ల కిందటే అటవీ, పర్యావరణ శాఖ నుంచి జాతీయ రహదారుల శాఖ అనుమతి పొందింది. చివరకు సుప్రీంకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. గత మేడారం జాతరలోపే పనులు పూర్తి చేసి రాకపోకలకు దారి సుగమం చేస్తారని అందరూ భావించినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. -
హైదరాబాద్-భూపాలపట్నం హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్
భువనగిరి: నిరీక్షణ ఫలించింది. జిల్లాలోని హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని భువనగిరి మండలం రాయిగిరి నుంచి వరంగల్ వరకు సుమారు 77 కిలో మీటర్ల హైవేను నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించడానికి బుధవారం రూ.1487.95 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు విస్తరణను రెండు దశలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో రాయిగిరి నుంచి వరంగల్ వరకు, రెండో దశలో హైదరాబా ద్ నుంచి రాయిగిరి వరకు నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. కా గా గత ఏడాది యూపీఏ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా సంస్కృతి టౌన్షిప్ నుంచి రాయిగిరి వరకు నిర్మించిన 38 కిలోమీటర్ల హైవే రోడ్డుకు అనుసంధానం చేస్తూ కొత్తగా రాయిగిరి నుంచి వరంగల్ వరకు బీఓటీ(నిర్మించు.. నిర్వహించు.. బదలాయించు) పద్ధతిలో రోడ్డు వెడ ల్పు, నాలుగు, ఆరులైన్ల రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ నిధులు విడుదల చేయలేదు. రెండు చోట్ల బైపాస్‌లు భువనగిరి మండలం రాయిగిరి నుంచి వంగపల్లి, ఆలేరు మీదుగా వరంగల్ జిల్లా జనగాం వరకు చేపట్టే రోడ్డు కోసం రెండు చోట్ల బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. వంగపల్లి, ఆలేరు పట్టణాల పక్కగా బైపాస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏ మార్గం గుండా బైపాస్ వెళ్తుందనే వివరాలను వారి సర్వే ఆధారంగా సమాచారాన్ని అందించారు. ఆలేరులో 66/2 కిలోమీటర్ల నుంచి 73/7 కిలోమీటర్ల వరకు, వంగపల్లిలో 58/111 నుంచి 60/35 వరకు రెండు కిలోమీటర్ల మేర బైపాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సర్వే నంబర్ల వారీగా వివరాలను జాతీయ రహదారి అధికారులు అందజేశారు. తాజాగా ఆలేరు బైపాస్ విషయంలో మళ్లీ మార్పు జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భూ సేకరణపై కసరత్తు రాయగిరి నుంచి జిల్లా సరిహద్దులోని ఆలేరు మండలం ప టేలగూడెం వరకు హైవేగా విస్తరించడానికి అవసరమైన సుమారు 24 కిలోమీటర్ల మేర భూమి సేకరణ ప్రకటన ఇంతవరకు జారీ కాలేదు. భూమిని సేకరించడానికి పత్రికా ప్రకటన జారీ చేస్తారు. అయితే అది ఎప్పటిలోగా జారీ చేస్తారో తెలియని పరిస్థితి నెల కొంది. భూసేకరణకోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, శిఖం, బంచరాయి, ప్రైవేటు భూముల వివరాలను సేకరిచారు. భూముల సేకరణలో తరి, మెట్ట పొలాల వివరాలు తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.