హైదరాబాద్-భూపాలపట్నం హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్
భువనగిరి: నిరీక్షణ ఫలించింది. జిల్లాలోని హైదరాబాద్-భూపాలపట్నం 163 జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలోని భువనగిరి మండలం రాయిగిరి నుంచి వరంగల్ వరకు సుమారు 77 కిలో మీటర్ల హైవేను నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించడానికి బుధవారం రూ.1487.95 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు విస్తరణను రెండు దశలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో రాయిగిరి నుంచి వరంగల్ వరకు, రెండో దశలో హైదరాబా ద్ నుంచి రాయిగిరి వరకు నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. కా గా గత ఏడాది యూపీఏ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా సంస్కృతి టౌన్‌షిప్ నుంచి రాయిగిరి వరకు నిర్మించిన 38 కిలోమీటర్ల హైవే రోడ్డుకు అనుసంధానం చేస్తూ కొత్తగా రాయిగిరి నుంచి వరంగల్ వరకు బీఓటీ(నిర్మించు.. నిర్వహించు.. బదలాయించు) పద్ధతిలో రోడ్డు వెడ ల్పు, నాలుగు, ఆరులైన్ల రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ నిధులు విడుదల చేయలేదు.
రెండు చోట్ల బైపాస్‌లు
భువనగిరి మండలం రాయిగిరి నుంచి వంగపల్లి, ఆలేరు మీదుగా వరంగల్ జిల్లా జనగాం వరకు చేపట్టే రోడ్డు కోసం రెండు చోట్ల బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నారు. వంగపల్లి, ఆలేరు పట్టణాల పక్కగా బైపాస్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏ మార్గం గుండా బైపాస్ వెళ్తుందనే వివరాలను వారి సర్వే ఆధారంగా సమాచారాన్ని అందించారు. ఆలేరులో 66/2 కిలోమీటర్ల నుంచి 73/7 కిలోమీటర్ల వరకు, వంగపల్లిలో 58/111 నుంచి 60/35 వరకు రెండు కిలోమీటర్ల మేర బైపాస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సర్వే నంబర్ల వారీగా వివరాలను జాతీయ రహదారి అధికారులు అందజేశారు. తాజాగా ఆలేరు బైపాస్ విషయంలో మళ్లీ మార్పు జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
భూ సేకరణపై కసరత్తు
రాయగిరి నుంచి జిల్లా సరిహద్దులోని ఆలేరు మండలం ప టేలగూడెం వరకు హైవేగా విస్తరించడానికి అవసరమైన సుమారు 24 కిలోమీటర్ల మేర భూమి సేకరణ ప్రకటన ఇంతవరకు జారీ కాలేదు. భూమిని సేకరించడానికి పత్రికా ప్రకటన జారీ చేస్తారు. అయితే అది ఎప్పటిలోగా జారీ చేస్తారో తెలియని పరిస్థితి నెల కొంది. భూసేకరణకోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, శిఖం, బంచరాయి, ప్రైవేటు భూముల వివరాలను సేకరిచారు. భూముల సేకరణలో తరి, మెట్ట పొలాల వివరాలు తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.