- తెలంగాణలో జాతీయరహదారులపై హైవేల సంస్థ చైర్మన్ ఆర్పీ సింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూసేకరణను పూర్తి చేసి ఉంటే హైవేల నిర్మాణానికి అభ్యంతరం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. పీపీపీ విధానం అనుమతిస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో శుక్రవారం సచివాలయంలో ఆర్పీ సింగ్ భేటీ అయ్యారు.
ఈ విష యమై రహదారుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయిన నేపథ్యంలో కేంద్ర ఉపరి తల రవాణా శాఖ మంత్రి గడ్కారీ ఆదేశాల మేరకు ఆర్‌పీసింగ్ సీఎస్‌ను కలిశారు.
ప్రతి పాదిత జాతీయ రహదారులు..
1. హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి-బాన్సువాడ-బోధన్
2.హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు వయా మొయినాబాద్-చేవెళ్ల- మన్నెగూడ- పరిగి -కొడంగల్ మీదుగా కర్నాటక సరిహద్దు వరకు,
3. కోదాడ-మిర్యాలగూడ-దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర్ల
4. నిర్మల్-జగిత్యాల వయా ఖానాపూర్-మల్లాపూర్-రాయికల్
5. అశ్వారావుపేట-ఖమ్మం-సూర్యాపేట
6. కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం వరకు హైవే పనులు చేపట్టాలని సీఎస్ కోరారు.